ఆంధ్రప్రదేశ్‌

ఇసుక ధరలు తగ్గేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిల్డర్ల ఎదురుచూపులు
విశాఖపట్నం, డిసెంబర్ 5: నవ్యాంధ్రలో భవన నిర్మాణ రంగం పరుగులు తీస్తుందని ఆశించినప్పటికీ ఇసుక అందుబాటులో లేకపోవడం, ధర విపరీతంగా పెరిగిపోవటంతో నిర్మాణాలు సన్నగిల్లాయి. అధిక ధరలు వెచ్చించైనా నిర్మాణాలు చేపట్టడానికి బిల్డర్లు ముందుకు రాగా అవసరానికి సరిపడా ఇసుకను ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. ఇసుక అక్రమాలకు స్వస్తి చెప్పే లక్ష్యంతో ఇసుక ర్యాంపులను డ్వాక్రా మహిళలకు అప్పగించారు. ఈ విధానంలో ప్రభుత్వానికి గతంలో కంటే ఆదాయం పెరిగినప్పటికీ, ఇసుక మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. ధర కూడా చుక్కలు తాకింది. పెరిగిన ధరలతో నిర్మాణాలు చేపట్టలేక బిల్డర్లు చాలా చోట్ల చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. అయితే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరిగింది. ఈ ఏడాది ఇసుక విక్రయాల ద్వారా రూ.517.36 కోట్లు ఆదాయం లభించింది. అదే సమయంలో భవన నిర్మాణాలకు సరిపడా ఇసుక సరఫరా జరగటం లేదు. మరోపక్క ఇసుక ధరలు అమాంతంగా రెట్టింపై, ఒక దశలో సిమెంట్ కంటే ఇసుక ధర అధికంగా ఉండటంతో తాము ఇక నిర్మాణాలు చేపట్టలేమని బిల్డర్లు చేతులెత్తేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇసుక విధానంలో లోపాలను సరిదిద్ది కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. వచ్చే నెల ఒకటోతేదీ నుంచి కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కొత్త పాలసీతో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీ అమలుతో ఇసుక ధరలు తగ్గుముఖం పడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేయడంతో బిల్డర్లలో ఆశలు చిగురించాయి. గతంలో లారీ ఇసుక (3 యూనిట్లు) రూ.4వేలు వరకు ఉండగా, డ్వాక్రా సంఘాలకు అప్పగించిన తరువాత లారీ ఇసుక ధర రూ.12వేలు వరకు చేరింది. అంతేగాకుండా ఇతర జిల్లాల నుంచి ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగర అవసరాలకు సరిపడా ఇసుక స్థానికంగా లభ్యం కాకపోవడంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుకను తెప్పించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఏడాది ఒకటొ తేదీ నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుండటంతో ఇసుక ధరలు గణనీయంగా తగ్గగలవని బిల్డర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు.