సంజీవని

ఈ మందులతో గుండె పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యూరెటిక్స్ అనే ఫ్లూయిడ్ టాబ్లెట్స్‌ని అధిక రక్తపోటుని తగ్గించడానికి వాడుతూంటారు. రక్త పరిమాణాన్ని తగ్గించి ఈ మందులు రక్తపోటుని తగ్గిస్తాయి. వీటిని హార్ట్ ఫెయిల్యూర్‌లోనూ వాడతారు. ఫ్లూయిడ్స్‌ని తొలగించి గుండెకి భారాన్ని తగ్గిస్తాయి.
వాసోడైలెటార్స్, నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్స్‌ని రక్తనాళాలు రిలాక్స్ అయి పెద్దవి కావడానికి ఎక్యూట్ క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్‌లో వాడుతుంటారు. వీటితో నొప్పి తగ్గి రక్తపోటు తగ్గి ఎంజైనా అదుపులోకి వస్తుంది. కానీ ఈ మందులన్నింటికీ తలనొప్పి, తల తిరగడం, చర్మం ఎరుపెక్కడం, మొద్దుబారడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి వీటిని వైద్యుని సలహా మీద, వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది.
డిజిటాల్స్.. డిగోక్సిన్స్ గుండె కండరాల్ని బలపరిచి, రక్తాన్ని బాగా పంప్ చేయగల శక్తినిస్తాయి. కాబట్టి ఇవి హార్ట్‌ఫెయిల్యూర్‌ని అరికట్టే క్లాసిక్ మందులు. వీటితో డైర్యూటిక్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి, గుండె కొట్టుకోవడాన్ని ఈ మందులు సరి చేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోవాలంటే అవసరాన్ని బట్టే డోసేజ్ వాడాలి. అందుకు వైద్యుడి సలహా అవసరం.
కొన్ని యాంటీ కోయాగ్యులెంట్ మందుల్ని బ్లడ్ థిన్నర్స్.. రక్తాన్ని పలచబరిచే మందులు అంటారు. వీటివల్ల రక్తంలో గడ్డలు కట్టకుండా కాపాడవచ్చు. ఈ మందులలో వార్ఫారిన్, అపారిన్ ముఖ్యమైనవి. కొన్ని మందులతో వీటి కలయిక మంచిది కాదు. అందుకని వైద్యుడి సలహా మీద మాత్రమే వీటిని తీసుకోవాలి.
వీటా బ్లాకర్స్, కాల్షియం ఛానెల్ బ్లాకర్స్ కూడా కొన్ని గుండె అనారోగ్యాలకు ఉపయోగిస్తుంటారు. ఈ మందులు గుండె కండరాల మీద గుండె రక్తనాళాలమీద, రెండింటిలోని రిసెస్టార్స్ మీదా పనిచేస్తాయి. ఈ రిసెప్టార్స్‌ని స్టిమిలేట్ చేసినపుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఈ రిసెప్టార్స్ ఏ బ్లీటా బ్లాకర్స్‌తోనైనా మూసివేసినపుడు గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. రక్తపోటు తగ్గుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో బ్లీటా బ్లాకర్స్‌ను వాడతారు. గుండె కండరాలకు అవసరమైన ఆక్సిజన్‌ని అందేలా చూస్తూ ఎంజైనాన్ని అరికడుతుంది. అధిక రక్తపోటుతో పోరాడడానికి ఇది తోడ్పడతాయి. రకరకాల గుండె కొట్టుకునే విధానాల్ని సరిచేయడానికి బ్లీటా బ్లాకర్స్ ఉపయోగపడతాయి. హార్ట్ ఎటాక్ నుంచి కాపాడతాయి. గుండె రక్తనాళాలు మూసుకుపోకుండా తోడ్పడతాయి కాల్షియం ఛానెల్ బ్లాకర్స్. ఇవి ఎంజైనా పేషెంట్స్‌కు తోడ్పడతాయి. కొన్ని సందర్భాల్లో హార్ట్‌ఎటాక్ పేషెంట్స్‌కి రక్తప్రసరణ మెరుగవడానికి తోడ్పడతాయి.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్, కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638