సంజీవని

కీళ్ళనొప్పుల్లో కొత్త సంగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:అనేక ఏళ్ళుగా కీళ్ళనొప్పులు బాధిస్తున్నాయి. ఈ వ్యాధికి కొత్తగా ఏదైనా మార్గం కనిపెట్టారా? వివరించగలరు?
-డి.పద్మనాభరావు, చెరుకూరు
జ:దీర్ఘకాలం బాధిస్తున్న నొప్పి ప్రభావం ఇతర అవయవాల మీద ఉంటుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. మెక్‌గిల్ అనే విశ్వవిద్యాలయ బృందం కొద్ది రోజుల క్రితం జనవరి 29, 2016న ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దీర్ఘకాలంగా ఉన్న నొప్పివలన వందలు, వేల జీన్సులో మార్పులు రావటాన్ని మేం గమనించి ఆశ్చర్యపోయాం. పాత నొప్పిగా మారితే అది ఇతర శారీరక వ్యవస్థలమీద చెడు ప్రభావం కలిగిస్తుందని నమ్ముతున్నాం అనేది ఈ నివేదిక సారాంశం. మెడ్ ఇండియాలో ఈ పరిశోధనా వివరాలు ఉన్నాయి.
ఈ పరిశోధన ప్రకటన వెలువడినపుడే, వాత, పిత్త, కఫ శరీర తత్వాలను జెనెటికల్‌గా నిరూపించినట్టు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మైక్రోబయాలజీ (సిసియంబి) శాస్తవ్రేత్త కె.తంగరాజ్ పరిశోధన కూడా వెలువడింది. కీళ్ళ వాతానికి సంబంధించినంతవరకూ ఈ రెండు పరిశోధనాంశాలు అనేక ముఖ్యాంశాలను వెల్లడిస్తున్నాయి.
‘స కష్టః సర్వరోగానామ్ యదా ప్రకుపితో భవేత్’ అనే వాక్యం ద్వారా దీర్ఘకాలంగా ఉన్న ఒక నొప్పి అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుందని ఆయుర్వేదం చెప్తోంది. దీర్ఘకాలం నొప్పి నిలబడి ఉన్నపుడు వందలూ వేల జీన్సులో మార్పులు కలిగితే ధాతువులైన వాత పిత్త కఫాలు దోషాలుగా మారి వ్యాధి రూపంలో పీడిస్తాయని అర్థం చేసుకోవాలి. రోగ నిరోధక వ్యవస్థ కారణంగా అనేక ఎలెర్జీ లక్షణాలు వదలనట్టే, సరిపడని ఆహార విహారాల వలన కీళ్ళనొప్పులు పెరుగుతాయని ఆయుర్వేద శాస్త్రం గట్టిగా చెప్తోంది. బాగా తేలికగా అరిగే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటూ తగిన మందులు వాడుతూ జీవిత విధానాన్ని మార్పు చేసుకోవాలనేది ఆయుర్వేద సిద్ధాంతం. ఈ వ్యాధిని ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు. సక్రమంగా జీర్ణం కాని ఆహార పదార్థాలు కీళ్ళలో కలిగించే వ్యాధి అని దాని అర్థం.
ఫలానా మందులు వాడితే అన్నీ తినొచ్చు. ఫలానా మందులు వాడితే పథ్యం చేయాలిట అనేది అపోహ. పథ్యం అనేది వాడుతున్న మందు కోసం కాదు వచ్చిన వ్యాధిని అదుపు చేయటం కోసం మాత్రమే! మిరపబజ్జీల బండిమీద రోగి దండయాత్ర చేస్తూ, డాక్టరుగారు కడుపులో మంట తగ్గించలేదంటే చెల్లదు కదా! కాబట్టి, వ్యాధి స్వయంకృత కారణాలవలన దీర్ఘవ్యాధిగా మారినపుడు ఆహార మార్గదర్శక సూత్రాలు అవసరం అవుతాయి.
తేలికగా అరిగేవి తిన్న రోజున నొప్పి తక్కువగా వుంటుంది. కష్టంగా అరిగేవి తింటే నొప్పి పెరుగుతుంది. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని మనసు పెట్టి ఆహారంలో మార్పు చేసుకుంటే రుమటాయిడ్ ఆర్ద్రయిటిస్ (కీళ్ళవాతం - ఆమవాతం) తగ్గించటం తేలికే! గగనాదివటి, ఆమవాతారి వటి అనే రెండు ఔషధాలు మంచి ఫలితాలనిస్తుండటాన్ని గమనించాం. పులుపు, నూనె పదార్థాలు, అల్లం+ వెల్లుల్లి మషాలాలకు ప్రాధాన్యత తగ్గించి సాంప్రదాయ పద్ధతిలో భోజనం చేసేవారికి కీళ్ళవాతం రాదు. వచ్చినా త్వరగా తేలికగా తగ్గుతుంది. ప్రతిరోజూ అన్నంలో మొదటగా అల్లం సైంధవ లవణం కలిపి నూరిన ముద్దని తినటం అలవాటు చేసుకోండి. జీర్ణశక్తి పదిలంగా ఉండి వాతం నెమ్మదిస్తుంది. తేలికగా అరిగే ఆహార పదార్థాలు మాత్రమే తినండి. తిన్నది తిన్నట్టు అరిగే పదార్థాల వలన రియాక్షన్ తీవ్రత తక్కువగా ఉంటుంది. నొప్పి ఉపశమిస్తుంది. ఆమవాతారివటి అనే ఔషధం ఈ వ్యాధిలో మంచి ఫలితాలనిస్తున్నట్టు గమనించాము.
ఏవి తిన్నపుడు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయో అవి రియాక్షన్ తెస్తున్నాయని గమనించండి. తేలికగా అరిగే విధంగా ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటే నొప్పులు కూడా తేలిక పడతాయని అర్థం చేసుకోండి. ఆర్ద్రయిటిస్ అనే ఆమవాత వ్యాధిలో ఆహార విహారాల పాత్రను ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత తేలికగా కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,purnachandgv@gmail.com