సంజీవని

స్కూలు పిల్లల్లో నడుము నొప్పి ఎందుకు వస్తుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో చాలామంది స్కూలు పిల్లలను వేధిస్తున్న సమస్య నడుంనొప్పి. స్కూలు బుక్స్ బరువు ఎక్కువ ఉండటం, స్కూలు బ్యాగు బరువు రెండు భుజాలపై సరిగా పడకపోవటం వలన వెన్నుముకపై ప్రభావం చూపి నడుమునొప్పి తీవ్రత ఎక్కువవుతున్నది. అలాగే వయసుకు మించిన బరువు మోయడం వలన చిన్నారులు నడుమునొప్పితో బాధపడుతున్నారు. నడుమునొప్పేకదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమై పిల్లలను వేధిస్తుంది. అలా కాకుండా సమస్య తొలి దశలోనే పిల్లలను డాక్టర్‌కు చూపించి చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెన్నుముక మనం వంగినా, లేచినా వెన్నుపూసల మధ్యలో వుండే డిస్కులే తోడ్పడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్కులు అరిగిపోవటంవలన లేదా డిస్కులపై ఎక్కువ భారం పడి ప్రక్కకకు తొలగటం వలన నడుమునొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.
స్కూలు పిల్లల్లో నడుమునొప్పికి కారణాలు
- స్కూలు బ్యాగు బరువు రెండు భుజాలపై సరిగా పడకపోవటం
- అధిక బరువున్న స్కూలు బ్యాగులతో మెట్లు ఎక్కడంవలన వెన్నుపూసలు దెబ్బతినటం లేదా ప్రక్కకు తొలగటం.
- కంప్యూటర్స్ ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం
- క్లాసు రూములో సరైన భంగిమలో కూర్చోకపోవడం
- నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్ లోపించటంవలన నడుమునొప్పి వస్తుంది.
లక్షణాలు
- నడుమునొప్పి తీవ్రంగా ఉండి పిల్లలు నడుము ఎటువైపు కదల్చినా వంగినా, కూర్చున్నా నడిచినా నొప్పి తీవ్రతతో ఏడుస్తుంటారు.
- పిల్లలు తరచుగా నడుమునొప్పి అంటుంటారు. - హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, నడుము వంచినా తీవ్రమైన నడుమునొప్పితో పిల్లలు బాధించబడతారు.
జాగ్రత్తలు.. - నడుము నొప్పితో వేధించబడే పిల్లలు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడే కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది.
- కుర్చీలో కూర్చున్నపుడు నడుము నిటారుగా వుండే విధంగా సరియైన స్థితిలో కూర్చోవాలి.
- బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్‌రెస్ట్ తీసుకోవడం తప్పనిసరి.
- ముఖ్యంగా స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో సరియైన స్థితిలో కూర్చోవాలి.
- అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం మానుకోవాలి.
- నడుమును ఒకేసారి అకస్మాత్తుగా తిప్పడం, వంచడం చేయకూడదు.
- నడుమునొప్పి రాకుండా ఉండటానికి పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి.
- స్థూలకాయం వున్న పిల్లలు వెంటనే బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి.
- వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, జింక్‌ఫుడ్స్ తీసుకునే అలవాటును పిల్లలతో మాన్పించాలి.
- నడుమునొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల పాదరక్షలు సౌకర్యవంతంగా ఉండేవిధంగా చూడాలి.
మందులు.. ఆర్నికా: స్కూలు బ్యాగులు వేసుకుని ఎక్కువ దూరం నడవటం, మెట్లు ఎక్కడంవలన నడుమునొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనంపొందవచ్చు. అలాగే పడటంవలన నడుము ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వలన పిల్లల్లో వచ్చే నడుమునొప్పికి ఈ మందు వాడుకోదగినది.
బ్రయోనియా: పిల్లలు నడుమును కదిలించినా, వంగినా, నడిచినా నొప్పి అధికమగుతుందని ఏడుస్తుంటారు. అలాగే పిల్లలు కదలకుండా విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గుతున్నట్లుగా ఉంటే ఈ మందు తప్పక వాడుకోదగినది. వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా త్రాగుతారు. మానసికంగా వీరికి కోపం ఎక్కువ. వీరిని కదిలించకూడదు. కదలికలవలన వీరికి బాధలు ఎక్కువగుట గమనించదగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్న పిల్లలకు ఈ మందు తప్పక ఆలోచించదగినది.
రస్టాక్స్: నడుమునొప్పి ఉదయం నిద్రలేచిన మొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండుట గమనించదగిన ముఖ్య లక్షణం. పిల్లలు రాత్రిపూట ఎక్కువగా నడుమునొప్పితో బాధపడుతుంటారు. అలాగే చల్లటి తేమతో కూడిన వాతావరణం వీరికి సరిపడదు. అనుకోకుండా బెణుకుటవలన వచ్చే నడుమునొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
హైపరికం:వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు ఉపయోగపడే కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవలన నాడులు ఒత్తిడికి గురై నడుమునొప్పి వచ్చే పిల్లలకు ఈ మందు ప్రయోజనకారి. ఈ మందులే కాకుండా రూటా, కాల్కేరియా కార్బ్, సల్ఫర్, కాలికార్బ్, కోలోసింగ్, మాగ్‌ఫాస్, సింఫైటినం వంటి మందులను లక్షణ సముదాయమును పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల స్కూలు పిల్లల్లో వచ్చే నడుమునొప్పిని నివారించవచ్చు.

ప్రశ్న-జవాబు

పొట్ట తగ్గేది ఎలా?

ప్ర: నా వయస్సు 35 సంవత్సరాలు. నేను కొంతకాలంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాను. పొట్ట పెద్దదిగా వుండి చూడటానికి అసహ్యంగా వుంది. చెమటలు ఎక్కువగా వస్తున్నాయి. థైరాయిడ్ పరీక్ష చేయించగా థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య లేదని తేలింది. మలబద్ధకం సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నాను. నా సమస్యకు హోమియో వైద్యంలో ఏదైనా మందును సూచించగలరు.
-రజిత, ఖమ్మం
జ: మీ సమస్యకు ‘కాల్కేరియాకార్బ్’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున ఒక నెలపాటు వాడగలరు. అలాగే ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మానివేయాలి. స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, ఫాస్ట్ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవటం తగ్గించాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 45 నిమిషాలపాటు వ్యాయామం చేస్తూ మందులు వాడుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646