సంజీవని

గొంతు నొప్పికి ఇదీ మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ట్రెప్టోకాకస్ బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో గొంతు రాసుకుపోతుంటుంది. దీనిని స్ట్రెప్‌థ్రోట్ అని కూడా అంటారు. ఇటువంటి గొంతు నొప్పిని యాంటిబయాటిక్‌తో తగ్గించవచ్చు. స్టెప్ట్రోథ్రోట్‌తో రుమాటిక్ ఫీవర్ రావచ్చు. మూత్రపిండాలు దెబ్బతినవచ్చు.
మరికొన్ని కారణాలతో కూడా గొంతు రాసుకుపోవచ్చు. ముఖ్యంగా వైరస్ కారణాన బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌లకన్నా వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌లో గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కోల్డ్, ఇన్‌ఫ్లుయెజంజా, బ్రాంకైటిస్, మీజిల్స్ లాంటివాటివల్లా గొంతు రాసుకుపోవడం సోర్‌థ్రోట్ కలగవచ్చు. ఎక్కువగా ధూమపానం, ఆల్కహాల్ సేవనంవల్ల కూడా సోర్‌థ్రోట్ కలగవచ్చు. లుకేమియా, కాన్సర్‌లో కూడా సోర్ థ్రోట్ కలగవచ్చు.
పెన్సిలిన్ కనుక్కునేంతవరకూ స్టెప్టోకాకస్ బాక్టీరియా భయముండేది. పెన్సిలిన్ పడనివారికి ఎరిథ్రోమైసిన్ లాంటి మందుల్ని ఇస్తారు. స్ట్రెప్టోకాకల్ బాక్టీరియావల్ల రుమాటిక్ ఫీవర్స్ వస్తాయి. కీళ్లలో ఇన్‌ఫ్లమేషన్ కలుగుతుంది. జ్వరం, నొప్పులు రావచ్చు. గుండె కవాటాలు దెబ్బతినవచ్చు. మూత్రపిండాలు దెబ్బతినవచ్చు. వీళ్లల్లో తరచు రుమాటిక్ జ్వరాలు రావడం ప్రమాదకరం.
బాక్టీరియా వైరస్ రెండింటివల్లా వచ్చే సోర్‌థ్రోట్‌లలో గ్లాండ్స్ పెరుగుతాయి. గొంతు వెనక్కి గట్డిగా రుద్ది, దానిని లాబొరేటరీలో పరీక్షించి వైరస్ ఇన్‌ఫెక్షనా? బాక్టీరియల్ ఇన్‌ఫెక్షనా తెలుసుకోవచ్చు.

chitram స్ట్రెప్టోకాకస్ బాక్టీరియా

-డా మోహన్‌రెడ్డి.. నోవా ఇఎన్‌టి క్లినిక్, పంజగుట్ట, హైదరాబాద్