కృష్ణ

ఇసుక ఉచితం సరే... డిడిలు తీసినవారి సంగతేంటి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పడవల కూలీల కిరాయిలు చెల్లించరూ!!
పాతబస్తీ, మార్చి 10: కోట్లాది రూపాయలు ఆదాయాన్ని లెక్క చేయకుండా పేదలకు ఇసుక ఉచితంగా అందించడానికి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై రాష్ట్ర ప్రజల అవాక్కయ్యారు. ఇలాంటి నిర్ణయం సాహసోపేతమైనదే కానీ దానికి సంబంధించిన విధి విధానాల అమలు విషయంలో అధకారులకు స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఇసుక క్వారీ నిర్వహణాధికారులు పలు ఇక్కట్లుకు గురవుతున్నారు. అలాగే ఇంతకు ముందే ఇసుకలోడుల కోసం డిడిలు తీసిన వేలాది మంది అయోమయానికి గురవుతున్నారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక క్వారీల నిర్వహణ అప్పగించినప్పుడే పడవలు, కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు కోట్లాది రూపాయలకు పేరుకుపోయాయి. దాని విషయమై గత నెల్లో ఆంధ్రభూమిలో ‘ఇసుకే బంగారమాయో’ అంటూ ప్రచురించిన కథనం విధితమే. భవానీపురం సూరాయపాలెం ఇసుక క్వారీల్లో తవ్వకాలు జరిపిన పడవలు, కూలీలకే ఇవ్వాల్సిన కిరాయిలు రూ.8 కోట్లకు చేరుకుంది. ఇలా బకాయిలు పేరుకుపోతుండగా తవ్వకాలు జరుపుతున్న సొసైటీల సభ్యులు ఇసుక తవ్వకాలు ఆపేయడంతో లారీ ఇసుక రూ.12 వేల ధర పలికిన విషయం పాఠకులకు విధితమే. ఆ బకాయిలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఐనా ఇసుక క్వారీ నిర్వహణ ప్రభుత్వ అధికారుల చొరవతో కొన్ని సొసైటీ సభ్యులు ఇసుక తవ్వకాలు జరపడానికి ముందుకువచ్చారు. ఈలోగా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకొంది. తవ్వుకొన్న వారికి తవ్వుకున్నంత ఇసుక ఉచితంగానే వరాల జల్లు కురిపించింది. దీనివల్ల ఇసుకాసురుల అక్రమ వ్యాపారాలకు కళ్లెం పడింది. అంతేగాకుండా రాష్ట్రంలోని ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించకుండా కళ్లెం పడింది. అంతేగాకుండా రాష్ట్రంలోని ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించకుండా రాష్ట్రంలోని స్వప్రయోజనాలకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం అభినందనీయమే. ఇదిలావుండగా ఇలాంటి నిర్ణయాలు ప్రకటించే ముందు అంతవరకూ ఉన్న ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పడవల, కూలీల బకాయిలే ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది. కావున కొత్తగా మరో సమస్య అధికారులను వెంటాడుతుంది. ఇసుక ఉచితం ప్రకటన ముందువరకూ సుమారు 5వేల మంది డిడిలు తీసి ఉన్నారు. వారందరిలో కొందరికి ఇసుక తవ్వకోగా ఇంకా రూ.కోటి 20 లక్షలు డిడిలకు ఇసుక తవ్వి ఇవాల్సి ఉంది. అంటే డిడిలు కిరాయిలు కలిపి భవానీపురం సూరాయపాలెం ఇసుక క్వారీల్లోనే రూ.9-20 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ముందుగా ఆ బకాయిలు క్లియర్ చేయాలి బకాయిలు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. వారందరికి ప్రభుత్వం లెక్కల ప్రకారం చెల్లించాకే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని బాధితులు కోరుతున్నారు.