బిజినెస్

మళ్లీ ఇసుక కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త విధానం వచ్చేవరకూ నిలిచిపోనున్న రవాణా
మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్న అధికారులు
విశాఖపట్నం, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఇసుక కొరత ఎదురవబోతోంది. ఇప్పుడున్న ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ, కొత్త విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, దీనికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ఇసుక అక్రమ వ్యాపారాన్ని నిలువరించేందుకు గత ఏడాది ప్రకటించిన ఇసుక విధానంలో ప్రతి జిల్లాలో డిఆర్‌డిఏ నేతృత్వంలో డ్వాక్రా మహిళలు ఇసుక విక్రయించే విధంగా చర్యలు తీసుకుంది. అయితే, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలను ముందుంచి, అధికార పార్టీకి చెందిన వారే ఈ వ్యాపారాన్ని ముమ్మరంగా సాగించారన్న ఆరోపణలున్నాయ. అంతేకాకుండా ఈ ఇసుక విధానం వలన వినియోగదారులకు ఏమాత్రం ప్రయోజనం కలుగ లేదు. నిర్ణీత సమయంలో ఇసుక ఇంటికి చేరలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానంలో లోపాలను సరిచేసేందుకు రంగంలోకి దిగింది. డిఆర్‌డిఎ నుంచి ఈ బాధ్యతలను గనులు భూగర్భ శాఖకు అప్పగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి. కానీ మార్గదర్శకాలు విడుదల కాలేదు. వీటి కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా విశాఖ జిల్లాలో ఈ ఏడాది కాలంలో సుమారు 15 కోట్ల రూపాయల ఇసుక విక్రయాలను ప్రభుత్వం జరిపింది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వ ఇసుక డిపోలో ఇసుక మంగళవారంతో అయిపోవచ్చింది. మళ్లీ నగరంలో ఇసుక కొరత ఏర్పడబోతోంది. కొత్త విధానం ప్రకారం ఇసుక రీచ్‌లను వేలం వేయనున్నారు. రీచ్‌ల వేలం పూర్తయి, అవి అమల్లోకి వచ్చేప్పటికి ఇంకా సుమారు 15 రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఇసుక కొరత తప్పదని అధికారులు చెబుతున్నారు.