సంపాదకీయం

‘చక్మా’ల వ్యథ.. మొదటికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్మా తెగకు చెందిన బంగ్లాదేశీయ శరణార్థి హిందువుల వ్యథ మళ్లీ మొదటికి వచ్చింది. జిహాదీ బీభత్సకాండ ఫలితంగా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లా నుంచి పారిపోయి వచ్చి మనదేశంలో తలదాచుకుంటున్న ఈ ‘వనవాసీ’ ప్రజలకు ‘‘మనదేశపు పౌరసత్వం కల్పించడం లేదట’’! ‘‘అరుణాచల్ ప్రదేశ్‌లోను ఇతర ఈశాన్య ప్రాంతాలలోను తలదాచుకుంటున్న ఈ చక్మా శరణార్థులకు మనదేశపు పౌరసత్వం కల్పించవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానం 2015లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండేళ్లపాటు సర్వోన్నత న్యాయాదేశాన్ని అమలు జరపకుండా ‘‘మీనమేషాలు లెక్కిస్తు’’ కాలయాపన చేసిన ప్రభుత్వం ఈ ఉత్తరువును శిరసావహిస్తున్నట్లు గతవారం ప్రకటించింది, లక్షమంది చక్మా శరణార్థులకు ‘పౌరసత్వం’ ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గత పదమూడవ తేదీన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం గైకొన్నారు. అరుణాచల్‌లోను, ఈశాన్యంలోను 1964వ 1969వ సంవత్సరాల మధ్య స్థిరపడిన చక్మా శరణార్థులు తమ కష్టాలు తీరినట్లు మురిసిపోయారు. ఈ ఆనందోత్సాహాల ఉద్ధృతి తగ్గకముందే, మంగళవారం దేశ వ్యవహారాల సహాయమంత్రి కిరణ్ రిజీజూ చేసిన ‘ఆవిష్కరణ’ చక్మాలపై ఊహించని అశనిపాతం! ‘చక్మా హోజోంగ్’ హిందువులకు పౌరసత్వం కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ఆచరణకు సాధ్యం కాదని రిజీజూ వక్కాణించడం విస్మయకరమైన విపరిణామం! అందువల్ల చక్మా హోజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం లేదట! దశాబ్దులుగా ప్రభుత్వాల అమానవీయ విధానాలకు, స్థానిక స్వార్థశక్తుల అమానుష ప్రవర్తనకు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన చక్మా వనవాసీలు బలయ్యారు. ‘దేశం’లేని ప్రజలుగా జీవచ్ఛవ సమాన జీవనయాత్ర సాగించారు! ప్రస్తుతం కేంద్రప్రభుత్వ విధానంలో మానవీయత వికసించిందని దేశ ప్రజలు సంతోషిస్తున్న తరుణంలో రిజీజూ ఈ ‘అమానుష’ విధానాన్ని పునరావిష్కరించాడు! గత ప్రభుత్వాల వలెనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడ చక్మాల పట్ల నిర్దయను కొనసాగించగలదన్నది రిజీజూ చెప్పుకొచ్చిన మహావిషాదం! అరుణాచల్ ప్రదేశ్‌లో నివసిస్తున్న చక్మాలకు పౌరసత్వం ప్రసాదించడం వల్ల ఈ ప్రాంతపు సామాజిక, జనబాహుళ్య సమతుల్యత దెబ్బతింటుందట! అందువల్ల సర్వోన్నత న్యాయ నిర్ణయాన్ని ఈ వ్యవహారంలో రుద్దడానికి వీలులేదన్నది రిజీజూ తేల్చిన నిగ్గు... కానీ ఈ విషయమై దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎందుకు ప్రకటన చేయలేదు?? ప్రధానమంత్రికాని, దేశ వ్యవహారాల మంత్రికాని ఇలాంటి ప్రధానమైన విధాన నిర్ణయాలను ప్రకటించాలి. సహాయమంత్రి స్పష్టీకరణ ఇవ్వడం ఏమిటో??
లక్షమంది నిస్సహాయ శరణార్థులకు, జిహాదీల కరకు కోరలకు బలైపోకుండా తప్పించుకొని వచ్చిన వనవాసీలకు పౌరసత్వం కల్పించినందువల్ల ఈశాన్యంలోని స్థానిక జనబాహుళ్య సమతుల్య స్థితి ఎలా భంగపడుతుంది?? భంగపడుతుందని రిజీజూ చెప్పడం విచిత్రమైన వ్యవహారం, హాస్యాస్పదమైన నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం! అరుణాచల్ జనాభా దాదాపు పదమూడు లక్షలు. లక్షమంది చక్మాలకూ అరుణాచల్ లోనే శాశ్వత నివాసం కల్పించినప్పటికీ జనబాహుళ్య సమతుల్యం దెబ్బతినబోదు! ఈ లక్షమందికీ ఈశాన్యంలోని ఇతర ప్రాంతాలలో సైతం పునరావాసం కల్పించడం గొప్ప విషయం కాదు. దేశమంతటా కూడా వీరిని నివసింపచేయవచ్చు! అందువల్ల చక్మాలకు పౌరసత్వం ప్రదానం చేయడం ‘సమతుల్య’ స్థితికి భంగకరం కాదు! జమ్మూకశ్మీర్‌లో సైనిక దళాలపై భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్న జిహాదీ ఉగ్రవాదులను, దేశద్రోహులను మంచిమార్గంలో పెట్టడానికి కేంద్రప్రభుత్వం ఏళ్ల తరబడి వారికి పునరావాసం కల్పిస్తోంది! ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది! కానీ నిస్సహాయులైన, ఉగ్రవాదానికి బలైపోయిన చక్మాలకు పునరావాసం కల్పించడానికి ఎంత ఖర్చు చేసింది??
బెంగాల్‌లోని, అస్సాంలోని బంగ్లాదేశ్ నుండి దశాబ్దుల తరబడి రెండుకోట్ల మందికి పైగా అక్రమ ప్రవేశకులు చొరబడిపోయారు. ఈ అక్రమ ప్రవేశకుల వల్ల బెంగాల్‌లోను ఈశాన్య ప్రాంతంలోను జనబాహుళ్య సంతులనం ఇదివరకే దెబ్బతినింది. అక్రమ ప్రవేశకులు వోటర్లుగా నమోదైపోయారు, స్థానికులుగా చెలామణి అవుతున్నారు! ఇలా ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే లక్షల మంది విదేశీయులు గుట్టుచప్పుడు కాకుండా భారతీయ పౌరులైపోయారు! దశాబ్దుల తరబడి దీన్ని నిరోధించలేని ప్రభుత్వాలు నిస్సహాయులైన మరో లక్షమందికి పైగా చక్మా శరణార్థులను త్రిపురనుంచి వెనక్కి బంగ్లాదేశ్‌లోకి నెట్టాయి. ఇలా తరలింపునకు గురి అయిన చక్మాలు తిరిగి బంగ్లాదేశ్‌లోని తమ నివాసప్రాంతమైన చిట్టగాంగ్ జిల్లాకు వెళ్లవలసి వచ్చింది! అలా తిరిగి వెళ్లిన చక్మాలను నిర్మూలించడానికై జిహాదీలు బీభత్సకాండను జరుపుతూనే ఉన్నారు. ఫలితంగా చిట్టగాంగ్ జిల్లాలో 1947 నాటికి, జనాభాలో తొంబయి ఐదు శాతం ఉండిన చక్మా బౌద్ధుల, హిందువుల సంఖ్య ప్రస్తుతం యాబయి ఐదు శాతానికి పడిపోయింది.! బంగ్లాదేశ్ ప్రభుత్వమే దశాబ్దుల తరబడి చిట్టగాంగ్‌లో హిందువులను నిర్మూలించడానికై ‘జిహాదీ’లను ఉసిగొల్పడం చరిత్ర! షేక్ హసీనా నాయకత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలా ‘జిహాదీ’లను ఉసిగొల్పడం లేదు. కానీ ప్రభుత్వేతర ఉగ్రమూకలు మాత్రం ఇప్పటికీ బంగ్లాదేశ్‌లోని అల్పసంఖ్యాక హిందువులపై బీభత్సకాండను కొనసాగిస్తూనే ఉన్నాయి! 1947నాటి బంగ్లాదేశ్ - తూర్పు పాకిస్తాన్‌లో హిందువుల జనాభా దాదాపు మూడింట ఒకవంతు. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా ఎనిమిది శాతంకంటె తక్కువకు దిగజారిపోయింది! ‘జిహాదీ’లు నిర్నిరోధంగా సాగిస్తున్న బీభత్సకాండ ఇందుకు కారణం!
హిందువులు దాదాపు తొంబయి శాతం ఉండిన చిట్టగాంగ్ జిల్లాను తూర్పు పాకిస్తాన్‌లో కలపడం బ్రిటన్ సామ్రాజ్యవాదుల కుట్ర ఫలితం! ‘బహుళ సంఖ్య’ సూత్రం ప్రకారం చిట్టగాంగ్ అవశేష భారత్‌లోనే కొనసాగి ఉండినట్టయితే ‘చక్మా’లు ఈశాన్యంలో స్థానికులుగా పరిగణన పొంది ఉండేవారు! కానీ అలా జరగకపోవడం చారిత్రకమైన దుర్మార్గం.. ‘చక్మాలు’ బర్మాలోని ‘రోహింగియా’లవలె ప్రత్యేక దేశాన్ని కోరలేదు. ‘చక్మా’లలో బీభత్సకారులు పుట్టుకొని రాలేదు! అందువల్ల తరిమివేతకు గురి అయిన చక్మాలు నిరపాయకరమైన వారు. నీడలేని నిస్సహాయులు! ఇలా జిహాదీల బీభత్సకాండకు గురై పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మనదేశానికి తరలివస్తున్న శరణార్థులకు పౌరసత్వం ప్రసాదించాలని కేంద్రప్రభుత్వం 2015 ఆగస్టులో కేంద్రప్రభుత్వం నిర్ణయించిందికూడ!