సంజీవని

కౌమారంలో ఆ మార్పులు సహజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ బరువూ, బాధ్యతలూ లేకుండా హాయిగా, స్వేచ్ఛగా తిరిగే బాలబాలికలు పెద్దలుగా మారే మధ్యస్థితి కౌమారదశ. పిల్లలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ, కొత్త సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ, కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొనే దశ ఇది. ఈ మార్పులన్నీ క్రమేపీ జరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 10-19 సంవత్సరాల మధ్య వయసును ‘కౌమారదశ’గా నిర్వచించింది. కౌమార బాలలు ప్రపంచ జనాభాలో 20 శాతం వున్నారు. వీరిలో 85 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో వున్నారు.
యవ్వన ప్రారంభం
యవ్వన ప్రారంభంలో మెదడులోని ‘హైపోథాలమస్’ పిట్యూటరీ గ్రంధిలో ముందు భాగాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరణతో పిట్యూటరీ గ్రంధి బాలలు పొడవుగా ఎదగడానికి కారణమైన ‘గ్రోత్ హార్మోన్’తోపాటు ఇతర హార్మోనుల్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. అందులో ‘్ఫలికిల్ స్టిములేటింగ్ హార్మోన్’, కొంచెం తరువాత ఉత్పత్తి అయే ‘లూటినైజింగ్ హార్మోన్’ అండాశయాలమీద పనిచేస్తాయి. ఫాలికిల్ స్టిములేటింగ్ హార్మోన్ ప్రభావంతో అండాశయాలలోని ఫాలికిల్స్ ‘ఈస్ట్రోజన్’ అను స్ర్తి సెక్స్ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి. తరువాత లూటినైజింగ్ హార్మోన్ ప్రభావంతో ‘ప్రొజెస్టరాన్’ అను మరో స్ర్తి సెక్స్ హార్మోన్‌ని కూడా ఉత్పత్తి చేస్తాయి. యవ్వనదశలో వేగంగా జరిగే అనేక శారీరక, మానసిక, భావోద్వేగ, మేథోపరమైన మార్పులకు స్ర్తి హార్మోనే్ల కారణం. ఈ మార్పులన్నీ ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి.
కౌమార దశలో బాలికల్లో జరిగే వివిధ మార్పులు
శారీరక మార్పులు
- వేగంగా పొడవు, బరువు పెరుగుదల- 10-19 సంవత్సరాల మధ్య సగటున 24 సెం.మీ పొడవు, 21 కిలోల బరువు పెరుగుతారు.
- రొమ్ముల పెరుగుదల
- బాలికల భుజాలతోపాటు నడుము క్రింది భాగం వెడల్పుగా అవుతుంది. కండరాలు పెరుగుతాయి. క్రొవ్వు పేరుకుంటుంది. పిరుదులలో క్రొవ్వు చేరి గుండ్రంగా అవుతాయి.
- మర్మాంగాలపై, చంకల్లో వెంట్రుకలు పెరుగుదల.
- చంకల్లో స్వేదగ్రంథుల (అపొక్రైన్ గ్రంథులు) పెరుగుదల
- కొన్ని చోట్ల, ముఖ్యంగా .. మీద, కళ్ళు, మూతి, రొమ్ముమొనల చుట్టూ, పొత్తికడుపు మధ్యలో నిలువుగా చర్మం నల్లబడుతుంది.
- చర్మంలో నిగారింపు, మెరుపు ఏర్పడుతుంది. ముఖం జిడ్డుగా వుండడం, మొటిమలు రావడం జరుగుతుంది.
- పునరుత్పత్తి అవయవాల పెరుగుదల వుంటాయి.
- బాలికలు రజస్వల అవుతారు.
- అండాశయం సైజు పెరుగుతుంది. ఫాలికిల్స్ పెరిగి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అండం పెరిగి, పరిణతి చెంది, విడుదల అవుతుంది.
- అండవాహికలు కూడా యవ్వనదశలో పూర్తిస్థాయికి ఎదుగుతాయి. అండవాహిక గోడలు, లోపలి తలంలోని శైలికలు, పొత్తికడుపులో తెరుచుకునే వేళ్ళలాంటి ‘్ఫంబ్రియా’ లోపలి రసాయన వాతావరణం, హార్మోన్ల ప్రభావంతో అండం అండవాహికలోకి చేరడానికి, ఫలదీకరణ తరువాత సంయుక్త బీజకణం గర్భాశయంలోకి చేరడానికి, వీర్యకణాలు అండాన్ని చేరడానికి అనువుగా వుంటాయి.
మానసిక మార్పులు
సంక్షోభం
కౌమార బాలికలు తమ శరీరంలో జరిగే మార్పుల్ని, భావోద్వేగపరమైన మార్పుల్ని, పెల్లుబుకుతున్న లైంగిక స్పందనల్ని కూడా తట్టుకోవాలి. శారీరక మార్పులు భావోద్వేగపరమైన ఒత్తిడిని, అలసటను, అకస్మాత్తుగా, వేగంగా జరిగే మూడ్ మార్పుల్ని కలగజేస్తాయి. చిరాకు, భయం, ఆందోళన, స్థిమితం లేకపోవడం మొదలైన లక్షణాలు కనపడతాయి. చిన్న విషయాలకు, అప్రధానమైన అంశాలకు భావోద్వేగపరంగా చలించిపోవడం ఈ వయసువారి లక్షణం.
అలంకరణపై శ్రద్ధ
తన మీద శ్రద్ధ పెరుగుతుంది ఫ్యాషన్ దుస్తులు, మ్యాచింగ్ నగలు, బొట్లు, గాజులు, జోళ్ళు, పువ్వులు, సెంట్లు, శిరోజాలంకరణ పట్ల మోజు పెరుగుతుంది.
స్వంత గుర్తింపుకోసం అనే్వషణ
- ఒంటరిగా ఉండడానికి, తన ఊహల్లో తాను గడపడానికి ఇష్టపడుతుంది.
- ఇక తను చిన్నపిల్లనేమీ కాదని, పెద్దదాన్ని అయానని, ఇతరుల మాటలు వినాల్సిన పనిలేదని, స్వంత నిర్ణయాలు తీసుకోగలనని అనుకుంటుంది.
- తల్లితో కంటే తన వయసే వున్న స్నేహితురాలితోనో లేక తనకంటే పెద్ద వయసు స్ర్తి వేరెవరితోనో మనసు విప్పి తన భావాల్ని పంచుకుంటుంది.
- ఇంట్లో వారితో కంటే స్నేహితురాళ్లతో గడపడానికి ఇష్టపడుతుంది.
- ప్రేమ కథలు, సినిమాలు, టీవీ పట్ల ఆకర్షణ పెరుగుతుంది.
- తనను అందరూ గుర్తించాలనుకుంటుంది. సొంత గది, వస్తువులు, డబ్బు కావాలనుకుంటుంది.
- తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వారి మాటను లెక్కచెయ్యకపోవడం జరుగుతుంది.
- చదువుమీద శ్రద్ధాసక్తులు తగ్గి, కొంతమంది దురలవాట్లకు లోనయ్యే ప్రమాదం వుంది.
గ్రహణశక్తి అభివృద్ధి
11-12 సంవత్సరాల వయసులో పిల్లల గ్రహణశక్తి అభివృద్ధి చివరి దశకు చేరుకుంటుంది. వారు లోతుగా ఆలోచించగలుగుతారు. ఒక అంశాన్ని పద్ధతి ప్రకారం అంచనా వెయ్యగలుగుతారు. నిబంధనలకూ, ప్రవర్తనలకూ మధ్య వున్న తేడాను ప్రశ్నించగలుగుతారు. ఇది ‘జనరేషన్ గేప్’కి మూల కారణాల్లో ఒకటి.
సాంఘిక మార్పులు
సాంఘికంగా కౌమార బాలలు ఇతరులపై ఆధారపడడం మాని స్వతంత్రంగా వ్యవహరిస్తారు. లైంగికతను సమన్వయపరచుకోగలుగుతారు. కొన్ని నైపుణ్యాలను నేర్చుకుంటారు. కొంత వయసు పెరిగాక స్నేహితులతో సంబంధాలలో మార్పులు వస్తాయి. పెద్ద పెద్ద గ్రూపులతో తిరగడం మాని స్థిరంగా వుండే తక్కువమంది స్నేహితురాళ్ళతో స్నేహాన్ని పెంచుకుంటారు.
లైంగిక స్పందనలు
హార్మోన్స్‌లో మార్పులు లైంగిక ఆలోచనల్ని కలగజేస్తాయి. మొదట ఇవి ‘హోమోసెక్సువల్’గా వుంటాయి. బాలిక తనకంటే పెద్దది, తనకు నచ్చిన స్ర్తిలపట్ల విపరీతమైన ఇష్టం, ఆరాధనాభావం పెంచుకుంటుంది. తనకంటే పైక్లాసులో వున్న బాలిక పట్ల లేక టీచర్ పట్ల లేక ఎవరైనా తెలిసిన స్ర్తి పట్ల ఇలా ఆరాధనను పెంచుకుంటుంది.
తరువాత లైంగిక స్పందనలు ‘హెటిరోసెక్సువల్’గా మారతాయి. అమ్మాయిలకు అబ్బాయిలపట్ల ఆకర్షణ, వారితో కలిసి తిరగాలని, మాట్లాడాలనే కోరికకు దారితీస్తుంది. కాని సామాజిక నియమాలు అందుకు అడ్డుపడతాయి.

డా.ఆలూరి విజయలక్ష్మి
గైనకాలజిస్ట్

డా.ఆలూరి విజయలక్ష్మి గైనకాలజిస్ట్