సంపాదకీయం

చైనా ‘వల’లో మనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా సైనికులతో కలసి మన సైనికులు ఉమ్మడి విశ్వాసాలను నిర్వహించడానికి రంగం సిద్ధం కావడం మన రక్షణ విధానంలో నిహితమై ఉన్న వైరుధ్యాలకు సరికొత్త సాక్ష్యం. ఈ ఉమ్మడి సైనిక విన్యాసాలు డిసెంబర్ నెలలో చైనాలోని ‘చెంగుడూ’ ప్రాంతంలో ప్రదర్శితం కానున్నాయట. ఇందుకు సంబంధించిన ‘కార్యాచరణ’ ప్రణాళికను సిద్ధంచేయడానికై నవంబర్ ఒకటవ తేదీ నుంచి మూడురోజులపాటు ‘చెంగుడూ’లో ఉభయ దేశాల ఉన్నత స్థాయి సమావేశం జరుగనున్నదట! మన దేశానికి చెందిన దాదాపు రెండువందల మంది సైనికులు ఈ ఉమ్మడి ప్రహసనంలో భాగస్వాములు కానున్నారట! భారత-్భటాన్- టిబెట్ సంగమస్థలి వద్ద డెబ్బయి మూడు రోజులపాటు గత ఏడాది కొనసాగిన సంఘర్షణ ముగిసిన తరువాత జరుగుతున్న ఈ మొదటి ఉమ్మడి సైనిక విన్యాసంవల్ల ఉభయ దేశాల మధ్య ‘మైత్రి’ మరింత పెరుగుతుందన్నది జరుగుతున్న ప్రచారం! మన దేశంలోని సామాన్య ప్రజలలో అత్యధికులకు చైనా మనకు శత్రు దేశమన్న ధ్యాస లేదు. ఇలా ధ్యాస లేకపోవడానికి ఏకైక కారణం మన ప్రభుత్వాల దశాబ్దుల వైఫల్యం. మాతృభూమి ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించాలన్న నిష్ఠ నీరుకారిపోవడం ఈ వైఫల్యం. చైనాలో 1949లో కమ్యూనిస్టుల ఏకపక్ష రాజ్యాంగ నియంతృత్వ వ్యవస్థ ఏర్పడిన నాటినుంచి టిబెట్ దేశానికి మన దేశానికి చైనా దురాక్రమణ ప్రమాదం ఏర్పడిపోయింది. 1959నాటికి టిబెట్‌ను చైనా పూర్తిగా కబళించింది. రెండువేల ఐదు వందల ఏళ్లపాటు, 1959వరకు, టిబెట్ స్వతంత్ర దేశం. టిబెట్ మన దేశానికి ఉత్తరంగాను, చైనాకు దక్షిణంగాను ఉభయ దేశాల మధ్యలో నెలకొని ఉంది. అందువల్ల టిబెట్ విస్తరించినంత మేర మన దేశానికి చైనాకు మధ్య సరిహద్దులేదు, సరిహద్దు లేదు కాబట్టి చైనాకు మనకు మధ్య వివాదం లేదు, అందువల్ల చైనా మన దేశంపై దురాక్రమించడానికి రెండువేల ఐదువందల ఏళ్లపాటు 1959వరకు వీలు పడలేదు. క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దివరకు టిబెట్ మన దేశంలో- అఖండ భారతదేశంలో- భాగం.... ఆ తరువాత స్వతంత్ర దేశం. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం టిబెట్‌ను దురాక్రమించి దిగమింగడంతో భారత- టిబెట్ సరిహద్దు భారత చైనా సరిహద్దుగా మారింది. టిబెట్‌ను- దాదాపు ఐదులక్షల చదరపు మైళ్ల వైశాల్యంకల సువిశాల టిబెట్‌ను- చప్పరించిన తరువాత కూడ చైనాకు ‘దురాక్రమణ ఆకలి’ తీరలేదు, రక్తదాహం తీరలేదు. అందువల్ల 1962లో చైనా మన దేశంలోకి కూడ చొరబడి బీభత్సకాండకు పూనుకొంది. యాబయి ఆరేళ్లకు పైగా మన దేశానికి చెందిన దాదాపు యాబయి వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తన అక్రమ అధీనంలో ఉంచుకొంది! ఇలా చైనా మనకు శత్రుదేశం... కానీ ఈ సంగతిని సామాన్య ప్రజలకు తెలియచేయడంలో మన ప్రభుత్వం దశాబ్దులుగా విఫలమైంది. సామాన్య ప్రజలకు మాత్రమేకాదు, మేధావులలోను రాజకీయవేత్తలలోను అధికారులలోను, ప్రచార మాధ్యమ ప్రతినిధులలోను అత్యధికులకు చైనా మనకు చేసిన ద్రోహం గురించి ధ్యాసలేదు, కలిగిస్తున్న నష్టం గురించి స్పృహ లేదు....
అందువల్లనే ప్రచార మాధ్యమ విశే్లషకులు సందు దొరికినప్పుడల్లా ‘ఆషామాషీ’గా ‘్భరత-చైనా మైత్రి’ పెంపొందడం గురించి విచిత్ర విశే్లషణలు చేస్తున్నారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు చైనాలో పర్యటించి ‘‘పెట్టుబడుల’’కోసం దేబరించి వస్తున్నారు, చైనాకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’వారు మన దేశంలో పెట్టుబడులుపెట్టి ‘వాణిజ్య సామ్రాజ్యాల’ను ఏర్పాటుచేసుకొనడానికి దోహదం చేస్తున్నారు. ఈ వాణిజ్య ‘సామ్రాజ్యలు’ చైనావారి గూఢచర్యానికి, భారత వ్యతిరేక విద్రోహకాండకు నిలయమైపోతుండడం గురించి ఈ ముఖ్యమంత్రులకు మంత్రులకు ధ్యాసలేదు. ఇలా ‘పెట్టుబడుల’ మోహం పరోక్షంగా దేశద్రోహానికి దారితీస్తోంది. ‘నిర్వాహకుల’కే అవగాహన లేనప్పుడు సామాన్యులకేమి ధ్యాస ఉంటుంది? ‘్ధ్యస’లేనివారు చైనా వస్తువులను కొనుగోలు చేసి శత్రుదేశానికి లక్షల కోట్ల రూపాయల లాభాలను సంతరించిపెడుతున్నారు. వీరికి ‘‘చైనీస్’’ భోజనశాలల పట్ల వ్యామోహం పెరుగుతోంది, ‘‘చైనా వంటకాల’’ - చైనీస్ ఫుడ్-ను చూసిన వెంటనే వారి నోళ్లు ముక్కులు ఊరుతున్నాయి. చైనాతో మనం వాణిజ్య సంబంధాలను పెంచుకోవడం మన ప్రభుత్వాల దశాబ్దుల ‘దివాలాకోరు’ విధానాలకు చిహ్నం... చైనా మన భూభాగాలను మనకు తిరిగి అప్పగించేవరకు వాణిజ్య స్నేహసంబంధాలకు అవకాశంలేదన్నది 1962వ 1988వ సంవత్సరాల మధ్య మన ప్రభుత్వ విధానం. కానీ రాజీవ్‌గాంధీ మన ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో ఈ ‘బాట’ను మన ప్రభుత్వం పగులగొట్టింది. చైనాపట్ల కల స్నేహవ్యామోహం ఇందుకు కారణం. అందువల్ల కొత్త ‘పథభగ్న’ విధానం- పాత్‌బ్రేకింగ్ పాలసీ- అమలులోకి వచ్చింది. సరిహద్దు వివాదంతోను, చైనా దురాక్రమిత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంతోను సంబంధం లేకుండా చైనాతో వాణిజ్యమైత్రిని దౌత్యమైత్రిని ఇతర రకాల విచిత్ర మైత్రులను పెంపొందించుకోవాలన్నది ఈ పథభగ్న విధానం....
ఈ పథభగ్న విధానం ఇప్పటివరకూ కొనసాగుతుండడం మన ప్రభుత్వాలు ఒడిగడుతున్న హిమాలయ మహాపరాధం. ఈ విధానం కొనసాగినంతకాలం చైనా దురాక్రమణగ్రస్తమైన మన భూభాగాన్ని మనం తిరిగి సాధించడం కల్ల. చైనా మనకంటె నాలుగు రెట్లు అధికంగా సైనిక వ్యయంచేస్తోంది. ఇది వెల్లడి అవుతున్న ఆధికారిక సమాచారం. కానీ బహిరంగ పరచని సైనిక వ్యయం మరింత ఉంది. ఈ సైనిక వ్యయం ప్రధాన లక్ష్యం మన దేశాన్ని దెబ్బతీయడం. ఇలాంటి శత్రుదేశాలతో మనం జరుపుతున్న వాణిజ్యంవల్ల ప్రతి సంవత్సరం దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మనకు ‘లోటు’ ఏర్పడుతోంది. అంటే మన చైనాకు ఎగుమతిచేస్తున్న వస్తువుల కంటె, చైనానుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువుల విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర ఎక్కువ. చైనానుంచి వస్తున్న సామగ్రిలో అత్యధికం నాసిరకం... అక్కడ పనికిరానివి, మరే దేశం కూడ దిగుమతి చేసుకోనివి, మనకు కూడ అవసరంలేనివి ఈ నాసిరకం వస్తువులు! ఈ దిగుమతులు పెరగడంవల్ల ‘లోటు’ పెరిగి మన ప్రజలు కష్టపడి సంపాదించిన ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ’ చైనాకు తరలిపోతోంది. ఏటా రెండున్నర లక్షల కోట్ల రూపాయల ‘వినిమయ ద్రవ్యం’ ఇలా మనం చైనాకు అప్పగిస్తున్నాము. మన రక్షణ వార్షిక వ్యయం దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు. అక్కరలేని చైనా దిగుమతులను మనం ఆపివేసినట్టయితే మనకు ఏటా రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీయ వినిమయ ద్రవ్యం ఆదా అవుతుంది!! ‘‘సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యేవరకు, మా సీమల నుండి మీరు వైదొలగేవరకు, మీతో మాకు వాణిజ్యం వద్దు, మీ పెట్టుబడులు మాకు వద్దు... మీతో మాకు ఉమ్మడి సైనిక విన్యాసాలువద్దు!’’ అని మన ప్రభుత్వం చైనాకు చెప్పగలగాలి. ఇలా చెప్పవలసిందిగా ప్రభుత్వాన్ని ఒప్పించగల జన చైతన్య ఉద్యమం రూపొందాలి! కానీ ‘‘పిల్లిమెడలో గంట కట్టగల’’ వారు ఎవ్వరు??
చైనా ఇప్పటికీ భౌతికంగాను వ్యూహాత్మకంగాను దురాక్రమణను సాగిస్తోంది. మన సిక్కింలోను, భూటాన్‌లోను విస్తరించి ఉన్న ‘డోక్‌లా’- డోక్‌లాం పచ్చిక మైదానంలోని చైనా దళాలు గత సంవత్సరం చొరబడి డెబ్బయి మూడురోజులు తిష్ఠవేయడం భౌతిక దురాక్రమణకు నిదర్శనం.... పాకిస్తాన్‌లోని అఝార్‌మసూద్ వంటి పైశాచిక బీభత్సకారులను, జిహాదీలను చైనా సమర్ధించడం మన దేశానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న వ్యూహాత్మక దురాక్రమణ! మన ‘బ్రహ్మా’ క్షిపణికి దీటైన క్షిపణులను చైనా తయారుచేసిందట... వాటిని పాకిస్తాన్‌కు సరఫరా చేయాలని చైనా నిర్ణయించడం ‘చెంగుడూ’ విన్యాసాలకు నేపథ్యం... మన మిత్ర దేశమైన రష్యా పాకిస్తాన్‌తో కలసి ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించడం మనకు వ్యతిరేకంగా జరిగిన పరిణామం. కానీ చైనాతో కలసి ఉమ్మడి విన్యాసాలను నిర్వహించే మన ప్రభుత్వం ‘రష్యా పాకిస్తాన్’ ఉమ్మడి విన్యాసాలను ఎలా విమర్శించగలదు??