సంజీవని

ఫ్రశ్నలు - జవాబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కార్డియక్ కేథటరైజేషన్ నొప్పితో కూడుకున్నదా?
- లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేస్తారు. అందుకని అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రొసీజర్‌లో కేథటార్ని శరీరంలోకి పంపిస్తారు. అందుకని ఎక్స్‌రే ఇసిజి లాంటి పరీక్ష కాదు. ఒక్కోసారి కేథటార్ రక్తనాళ గోడని దెబ్బతీసి ఎంబాలిజమ్‌లూ కలుగవచ్చు. చాలా తక్కువ మందిలో వెయ్యిలో ఏ ఒక్కరికో ఇలాంటి ఇబ్బందులు కలగవచ్చు. కాకపోతే ఎన్ని రక్తనాళాలలో ఎన్ని బ్లాకులు, ఎంత శాతం మూసుకుపోయాయో తెలుసుకుని, వాటిని తొలగించి స్టంట్‌లు వేసి గుండెకి ఇబ్బంది కలగకుండా సురక్షితం చేయవచ్చు.
* ఫ్లూయిడ్ టాబ్లెట్స్, వాసోడైలేటార్స్ ఎందుకు ఉపకరిస్తాయ?
- అధిక రక్తపోటుకి వీటిని వాడతారు. రక్త పరిమాణాన్ని తగ్గించి, రక్తపోటుని తగ్గిస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్‌లోనూ ఈ మందుల్ని వాడతారు. ఫ్లూయిడ్స్‌ని తీసివేసి, గుండె భారాన్ని తగ్గిస్తాయి ఈ మందులు. ఎంజైనాలో నొప్పినీ తగ్గిస్తాయి. కానీ ఈ మందులకు తలనొప్పి, తల తిరగడం, రాష్‌లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కాబట్టి ఈ మందులు వైద్యుడి సలహా మేర, ఆయన సమక్షంలోనే వాడాలి.
* గుండెకి బలం చేకూరి ఇంకా బాగా పనిచేయడానికి తోడ్పడే మందులున్నాయా?
- ఉన్నాయి. డిజిటాలిస్ (డైజాక్సిన్). ఇవి గుండె కండరాల్ని ఇంకా బలమయ్యేట్టు చేసి, రక్తాన్ని బాగా పంప్ చేయగలిగేట్టు చేస్తాయి. ఇవి హార్ట్ ఫెయిల్యూర్స్ కాకుండా చూడడంలో ప్రధాన పాత్రని వహిస్తున్నాయి. డ్యూరెటిక్ ఎఫెక్ట్ ఉంది. గుండె కొట్టుకోవడం సరిగా చేయడానికి ఈ మందులు తోడ్పడతాయి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చికిత్సకు తగ్గ డోసేజిని వాడాలి. అందుకని రోగిని పరీక్షించిన తర్వాత వైద్యుడే డోస్‌ని నిర్ణయించగలడు.
* యాంటి కోయాగ్యులెంట్స్.. బ్లడ్ థిన్నర్సంటే ఏమిటి? ఎప్పుడు వాడతారు?
- రక్తం గడ్డకట్టకుండా వాడే మందుల్ని మామూలుగా బ్లడ్‌థిన్నర్స్ అంటుంటారు. కానీ ఇవి రక్తాన్ని పలుచన చేయవు. కాకపోతే రక్తానికి ఉండే గడ్డకట్టే గుణాన్ని తగ్గిస్తాయి. అలాంటి మందుల్లో వార్ఫారిన్, వాపారిన్ ముఖ్యమైనవి. హార్ట్ ఎటాక్ పల్మొనరి ఎంబాలిజమ్, డీ ఏవీన్ థ్రోంబోసిస్ వున్న వాళ్ళని ఈ మందులు వాడమంటారు. కృత్రిమ కవాటాల్ని కలిగి వున్నవాళ్ళు ఈ మందుల్ని జీవితాంతం వాడాలి. ఈ రక్తం గడ్డకట్టకుండా వాడే మందులు చాలా ఇతర మందులతో వ్యతిరేకంగా ఇంటరాక్ట్ అవుతాయి. అందుకని వైద్యుల సలహా ప్రకారమే వాడాలి.

డా.రవికుమార్ ఆలూరి
చీఫ్ ఇంటర్‌వెన్షనల్, కార్డియాలజిస్ట్, (కిమ్స్)..
98480 24638

డా.రవికుమార్ ఆలూరి