సంజీవని

బుర్సిటిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రిక్షన్ తగ్గడానికి ఎముకల మధ్యగాని ఎముకలు - టెండానే్స మధ్యగాని తొలిగే టెండ్ ఫ్లూయిడ్‌తో వున్న సంచీలతో (బుర్సే) ఇన్‌ఫ్లమేషన్ రావడాన్ని ‘బుర్సిటిస్’ అంటారు. వీటికి దెబ్బలు తగిలినా విరిగినా ఇన్‌ఫ్లమేషన్‌లాంటివి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌మన్‌లో!
‘బుర్సిటిస్’ వచ్చిన ప్రాంతంలో నొప్పి, వాపు సహజం. ఇది ఎక్కువగా మోకాళ్ళలో వస్తుంటుంది. దానికి హౌస్‌మెయిడ్‌నీ అంటారు. మోచేతుల్లో వస్తే స్టూడెంట్స్ ఎలర్జీ అంటారు. భుజాలలో, తొడలలో, మడమల్లో కూడా బుర్సిటిస్ రావచ్చు.
బంతి వేస్తూ క్రికెట్లో చేతిని బాగా చాచడంవల్ల బంతి వేసే వాళ్ళ భుజాలు దెబ్బతింటాయి. చేతికి, భుజానికి అటువంటి సందర్భంలో కొంత విశ్రాంతినివ్వాలి. అవసరమైతే స్పింట్‌ని వాడాలి. నొప్పి తగ్గడానికి మందులు వాడాలి. మూడు నాల్గు రోజులలో నొప్పి తగ్గి కదలికలు సరిగ్గా ఉండకపోతే ఆర్థోపెడిక్ సర్జన్‌ని కలవడం తప్పనిసరి. అవసరమైతే వాపు ఎక్కువగా ఉంటే వైద్యుడు అనస్థీషియా ఇచ్చి బుర్సాలో వున్న ద్రావకాన్ని తీసివేసి, మందుని ఖాళీ బుర్సా సంచీలలోకి పంపుతారు.
నొప్పి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఐస్ నుంచాలి. అలాగే ఆ ప్రాంతాన్ని ఎత్తుగా ఉంచాలి. నొప్పి తగ్గేదాకా కండరాలకు విశ్రాంతినివ్వాలి. బాండేజ్ అవసరం. ఫిజియో థెరపీ చేయించాలి. కండరాల్ని ఎక్కువగా సాగదీసినా ఇబ్బంది అవుతుంది. పుల్డ్ మజిల్స్ బాగా నొప్పి.
అందుకని ఆటలు ఆడేవారు ఎముకలు విరగకుండా చూసుకోవడమే కాదు కండరాలు, వత్తుకోకుండా సాగకుండా చూసుకోవాలి. టెండాన్స్ లాంటివి దెబ్బతినకుండా చూసుకోవాలి. బుర్సైటిస్ లాంటివి రాకుండా చూసుకోవాలి.

-డా సాయి లక్ష్మణ్.. ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్.. 9704500909