సంజీవని

చిన్ని హృదయం.. పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే పుట్టిన చిన్నారుల్లో హృదయ సంబంధ సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే గుర్తించడం, త్వరితగతిన సరైన వైద్యం అందించడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చూపించవచ్చు. తద్వారా వారు గుండె సంబంధ సమస్యలనుంచి విముక్తి పొంది మిగతా చిన్నారుల వలే తమ ఎదుగుదలను పురిపుష్టం చేసుకోవచ్చు. చిన్నారులకు వచ్చే హృద్రోగ సమస్యల్లో అనేక రకాలు ఉన్నాయి. సహజంగా పాలు స్వీకరించడంలో ఎదురయ్యే అవస్థ, ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి కొన్ని. ధమనుల యొక్క పనితీరులో తేడా (ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్- టీజీఏ) ఇందులో ప్రధానమైనది.
ఈ లోపంలో ధమనులు గుండె నుంచి బయటకు వచ్చిన సమయంలో వ్యతిరేకంగా ఉండి ఉంటాయి. శరీరం అంతటికి రక్తం ప్రసరింపజేసే బృహద్ధమని కుడి భాగంకు బదులుగా ఎడమ భాగం పనిచేస్తుంది. తద్వారా చెడు రక్తం బదులుగా మంచి రక్తం, శుభ్రమైన రక్తం బదులుగా కలుషితం శరీరంలోకి మారిపోవడం వల్ల అప్పుడే పుట్టిన చిన్నారి నీలం రంగులోకి మారిపోతారు. కుడి, ఎడమ జఠరికలమధ్య ఎదురయ్యే జఠరిక భాగాలలో లోపం (వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్- వీఎస్‌డి) ఎదురవుతోంది. దీనికి వెంటనే శస్తచ్రికిత్స చేయకపోతే చిన్నారికి ప్రాణాపాయం ఎదురవుతుంది.
ధమని కవాటాల శస్త్ర చికిత్స నిర్వహించి తద్వారా జఠరికలను సరైన విధంగా పనిచేసేలా చక్కదిద్దుతారు. చిన్నారుల్లో చేసే అత్యంత కఠినమైన శస్తచ్రికిత్స ఇదే. మెరుగైన నైపుణ్యం, వైద్యపరికరాలు ఉన్న చోట మాత్రమే ఈ పక్రియ విజయవంతం అవుతుంది. కొన్నిసార్లు చిన్నారుల్లో ఒకే జఠరిక ఉంటుంది. మరికొన్నిసార్లు జఠరికల పనితీరుల్లో భారీ మార్పు కనిపిస్తుంది. మరికొన్నిసార్లు, జఠరిక, ధమనుల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. ఇలాంటి విపత్కర పరిణామాలను సమన్వయం చేసుకుంటూ మెరుగైన అవగాహన ఉన్నవారు మాత్రమే ఈ పరీక్షను విజయవంతంగా పూర్తిచేయగలరు.
కిమ్స్ ఆస్పత్రుల్లో గత నాలుగేళ్ల కాలంలో ఇప్పటివరకు 92 ధమనుల కవాటాల మార్పు శస్తచ్రికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. ఇందులో 60 మంది చిన్నారులు వీఎస్‌డీ సమస్యలతో బాధపడుతుండగా, అందులో 75 శాతంమంది చిన్నారుల ధమనుల పనితీరు మెరుగ్గా లేకపోడం ఇబ్బందిగా మారింది. ఇందులో ప్రముఖంగా చిన్నారులు మూడు కిలోల లోపు బరువు ఉన్నవారే అయ్యారు. మా ఆపరేషన్లలో అత్యంత చిన్న వయసుగల చిన్నారి బరువు 2 కిలోలు. పూర్తి నైపుణ్యవంతులైన వైద్య నిపుణులు, మెరుగైన వైద్య పరికరాలు, అనుభవం కలిగిన నర్సింగ్ సిబ్బంది ద్వారా అత్యంత జాగ్రత్తతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేసిన ఈ ఆపరేషన్లు విజయవంతం అవడంవల్ల చక్కటి ఫలితాలు వచ్చాయి. ఆ చిన్నారులు తమ సమస్యలను అధిగమించి తమ తల్లిదండ్రుల చెంతన చక్కగా ఎదుగుతూ మిగతావారివలే ఆరోగ్యంగా వుండటం కిమ్స్ ఆస్పత్రుల బృందానికి ఉత్సాహాన్ని అందించింది.
చిన్నారి రంజిత్ కుమార్ కేస్ స్టడీ
రంజిత్‌కుమార్ అనే పదిహేను రోజుల వయసుగల చిన్నారి శ్వాసకోశ సమస్యతో బాధపడుతూండటంతో పాటుగా పెదాలు, చేతివేళ్లు నీలం రంగులోకి మార్పు చెందిన సమస్యతో కిమ్స్‌లో చేరారు. జన్మతః గుండె సంక్లిష్టతతో ఆ చిన్నారి పుట్టినట్లు తేలింది. ధమనుల పనితీరు వైఫల్యం, జఠరిక భాగాలలో లోపం (వీఎస్‌డీ)లతో కూడా ఆ బాబు బాధపడుతున్నాడు. ఆ చిన్నారి 17వ రోజున 2.5 కిలోల బరువు వున్న సమయంలో శస్తచ్రికిత్స ప్రారంభించారు. ఐసీయూలో ఆ చిన్నారికి జరిపిన ఆపరేషన్‌తో ఆ బుజ్జాయి కోలుకున్నాడు. ఇవాళ్టికి ఆ పాపాయికి ఆపరేషన్ జరిపి పది రోజులు పూర్తయింది. రాబోయే కొద్ది రోజుల్లో రంజిత్‌కుమార్ ఇంటికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాడు.
మాస్టర్ రామ్‌శ్రీ అనిల్ కేస్ స్టడీ
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 2013 నవంబర్‌లో జన్మించిన మాస్టర్ రామశ్రీ అనిల్‌కి నేటికి రెండేళ్ల 10 నెలలు. జన్మసిద్ధంగా వచ్చిన సంక్లిష్ట గుండె వ్యాధితో పాటు గొప్ప ధమనుల యొక్క బదిలీ (టీజీఏ)కి సంబంధించిన లోపంతో కూడా ఆయన బాధపడుతున్నాడు. ఈ ఇబ్బందుల కారణంగా శ్వాస తీసుకోవడంలో అవస్థ ఎదురై స్థానిక ఆస్పత్రిలో చేరినపుడు వెంటిలేటర్‌పై ఉంచారు. ఆ చిన్నారి 15 రోజుల వయసున్నపుడు అంబులెన్స్‌లో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత ధమనుల మార్పునకు సంబంధించిన శస్తచ్రికిత్సను నిర్వహించారు. శస్తచ్రికిత్స పూర్తయిన ఆ చిన్నారి కోలుకున్న తర్వాత పూర్తి జాగ్రత్తలు తెలియజేసి ఇంటికి చేర్చారు. ఇటీవలే ఆ బుజ్జాయి కుటుంబ సభ్యులు కృష్ణాష్టమి సందర్భంగా రామ్‌శ్రీ అనిల్‌కు శ్రీకృష్ణుడి తరహాలో అలంకరించి ఘనంగా పండుగ నిర్వహించారు.

-డా.డి.అనిల్‌కుమార్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్