తెలంగాణ

విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యుత్ కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్‌లోసి విద్యుత్ సౌధలో విద్యుత్ సంస్థల సీఎండీలతో కార్మిక సంఘాలు భేటీ అయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చలలో పలు డిమాండ్లను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా తెలిపారు. ఈ చర్చల్లో విద్యుత్‌ సంస్థల సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీసు నిబంధనల అమలు, విద్యుత్‌ సంస్థల్లో నియామకమైన కార్మికులందరికీ పాత పెన్షన్‌ విధానం అమలుతో పాటు పలు డిమాండ్లను కార్మిక సంఘాలు యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లాయి. వీటన్నింటిపై సానుకూలమైన స్పందన రావటంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సాయిబాబా తెలిపారు.