సంజీవని

రుతుస్రావం అధికమైతే చికిత్స అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య కాలంలో చాలామంది అధిక రుతుస్రావంతో బాధపడుతున్నారు. దీనే్న వైద్య పరిభాషలో మెనోరేజియా అంటారు. అధిక రుతుస్రావం వలన రక్తహీనత, నిస్త్రాణ, సంతానలేమి వంటి పలు సమస్యలు ఉత్పన్నమగుతాయి. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి.
కారణాలు: మానసిక వత్తిడి, గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడుట వలన, జన్యులోపాలు, ఈస్ట్రోజన్, ప్రొజిస్టరోన్ హార్మోనుల అసమతుల్యత.
లక్షణాలు: రుతుస్రావాలు ముందుగానే రావడం, ఎక్కువరోజులు కావడం బహిష్టు సమయంలో రక్తస్రావం ఎక్కువ ఉండి బాధించడం
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉన్నప్పుడు బహిష్టు సమయంలో కాకుండా మధ్య మధ్యలో రక్తస్రావం అధికం కావడం.
కొన్ని సందర్భాల్లో రక్తస్రావం ఎక్కువకావడం వలన గర్భం ధరించినా గర్భస్రావం జరిగిపోవడం జరుగుతుంది.
పొత్తికడుపులో నొప్పి తీవ్రంగా ఉంటుంది. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం జరుగును.
బరువు పెరగడం, మానసికంగా చికాకుగా ఉండడం.
జాగ్రత్తలు: హార్మోనుల సమతుల్యతను కాపాడడానికి మంచి ఆహారం అనగా తాజాకూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరలు వంటివి నిత్యం తీసుకోవాలి.
బరువున్న వారు క్యాలరీలు తగ్గించుకునేటువంటి వ్యాయామాలు చేయాలి.
అధిక ప్రొటీన్‌లు వుండే ఆహారం తీసుకోవాలి. రక్తస్రావం ఎక్కువగా వున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.
మందులు
క్రోకస్: రుతుస్రావం నెలపొడవునా వుండేవారికి ఈ మందు ఆలోచించతగింది. శరీరక బాధలు, మానసిక బాధలు ఒకటి మార్చి ఒకటి వస్తుంటాయి.
సెబైనా: రుతుస్రావం ఎక్కువగా ఉంటుంది. వెన్నునుండి పొత్తి కడుపులోకి నొప్పి వ్యాపిస్తుంది. స్రావాలు నీరులాగ పలచగా వుంటాయ. నల్లటి కండలు కూడా పడుతుంటాయి. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పనిసరిగా ఆలోచించతగింది.
కాల్కేరియా కార్బ్: రుతుస్రావాలు ముందు వచ్చి ఎక్కువరోజులు పాటు అవుతుంటాయి. వీరికి తెలుపు ఎక్కువగా అవుతుంటుంది. ఉబకాయంతో వుండి తలకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయ. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
చైనా: రుతుస్రావాలు ఎక్కువగా వుండి నిస్త్రాణ ఎక్కువగా వున్న వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా బెల్లడోనా, ఫాస్పారిస్, నక్స్‌వామికా, ఇపికాక్ వంటి మందులను లక్షణాలు ఆధారంగా వాడుకుని అధిక రుతుస్రావం సమస్యనుండి బయటపడవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646