సంజీవని

కార్టిలెజ్ మోడల్ బోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలు వాటి పద్దతిలో అవి పెరుగుతుంటాయి. కొత్త కణాలు పుడుతుంటాయి. ఈ కణాలు కాల్సియం, సాల్ట్స్, ఫ్రేమ్‌వర్క్‌తో వున్న కొత్త మాట్రిక్స్‌ని తయారుచేసుకుని దానిలో వుంటాయి. ఈ ఫ్రేమ్ క్రమంగా గట్టిపడుతుంది.
ఆ తరువాత రెండు నెలలకు ఎముకలు పెరగడం ప్రారంభిస్తాయి. ఆడవారిలో 16 సంవత్సరాలవరకూ, మగవారిలో 18 సంవత్సరాలవరకూ ఎముకలు పెరుగుతాయి. ఎముకల్లోని కాల్షియం 35 ఏళ్లవరకూ ఏర్పడి గట్టిగా వుండేట్లు చేస్తుంటుంది. కాకపోతే జీవితాంతం విరిగిన ఎముక అతుక్కునేట్టు ఎముక పెరుగుతునే వుంటుంది.
పిండంలో ఎముకలు పుర్రె దగ్గరినుంచి ఏర్పడడం ప్రారంభిస్తాయి. అన్ని ఎముకలు కార్టిలెజ్ మోడల్స్‌లో ప్రారంభమై పెరుగుతుంటాయి. ఎముకల కణాల్ని పరిణామం దగ్గరనుంచి అన్నిటా పోలి వుంటాయి. కాబట్టే ఈ కణాలు పాత కణాల స్థానంలోకి ప్రవేశించగలవు.
ప్రతీ కార్టిలెజ్ మోడల్ బోన్ టిష్యూతో మార్పిడి జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్ ఎముక రెండు చివరల మధ్యనుంచి ప్రారంభమవుతుంది. సన్నటి పొర గ్రోత్ ప్లేట్ షాఫ్ట్ మధ్యలో రెండు ప్రక్కలా ఏర్పడుతుంది. కాబట్టి చివరలలో కొత్త పొర ఏర్పడుతూ ఎముక పెరిగేట్టు చేస్తుంటాయి. ఇలా ప్లేట్స్ సాయంతో ఎముక పెరగడం జరుగుతుంటుంది. ఈ ప్లేట్స్ ఏర్పడడం ఆగిపోగానే ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సూత్రంమీద ఆధారపడే ఎలిజారో పద్ధతిలో ఎముక పెరిగేట్టు చేసి తద్వారా ఎత్తు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

-డా సాయి లక్ష్మణ్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్.. 9704500909