రాష్ట్రీయం

ఇక కొరత ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకాలంలో సరసమైన ధరకు ఇసుక
జనవరి 1 నుండి నూతన విధానం అమలు
ప్రత్యామ్నాయంగా రోబో ఇసుక వినియోగంపై దృష్టి
అక్రమ తవ్వకాలకు చెక్
శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
విజయవాడ, నవంబర్ 26: వినియోగదారులకు సకాలంలో సరైన ధరకు ఇసుకను అందించడంతోపాటు ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వ రాబడిని పెంచే విధంగా రూపొందించబడుతున్న నూతన ఇసుక విధానం జనవరి 1 నుంచి అమలుకు రానుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన గురువారం ప్రస్తుతం అమలుల్లో ఉన్న ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత 15 మాసాలుగా ఇసుక అమ్మకాలపై సీనరేజీ, ఖర్చులు పోను రాష్ట్రానికి రూ. 517 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఇసుక అమ్మకాలను డ్వాక్రా సంఘాలకు అప్పగించటం ద్వారా 4వేల మంది డ్వాక్రా మహిళలకు రోజువారీ వేతనం లభించిందన్నారు. రాష్ట్రంలో నానాటీకి ఇసుక డిమాండ్ పెరుగుతోందని, ప్రధానంగా రాజధాని నిర్మాణం, ఇతర వౌలిక సదుపాయాల కల్పనలో ఇసుక అవసరమవుతుందన్నారు. అందుకే దీనికి ప్రత్యాహ్నయంగా రోబో ఇసుక వినియోగంపై దృష్టి సారిస్తామన్నారు. ఇసుక రీసైక్లింగ్ చేసే పద్ధతుల్ని అవలంబించాల్సి ఉంటుందన్నారు. కృష్ణ, గోదావరి నదులలోను, వాటిపై నిర్మించిన జలాశయాలలోను డ్రెడ్జింగ్ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీని ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా, ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. అదే విధంగా నిర్మాణాల్లో ఇసుక వాడకం తగ్గించే ఆధునిక విధానాలను కూడా అమలులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూ పూర్తి పారదర్శకతతో, సామర్థ్యంలో ఇసుక అందించాలన్న లక్ష్యంతో ప్రస్తుత ఇసుక విధానం అమలవుతోందన్నారు. పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా, చట్ట వ్యతిరేకమైన ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించిన పరికరాలను ఉపయోగించి నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి వివరించారు. 15 నెలలుగా అమలవుతున్న విధానాన్ని సమీక్షించిన తర్వాత నిర్వహణపరమైన విధానంపై దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద సరైన ర్యాంపులు ఏర్పాటు చేయలేకపోవడం, డిమాండ్‌కు తగిన విధంగా ఇసుక లోడింగ్ చేయలేకపోవడం వంటి కొన్ని అంశాలను గుర్తించామన్నారు. లోడింగ్‌లో జరుగుతున్న జాప్యం వల్ల లారీ కిరాయిలు పెరిగి ఇసుక ధర పెరిగి ఆ భారం వినియోగదారునిపై పడడం సరైంది కాదన్నారు. ఇసుక విధానం అమలు చేయడంలో ఎక్కువ ప్రభుత్వ శాఖలు పని చేయాల్సి రావడం, వాటి మధ్య సమన్వయం కొరవడడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తునున్నాయన్నారు. ఈ లోపాలన్నింటిని సరిదిద్ది మరింత పటిష్ఠమైన విధానానికి రూపకల్పన చేసేందుకు ప్రజలు తగు సలహాలు, సూచనలు అందజేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇసుకపై ప్రభుత్వానికి సమకూరే ఆదాయంలో 25 శాతం మహిళా సాధికారితకు, 25 శాతం రైతు సాధికారికత సంస్థకు కేటాయిస్తామన్నారు.
ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలు, పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తల అంశాలు, టీవీలలో చర్చల వివరాలు విశే్లషించి దానిపై ప్రభుత్వానికి నివేదించేందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మరో ఇద్దరు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలు తగు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి ఉంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విలేఖర్ల సమావేశంలో మైన్స్, మహిళా శిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత, సెర్ప్ సిఇఓ సాల్మన్ ఆరోక్యరాజ్‌లు పాల్గొన్నారు. (చిత్రం) ఇసుక విధానంపై శే్వతపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు