జాతీయ వార్తలు

ఆప్‌ నుంచి సందీప్‌ కుమార్‌ సస్పెన్షన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇద్దరు మహిళలతో అభ్యంతరకరంగా ఉన్న వీడియో, ఫొటోలు బయటకు రావడంతో దిల్లీ కేబినెట్‌లో మంత్రి పదవి కోల్పోయిన ఆమ్‌ ఆద్మీ నేత సందీప్‌ కుమార్‌ను శనివారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. వీడియోలపై విచారణ చేపట్టేందుకు దిల్లీ పోలీస్‌ క్రైం బ్రాంచ్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. సందీప్‌తో పాటు ఆ వీడియోలో కన్పించిన ఇద్దరు మహిళలను కూడా పోలీసులు విచారించనున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సందీప్‌ కుమార్‌ను కేబినెట్‌ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ విలువల విషయంలో రాజీ పడేది లేదని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. తానే తప్పు చేయలేదని, ఆ సీడీ అంతా ఓ కుట్ర అని సందీప్‌ ఆరోపించారు. నష్ట నివారణ చేసుకునేందుకే సందీప్‌ను తొలగించారని , కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.