సంజీవని

రక్తనాళాల్లో కొవ్వు.. ప్రమాద హేతువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టెరీస్ రక్తనాళాలు ఆక్సిజన్‌తో కూడుకున్న రక్తాన్ని శరీరమంతటికీ చేరుస్తుంటాయి. ఆర్టెరీస్ రక్తనాళాల గోడలు మందం కావడాన్ని ఆర్టిరియో స్ల్కీరోసిస్ అంటారు. ఆర్టెరీస్‌లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకి ఆటంకం కలిగించడాన్ని ఎథిరోస్ల్కీరోసిస్ అంటారు.
కాళ్ళలోని రక్తనాళాలలో అడ్డంకులేర్పడి సరిగా రక్తప్రసరణ జరగకపోవడాన్ని ‘కాడికేషన్’ అంటారు. ఈ ఇబ్బందిలో పిక్కలు పట్టేస్తాయి. అవే క్రాంప్స్ కండరాలు పట్టేయడం. ఎంజైనా నొప్పిలాంటి నొప్పి వస్తుంది. నొప్పి విశ్రాంతి తీసుకోగానే తగ్గిపోతుంటుంది. పిక్కలలోని కండరాలకు కావలసినంత ఆక్సిజన్ అందకపోవడంవల్ల ఇలాంటి నొప్పి వస్తుంటుంది. పిక్కలు, తొడలు, పిరుదులు ఎక్కడ కాడికేషన్ ఏర్పడుతుంటే అక్కడ నొప్పి వస్తుంటుంది.
కాళ్లు చేతుల్లో అనుమానమున్న పాయింట్ క్రింద నాడిని చూసి పరిస్థితి తెలుసుకుంటారు. మోకాలుకి వెనుకప్రక్క పాదాలమీద ఆర్టెరీస్‌ని పట్టుకుని పరీక్షించవచ్చు.
నడకతో రక్తప్రసరణని మెరుగుపరచుకోవచ్చు. దాంతో కొల్లేటరల్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అవయవ క్రింది భాగానికి రక్తప్రసరణ బైపాస్ దారితో సాధ్యమవుతుంది. ధూమపాన అలవాటుంటే మానుకోవాలి. పొగ తాగడంవల్ల ఎథిరోస్ల్కీరోసిస్ కలుగుతుంది. అలాగే బరువు ఎక్కువగా వున్నా కూడా రక్తప్రసరణలో ఇబ్బందులు వస్తుంటాయి. రక్తప్రసరణ లోపంవల్ల అవయవాల్లో పుళ్లు ఏర్పడవచ్చు. గాంగ్రీన్ కలుగవచ్చు. కాబట్టి పాదాల చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాదాలమీద పుళ్లు పడితే వెంటనే వైద్యుడికి చూపించడం మంచిది. కాళ్ళలో రక్తప్రసరణ సమస్యను బట్టి శస్తచ్రికిత్స చేస్తారు.
బెలూన్‌తో వున్న కేథటార్ని పంపి అడ్డంకుల్ని తొలగిస్తారు. ఆ ప్రాంతంలో స్టెంట్‌లని పెడతారు. ముక్కు మూసుకుపోకుండా ఇలాంటి చికిత్సలు కేవలం గుండె గోడలకు రక్తం సరఫరా చేసే కరొనరి ఆర్టెరీ శాఖలలోనే కాదు మెదడుకి రక్తం సరఫరా చేసే కెరోటిడ్ ఆర్టెరీ శాఖలలోను, ఇతర రక్తనాళాల అడ్డంకుల్ని తొలగించడానికి తోడ్పడుతాయి.

డా.రవికుమార్ చీఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638