సంజీవని

న్యుమోనియాలో రకాలున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊపిరితిత్తుల్లోని గాలి గదులకు ఇనె్ఫక్షన్ రావడాన్ని న్యుమోనియా అంటారు. ఇలా వచ్చే ఇనె్ఫక్షన్స్ ఎదుర్కోవడంలో గాలి గదులు తెల్ల రక్త కణాల్తో చీముతో ఇతర ద్రావకాలతో నిండి, రక్తకణాల్లో ఆక్సిజన్ వెళ్లడం కష్టమవుతుంది. అక్కడినుంచి ఆ ఇనె్ఫక్షన్ శరీరమంతా క్రమంగా వ్యాపిస్తుంది.
బాక్టీరియా వైరస్, మైక్రో ప్లాస్మాలవల్ల న్యుమోనియా కలుగుతుంటుంది. వృద్ధులు, సరైన పోషకాహారం తీసుకోని వాళ్లు, గుండె ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవాళ్లు, మధుమేహంతో బాధపడే వాళ్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి, బ్యాక్టీరియల్ ఇన్ఫ్‌క్షన్స్ వస్తాయి. బ్యాక్టీరియల్ న్యుమోనియాతో శ్వాసించడం కష్టమవుతుంది. చెమట విపరీతంగా పడుతుంది. వణుకు, ఛాతిలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, దగ్గుతున్నప్పుడు ఉమ్మిలో రక్తపు చారలు కనిపించవచ్చు. వాంతులు, అయోమయ స్థితి కలగవచ్చు.
వైరస్ న్యుమోనియాలో పొడి దగ్గు, శ్వాసించడం కష్టమవ్వడం మామూలు లక్షణాలు. కొన్ని వైరల్ న్యుమోనియాలు బ్యాక్టీరియల్ న్యుమోనియాలతో కలిసి తీవ్ర ఇబ్బందుల్ని కలిగిస్తాయి.
జీవించి ఉన్న కణాలలో మైక్రోప్లాస్మాస్ ఉంటాయి. నెమ్మదిగా పెరిగి, ఈ న్యుమోనియానే వాకింగ్ న్యుమోనియా అంటారు. దగ్గుతో తెమడ పడుతుంది. జ్వరం వణుకుతో తలనొప్పి, కండరాల నొప్పి, చెవి నొప్పి కూడా ఉండవచ్చు. ట్యుబర్ క్లోసిస్ న్యుమోనియాని త్వరగా గుర్తించి చికిత్స చేయకపోతే ప్రమాదం.