సంజీవని

తినంఢి... తగ్గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తింటే బరువు పెరుగుతుంది, పొట్ట పెరుగుతుంది. కానీ తింటే చాలా సమస్యలు తగ్గుతాయి. అయితే ఆ తినాల్సిందల్లా వేళకు మాత్రమే. అలా వేళకు తింటే అధిక బరువు, మానసిక ఒత్తిళ్లు, ఒబేసిటీ, అసిడిటీ, అజీర్తి లాంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అందుకే జీవనశైలిలో మార్పులు సూచించే సమయంలో ‘వేళకు తినడం’ అనే అంశాన్ని డాక్టర్లు నొక్కి చెబుతారు. వేళకు తినడం వల్ల ఎన్ని సమస్యలను తగ్గించుకోవచ్చో, ఒకవేళ అలా తినలేకపోతే చేయాల్సిందేమిటో చెప్పి.. ఎన్నో సమస్యలను నివారించే కథనమే ఈ ‘ముందు జాగ్రత్త’.
ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోకపోతే!
పోషకాహార లోపం వస్తుంది. దీనివల్ల రక్తహీనత, అజీర్తి, గుండెలో మంట, కడుపులో నొప్పి, అధిక బరువు, ఎముకలు, కండరాల సమస్యలు.. ఇలా ఎన్నో!
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం.. రోజుకు మూడు పూటల ఆహారం.. ఇవీ మన దేశపు ఆహారపు అలవాట్లు. బాల్యం నుంచి వీటికి అలవాటుపడిన మన శరీరం ఒక గడియారంలా పనిచేస్తుంది. అందుకే నిద్రలేచిన గంటకే ఆకలేస్తుంది. పగలు పనె్నండు గంటలు దాటగానే ఆకలి, రాత్రి ఏడు అవుతుండగానే మళ్లీ ఆకలి.. ఇలా ఒక చక్రంలా శరీరం శక్తిని తీసుకోవడానికి అలవాటుపడింది. పెద్దయ్యాక జీవనశైలిలో మార్పులు వచ్చేశాయి. ఉద్యోగం, వ్యాపార పనులు తినడానికి తీరిక లేకుండా చేస్తున్నాయి. కొందరైతే పగలు చేయాల్సిన పనులను రాత్రికి, రాత్రి చేయాల్సిన పనులు పగలుకు మార్చుకోవడం చూస్తుంటాం. పనికి తగినట్టుగా వేళకు సరైన ఆహారం తీసుకోవడం లేదు. దీంతో శరీరం ఒక సంఘర్షణకు లోనై అధిక బరువు, మానసిక ఒత్తిడి, అసిడిటీ, అజీర్తి.. వంటి రకరకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతుంది.
ఇటీవల జరిగన పరిశోధనల్లో సైంటిస్టులు కొన్ని ఎలుకలకు పగటిపూట, కొన్ని ఎలుకలకు రాత్రిపూట ఆహారాన్ని ఇచ్చారు. పగటిపూట ఆహారాన్ని తిన్న ఎలుకలు యాక్టివ్‌గా, బరువు పెరగకుండా ఉంటే... రాత్రిపూట ఆహారాన్ని తిన్న ఎలుకలు 50 శాతం బరువు పెరిగినట్టు, చురుకుదనంలోనూ మందకొడిగా ఉన్నట్టు గుర్తించారు.
రాత్రి పనివేళలు- ఆహారం
ఉద్యోగం తప్పనిసరి. అది రాత్రా, పగలా అనుకునే రోజులు పోయాయి. స్ర్తి, పురుషులు అనే తేడాలు లేకుండా నైట్ షిఫ్టుల్లో మునిగిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏ వేళకు ఏ ఆహారం అనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- రాత్రివేళ పని మొదలుపెట్టే ముందు భోజనం చేయాలి. అలాగే మధ్యరాత్రి కోడిగుడ్డు, పండ్లు, వెజిటబుల్ సూప్స్.. వంటివి తీసుకోవాలి. ఉదయం పడుకునే ముందు అల్పాహారం లేదా తక్కువ మోతాదులో భోజనం చేయాలి. ఉదయం పడుకునే ముందు అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.
- కూరగాయలు, పండ్లతో చేసిన సలాడ్స్ వెంట తీసుకెళ్లి తినాలి. దీనివల్ల జంక్‌ఫుడ్ తీసుకోవాలనే ఆలోచన రాదు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ ఆహారం కాపాడుతుంది.
-కెఫిన్ ఎక్కువ ఉండే కాఫీ, శీతల పానీయాలు తీసుకుంటే యాంగ్జైటీ, బ్లడ్‌ఫ్రెజర్, అజీర్తి సమస్యలు బాధిస్తాయి.
-పోషకాహారం తీసుకోవడంవల్ల స్ట్రెస్ లెవల్స్‌ని నియంత్రించవచ్చు.
-రోజూ వ్యాయామం చేసి షిఫ్ట్ పనివేళలకు వెళితే చురుగ్గానూ, ఆరోగ్యంగానూ ఉంటారు.
-నైట్‌షిప్ట్‌లో పనిచేసేవారు ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.
-గుడ్‌నైట్ లాగే గుడ్‌మార్నింగ్‌ని నిద్రకోసం కేటాయించేవారు నెక్ట్స్ షిప్ట్‌కి రెడీ అవడానికి శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలనే నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి.
ఏది రైట్?
సరైన ఆహారం, సరైన వేళలో తీసుకోవడం మనిషి సాధారణ హక్కు. దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
-ఉదయం నిద్ర లేచిన గంట రెండు గంటలలోపు అంటే 8, 9 గంటలకు అల్పాహారాన్ని, రాత్రి ఆరు, ఏడు లోపు భోజనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సమయాలలో ఎన్ని క్యాలరీలు తీసుకున్నా అంతగా నష్టం ఉండదు. పైగా బరువు పెరగకపోవడం, అనారోగ్య సమస్యలు దరిచేరకపోవడం వంటివి అదనపు ప్రయోజనాలు.
-్భజనానికి.. భోజనానికి మధ్య కనీసం 4-5 గంటల వ్యవధి ఉండాలి.
- రాత్రిపూట శరీరం నిద్రావస్థలో వుంటుంది కాబట్టి తక్కువ శక్తి అవసరం అవుతుంది. కడుపు నిండుగా తిని పడుకుంటే అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కేలరీలు ఖర్చయ్యే అవకాశం తక్కువ కాబట్టి బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని రాత్రి పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయాలి. అదీ తక్కువ మోతాదులో!
-చిరుతిండ్లుగా భోజనానికి భోజనానికి మధ్య పండ్లు, వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడంవల్ల శరీరానికి పోషణ సకమంగా అందుతుంది. మంచి ఆహారపు అలవాట్లవల్ల కడుపులో తగిన సమయంలో స్రావాలు విడుదలయ్యి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఫలితంగా బరువు పెరగరు. ఉదరకోశ సమస్యలూ బాధించవు. ఊబకాయులు కూడా వేళ ప్రకారం ఆహారం తీసుకుంటే అదనపు బరువు తగ్గుతారు.
ఏది రాంగ్?
సరైన వేళలో భోజనం చేయకపోతే అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారంపైకి మనసు మళ్లుతుంది. ఏదైనా సరే తినాలి అన్న ఆలోచన తీవ్రం అవుతుంది. ఆకలి తీరడానికి అందుబాటులో ఉన్న ఆహారాన్ని మోతాదుకు మించి తింటారు. ఫలితంగా అధిక బరువు, హైపర్ ఎసిడిటీ. ఇక ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఐటెమ్స్ తీసుకుంటే మరెన్నో ఆరోగ్య సమస్యలు తప్పవు.