సంజీవని

అతిమూత్రానికి ఆధునిక చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలుగా వయసు పైబడిన వారిలో ఈ విధమైన సమస్యలు కనిపిస్తాయి. మూత్రాశయం (బ్లాడర్) కండరాలు బలహీనం కావడంవల్ల ఇలాంటి ఇబ్బందులు రావడం మామూలే. అయితే ఇది కేవలం వృద్ధాప్యపు సమస్య కాదు.
చిన్నతనంలోనే ఇలాంటి సమస్యలకు లోనయ్యే అవకాశమూ లేకపోలేదు. కొన్నిసార్లు లోపల ఉన్న తీవ్రమైన సమస్యకు ఇది సంకేతం కావచ్చు. మూత్రాశయం చుట్టూ వున్న కండరాలు ఏ కారణంవలన బలహీనపడినా మూత్ర విసర్జనలో సమస్యలు వస్తాయి.
1.ఎక్కువసార్లు గర్భం దాల్చడంవల్ల బ్లాడర్, కండరాలను శక్తిహీనం చేస్తుంది. 2.ప్రోస్టేట్ గ్రంధి వాచినపుడు కూడా బ్లాడర్ కదలికలు అదుపు తప్పి, మూత్ర విసర్జన మీద నియంత్రణ కోల్పోయే అవకాశం వుంటుంది. 2.మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌వలన కూడా ఇలాంటి సమస్యకు లోనవుతారు. 4.మల్టిపుల్ స్మిరోసిస్ స్ట్రోక్ వంటి సమస్యలకు కూడా ఇది సూచన కావచ్చు.
ఈ సమస్యకు చాలా ముఖ్యమైన కారణం మధుమేహం. దీని ప్రభావం బ్లాడర్ మీద రకరకాలుగా వుంటుంది. బ్లాడర్ కండరాలను బలహీనపరచడమే కాకుండా కండర సంకోచ వ్యాకోచాలకు కారణమయ్యే నాడులమీద కూడా దుష్ప్రభావం కలుగుతుంది. దీనివలన బ్లాడర్ కండరాల దగ్గర ఉండే నాడులు దెబ్బతిని, కండర కదలికలు సక్రమంగా జరుగక మూత్ర విసర్జన అదుపు తప్పుతుంది.
మూత్రాశయం బలహీనమైతే?
బ్లాడర్ కండరాలు బలహీనపడినా ముఖ్యంగా బ్లాడర్ నుంచి మూత్రాన్ని బయటికి పంపించే చోట కవాటంలా పనిచేసే స్పింక్టర్ కండరం దెబ్బతిన్నపుడు మూత్ర విసర్జన అదుపు తప్పుతుంది. మూత్ర మార్గంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడినా బ్లాడర్‌లో చేరుతుంది. అందువల్ల నియంత్రణ కోల్పోయి తమ ప్రమేయం లేకుండానే మూత్ర విసర్జన చేసేస్తారు (ఓవర్ యాక్టివ్ బ్లాడర్). బాలింతల్లో ఇలాంటి సమస్య కనిపించినప్పటికీ కొన్నాళ్ళల్లో సర్దుకుంటుంది. కొన్ని కొన్ని సమయాల్లో అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులకు గురైన వాళ్ళల్లో బ్లాడర్ సంకోచ వ్యాకోచాలను నియంత్రించే నాడులు (న్యూరాన్లు) దెబ్బతిని సమస్య తీవ్రమవుతుంది.
కండరాలకు కొత్త శక్తి ఎలా?
సమస్య వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుని చికిత్స చేస్తే ఈ సమస్యను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. చాలావరకు మందుల ద్వారానే దీన్ని నయం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మూత్రం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బలహీనపడిన కండరాలకు కొత్త శక్తినిచ్చే ఎన్నో రకాల ఆధునిక మందులు ఇపుడు అందుబాటులోకి వచ్చాయి.
ఇన్‌ఫెక్షన్స్‌కి మందులు వాడటం, మధుమేహ నియంత్రణవలన.. మంచి ఫలితాలుంటాయి. వ్యాధికి కారణాలను తెలుసుకోవడానికి కూడా ఆధునిక కంప్యూటర్ పరీక్షలు నేడు అందుబాటులోకి వచ్చాయి.
నాడుల్లో చైతన్యం
దెబ్బతిన్న న్యూరాన్లను ప్రేరేపించడం (సర్వ్ మాడ్యులేషన్) ద్వారా బ్లాడర్ సంకోచ వ్యాకోచాలను అదుపులోకి తీసుకురావచ్చు. నర్వ్ మాడ్యులేషన్‌లో భాగంగా మూత్రవిసర్జన ప్రక్రియను నియంత్రించే న్యూరాన్‌కు దగ్గరగా బ్యాటరీతో నడిచే పరికరాన్ని అమరుస్తారు. ఒక సూది ద్వారా నడిచే పరికరాన్ని అమరుస్తారు. ఒక సూది ద్వారా వైర్‌ను పంపించి ఈ పరికరాన్ని న్యూరాన్‌కు అనుసంధానం చేస్తారు. ఇది నాడులను చైతన్యవంతం చేయడంవల్ల అవి కండర కదలికలను తిరిగి సవ్యంగా ఉండేలా చేస్తాయి. దీన్ని ఒకేసారి స్విచ్ ఆన్ చేస్తే చాలు. అవసరం లేనపుడు దానికదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది.
కృత్రిమ కవాటం
బ్లాడర్ దగ్గర ఉండే స్పింక్టర్ కండరం ఒక కవాటంలా పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి ఇది తెరుచుకుంటుంది. మూత్రం బయటికి వెళ్లిపోగానే వెంటనే మూసుకుంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అందించే రేడియో థెరపీ చికిత్సవల్ల కలిగే దుష్ప్రభావంవలన మామూలుగా ఈ స్పింక్టర్ కండరం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ కండరం బలంగా చేసే మందులవలన ఈ సమస్యను అధిగమించవచ్చు. సిలికాన్‌తో చేసిన ప్రత్యేకమైన పరికరాన్ని స్పింక్టర్ స్థానంలో అమరుస్తారు. ఇది సహజమైన స్పింక్టర్‌లాగే కండర కదలికలను అదుపు చేస్తుంది. ఈ చికిత్సను అమెరికాలో 1997 నుంచి ఉపయోగిస్తున్నారు. ఖర్చు ఎక్కువ అయినందున కృత్రిమ స్పింక్టర్లు ఇంకా మన దేశంలో అందుబాటులోకి రాలేదు.
ఇది కృత్రిమ పరికరం కాబట్టి.. ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తుంది.

-డా.శ్యామ్‌వర్మ
యూరాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
8777889778.. 9705010900

-డా.శ్యామ్‌వర్మ యూరాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ 8777889778.. 9705010900