విశాఖపట్నం

నూతన సంవత్సర వేళ కిటకిటలాడిన దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
* సంపత్ వినాయక ఆలయంలో పూజలు
విశాఖపట్నం, జనవరి 1: నూతన సంవత్సర శుభ వేళ నగరంలోని పలు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచి పలు ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బురుజుపేట శ్రీ కనమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని పలువురు ప్రముఖులు దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచామృతాభిషేకం, శ్రీచక్రనవవర్ణార్చన, విశేష కుంకుమ పూజ, శ్రీలక్ష్మి పూజ, వేదపారాయణ, సప్తశతీపారాయణ, లక్ష్మీహోమం నిర్వహించారు. యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల ఇఓ ఎస్‌జె మాధవి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
నగరంలోని ఆశీలుమెట్ట సంపత్ వినాయగర్ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కుటుంబ సమేతంగా గణనాధునికి దర్శించి సేవించారు. కొత్త సంవత్సర వేళ వేలాది మంది భక్తులు వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని పలు షిర్డి సాయి ఆలయాలు, విష్ణాలయాలు, ఇరుసుకొండ సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు జరిపారు.

కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ప్రజాదరణ
* భవిష్యత్‌లో అద్భుత ఫలితాలు
* పిసిసి ప్రధానకార్యదర్శి ద్రోణంరాజు
విశాఖపట్నం, జనవరి 1: కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరిగిందని, భవిష్యత్‌లో జరగనున్న జివిఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధిస్తుందని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఆయన తన స్వగృహంలో పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నేపథ్యంలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. పాలక పక్షాల తీరును సమర్ధవంతంగా ఎదుర్కోలేని ప్రతిపక్ష పార్టీ తీరు విస్మయానికి గురిచేస్తోందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ప్రజల్లో గుర్తింపు పొందాలన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలను ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కుల,మత, ప్రాంతీయ విబేధాలకు అతీతంగా జరుగుపుకుంటున్న నూతన సంవత్సర వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అంతకు ముందు నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె వెంగళరావు సారధ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, వజ్జిపర్తి శ్రీనివాస్, కొణతాల శ్రీనివాస్, హైదర్‌ఆలీ సింకా, మాజీ కార్పొరేటర్లు గరికిన గౌరి, పోలిపల్లి జ్యోతి, కొప్పుల వెంకటరావు, సిమ్మా భూలక్ష్మి, నగర కాంగ్రెస్ కార్యదర్శి కె గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొంటు మోహనరావు, పోతిన వరం, పిల్లా సూరిబాబు, తోట దుర్గారావు, పలువురు అధికారులు, అనధికారులు శుభాకాంక్షలు తెలిపారు.