సంజీవని

అంధానికి మెరుపునిచ్చే సర్జరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూస్ కార్నిలియస్ సెల్సస్ (ఖఖఒ ష్యూశళజఖఒ షళఒఖఒ) అనే పేరుగల రోమన్ విద్యావేత్త (క్రీ.శ.1వ శతాబ్దం) ప్లాస్టిక్ సర్జరీ సాంకేతిక మెళకువలకు ఆద్యుడు. దెబ్బతిన్న లేదా గాయపడ్డ అవయవాలను ఈ సర్జరీ ద్వారా పున నిర్మాణం గావించిన తొలి భారతీయ వైద్య పితామహుడు శుశృతుడు. ఈనాటి ప్లాస్టిక్ సర్జరీకి పోలిన శస్తచ్రికిత్సలు 800 బిసిలోనే శుశృతుడు చేపట్టారు. ఆ తదుపరి చరకుడనే భారతీయ వైద్యుడు శుశృతునికన్నా అధికంగా మరికొన్ని అదనపు మెలకువలు జోడించి ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ నిర్వహించారు. భారతదేశంలో గతానికన్నా వినూత్న శస్తచ్రికిత్సలు వెలుగులోకి రావడంతో పాశ్చాత్య వైద్యులు ఈ కొత్త శస్త్ర చికిత్సా విధానంపై ఆసక్తి, అనురక్తి పెంచుకున్నారు. ఈ నూతన సర్జరీ విధానం నేర్చుకునేం దుకు బయట దేశాలనుంచి వైద్యులు భారతదేశనికి రావడం ప్రారంభించారు.
ప్లాస్టిక్ సర్జరీ కూడా .... శస్తచ్రికిత్సలో...... ఒక భాగమే అని గమనించాలి. గాయపడ్డ లేదా దెబ్బతిన్న అవయవాన్ని గాని అవయవాలను గాని మరమ్మతు చేయడం లేదా అది అక్కడ లేకపోతే దాని స్థానంలో అటువంటి అవయవాన్ని సహజత్వానికి లోపం రాకుండా పునరుద్ధరించడం, అవసరమైన చోట టిష్యూలను చేర్చి శరీర వ్యవస్థకెట్టి ఇతర సమస్యలు తలెత్తకుండా నిర్వహించే ప్రక్రియలన్నీ ప్లాస్టిక్ సర్జరీలో భాగం.
ఈ సర్జరీలో వికృతంగా వున్న అవయవాన్ని మార్చి అక్కడే మంచి ఆకృతినివ్వడం వైద్యపరంగా అసాధారణమైనదే. నూతన వైద్య విధానం ప్రకారం శస్తచ్రికిత్సకారుడే మానవ శరీరాన్ని తానో రాతిని చెక్కే శిల్పిలా శరీరాన్ని సుందరంగా తీర్చిదిద్దే కళాకారుడుగా మారుతున్నాడు. అందమైన ఆకృతిగల వ్యక్తిని సంఘం ప్రత్యేకించి చూడడమేగాక, రూపురేఖలకూ సామాజిక అవసరాలకూ ఓ గుర్తింపు కలుగుతుంది.
జాన్ రియో, ... ముక్కు మరియు స్వరపేటిక వైద్య నిపుణుడు 1891లో ఓ రోగికి ముక్కు మీదగల కంతెను తొలగించాడు. ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో అనేక కొత్త విధానాలు ప్రపంచానికి తెలయజేసిన వైద్యుడు సర్ హరోల్డ్ గిల్లీస్‌గా పేర్కొనవలసి వుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ముఖం దెబ్బతిని గుర్తించ సఖ్యంగాని ఎందరో సైనికులకు తిరిగి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరైన రూపాన్ని ఇచ్చారు.
ప్లాస్టిక్ సర్జరీ త్వరితగతిని అన్ని కోణాల్నుంచి పురోగతి సాధించడంలో దానికి అనుబంధంగా కాస్మొటిక్ సర్జరీ ముందుకొచ్చింది. స్నో, పౌడర్లూ, ముఖానికేసుకునే రంగులతో సంతృప్తి పొందనివారు, ఇక తమ ముక్కూ ముఖ చర్మాలను కూడా మార్చుకునే అనురక్తి గలవారు కాస్మొటిక్ సర్జరీ విధానాన్ని ఆహ్వానిస్తున్నారు. ముక్కు, ముఖ ఆకృతినీ అందంగా తీర్చిదిద్దుకునే తాపత్రయమున్న సౌందర్యాభిమానులు, ముఖ్యంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులున్నవారు అధిక సొమ్ము ఖర్చు చేయగలిగేవారు, ఈ కాస్మొటిక్ సర్జరీ చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. డబ్బును కూడబెట్టుకునే తాపత్రయమున్న వైద్య బృందాలు, విభిన్న, ప్రసార సాధనాల ద్వారా ఈ రకాల సర్జరీలను విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి.
కాస్మొటిక్ సర్జరీ ద్వారా తనకు అక్కర్లేని మరో ఆకర్షణీయమైన రూపానికి మారేందుకు అవకాశం వుంది. ముఖం మీద ముడతలు పోవడానికి దీనికి సంబంధించిన ఇంజెక్షన్లు శరీరంలోకి చొప్పిస్తారు. ఈ దశగా కొల్లాజిన్, హైలురోనిక్, స్కల్‌ప్రా లాంటి కొత్త కొత్త మందులు మార్కెట్‌లోకొచ్చాయి.
జనరల్ ఎనస్థీయతాపైకూడా ఇటువంటి శస్తచ్రికిత్సలు సాగుతున్నాయి. వ్యక్తులు తమ శరీర ఆకృతి ద్వారా హుందాగా ఉండేందుకు ఈ తరహా సర్జరీలు చేయించుకుంటున్నారు.
ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ, కాస్మొటిక్ సర్జరీ చాలా దేశాల్లో డిమాండ్‌లో వుంది. దానికి తగ్గట్టే కొన్ని దేశాలు ఈ తరహా సర్జరీలు ముమ్మరంగా చేస్తూనే ఉన్నాయి. అయితే ఇటువంటి సర్జరీలు చేయడానికి గుర్తింపు పొందిన మెడికల్ బోర్డు జారీ చేసిన సర్ట్ఫికెట్ తప్పనిసరి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ నూతన విధానం కింద అనేక రకాల శస్తచ్రికిత్సలు జరుగు తున్నాయి. స్తనాల ఆకారాలను సరిజేయడం, బొజ్జ తొలగించడం, తొడలు, పిరుదల హెచ్చుతక్కువలను సరిజేయడం,స్ర్తి పురుషుల మర్మావయ సంబంధించినవీ, ముక్కు, గడ్డం, చెక్కిళ్ళూ, ముఖ కవళికలూ, దంత సంబంధితమైనవీ, లేజర్ ద్వారా రోమాలను తొలగించడం, పచ్చబొట్టు మార్కింగ్స్ తొలగించుకోవడం జరుగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా వైద్య శాస్త్రంలో ప్లాస్టిక్ మరియు కాస్మొటిక్స్ శస్తచ్రికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్లాస్టిక్ సర్జరీవలన కొన్ని ఇతరత్రా వైద్యపరమైన ఇబ్బందులు పేషెంట్లకు రావచ్చు. అదేమంటే రక్తం గడ్డకట్టడం, శ్వాస సమస్యలు, వాంతులు, ఇన్‌ఫెక్షన్, రక్తస్రావం జరగవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఇది అత్యంత ప్రమాదకరం. ఫేస్ లిప్టింగ్ కోసం వదులు చర్మాన్ని బిగించడం వలన సమస్యలు తప్పవు. దీనివలన వయస్సు కారణంగా వచ్చే మార్పుని పూర్తిగా తొలగించడం అసాధ్యం.
పొగ తాగేవారికి ఈ సర్జరీని వైద్యులు చేపట్టారు. కారణం కార్బో మోనాక్సయిడ్ నికొటిన్ ఎక్కువగా వీరి రక్తంలో చేరడంవలన ప్రాణవాయువు ఇతర ప్రొటీన్స్ అందుబాటు తగ్గుతుంది.
ప్రస్తుతం వీటిని విలాసవంతులే ఎక్కువగా చేయించుకోవడంతో ఇది అదనుగా, లేదా పేషెంట్స్ ఒత్తిడి వలనో, లేదా పేషెంట్ తొందర చేయడంవలననో కొన్ని రకాల నేరాలు జరుగుతున్నాయి. ఎలాగంటే వైద్య శాస్త్ర రీత్యా కచ్చితమైన నైతిక నిబద్ధతలు పాటించనందున, ఈ ఆపరేషన్లు ఇతర ఆపరేషన్లకు భిన్నమైనవి కావడంవలననూ అక్రమ సంపాదనకు దారితీస్తున్నాయి. కొందరు పాత పద్ధతుల ప్రకారమే ఆపరేషన్లు చేస్తున్నారు తప్ప సులువైన విధానాలనూ, క్షేమకరమైన మార్గాలనూ అనుసరించడం లేదు. జరిగే సర్జరీ ఒకే పాట్రన్‌లోదైనా, దానితో మరికొన్ని జత చేసి, మొత్తంమీద ఆ సర్జరీ క్లిష్టతరమైందిగా రోగిని మభ్యపెట్టి డబుల్ బిల్స్ వేయడం కూడా జరుగుతోంది. ఆయా వైద్యశాలలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కొన్ని చోట్ల. కొన్నిచోట్ల కొత్త టెక్నాలజీ ఉపయుక్తంలోకి తీసుకోకుండా, అవి ఆ హాస్పిటల్‌లో ఉన్నట్టు మభ్యపెట్టి ఎక్కువ సొమ్ము తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజ్ఞాశూరత్వం శూన్యం. ఈ విషయాలన్నింటినీ అందరం గుర్తుంచుకుని ప్లాస్టిక్ సర్జరీకి తూగడం అవసరం.

-డా శశికాంత్ ప్లాస్టిక్ సర్జన్ 9581258179