సంజీవని

చలి తెచ్చే రోగాలు... గుణం చూపే ఔషధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం అంతా చల్లగా అయిపోవడంవల్ల మన శరీరంలో వచ్చే మార్పువల్ల ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, గొంతు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు.
చర్మవ్యాధులు
వాతావరణంలో వచ్చే మార్పులవలన చర్మం పొడిబారినట్లు అవుతుంది. ఒంట్లో తేమ కూడా తగ్గడంతో చర్మం దురదగా మంటగా అనిపిస్తుంది. సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారికి శీతాకాలంలో దురద, మంట ఎక్కువగా ఉండి బాధిస్తుంటాయి.
ఆర్నెనికం ఆల్బం అనే మందు దురద, మంట ఎక్కువగా ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. దురద పగటిపూట, అర్థరాత్రి ఎక్కువగా వున్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
నైట్రోమోర్ మందు ఎగ్జిమాతో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది. దురద తలలో, చేతి మడతల్లో వచ్చేవారికి ఈ మందు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
గ్రాఫైటిస్ అనే మందు స్థూలకాయంతో బాధపడుతూ ఎగ్జిమా వ్యాధులబారిన పడినవారికి తప్పక ఆలోచించదగినది. దురదతోపాటు మలబద్ధకంతో బాధపడేవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
శీతాకాలంలో సొరియాసిస్ వున్నవారు దురదనుంచి ఉపశమనం కోసం సోరినమ్, మెజీరియమ్, సల్ఫర్, ఆర్స్‌అయోడ్, లైకోపోడియం అనే మందులను లక్షణానుసారం వాడుతూ ఉపశమనం పొందవచ్చు.
జలుబు... ఈ సీజన్‌లో చాలామంది జలుబుతో వేధించబడుతుంటారు. ఈ వ్యాధి చలి తీవ్రతకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. జలుబు అనేది అంటువ్యాధి. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినపుడు సుమారు ఆరు గజాల దూరం వరకువున్న వ్యక్తులకు కూడా అంటుకుంటుంది. జలుబుకు ముఖ్య కారణం వైరస్ క్రిములే. కొందరికి జలుబు దుమ్ము, ధూళి వాసనలు, స్ప్రేలు పడనందున తేలికగా గురికావడం జరుగుతుంది.
అస్తమానం ముక్కునుండి నీరు కారడం, కోపం, చిరాకు, కళ్లు మంటలతో కూడి నీరు కారడం, తలనొప్పిగా బరువుగా అన్పించడం, శరీరం వేడిగా జ్వరంలాగా ఉండటం, గొంతులో నొప్పిగా ఉండుట లక్షణాలతో బాధపడుతుంటారు. జలుబు దీర్ఘకాలికంగా ఉండటంవలన ‘సైనసైటిస్’కు గురికావడం జరుగుతుంది.
కాలిబైక్రోమికం అనే మందు ముక్కు పైభాగంలో తీవ్రమైన నొప్పి, ముక్కు పొడి ఆరిపోయి, ముక్కునుండి చిక్కని జిగురుతో కూడిన స్రావాలు, తీగలుగా సాగుతూ ఉండేవారికి వాడుకోదగినది.
నైట్రోమోర్ అనే మందు జలుబు బాధ ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్య సమయంలో ఎక్కువగా ఉండి, నీరసంతో అలసిపోయినట్లుగా, ముక్కునుండి నీరు కారడం, తుమ్ములు, ముక్కులోపలి భాగంలో స్రావాలు పొడి ఆరిపోయి వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
హెపార్‌సల్ఫ్ అనే మందు చాలా సున్నిత స్వభావులకు, తేలికగా జలుబుకు గురయ్యేవారికి తప్పక ఆలోచించదగినది. వీరికి చల్లగాలి సోకగానే బాధలు మొదలవుతాయ. ముక్కునుండి చిక్కని జిగురుతో కూడిన స్రావాలు ఉండి దుర్వాసన వస్తుంటాయి. మాట బొంగురుపోతుంది. పొడి దగ్గువస్తుంది. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినపుడు విపరీతమైన నొప్పి వచ్చుట గమనించదగిన ప్రత్యేక లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రధానమైనది. ఈ మందులే కాకుండా ఆర్సినికం ఆల్బం, రస్‌టాక్స్, టుబర్కులినం, ఎల్లియం సెఫా, ఫెర్రంఫాస్, కాలిమోర్, లేకసిస్, కాల్కేరియా కార్బ్, సల్ఫర్ వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకుని జలుబు బాధలనుండి ఉపశనం పొందవచ్చు.
గొంతు నొప్పి... ఈ సీజన్‌లో చాలామంది గొంతునొప్పితో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటంవలన గొంతునొప్పి (త్రోట్ పెయిన్) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడంవల్ల, టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్, లెరింజైటిస్, ఫెరింజైటిస్ వంటి వ్యాధులవలన కూడా గొంతునొప్పి వస్తుంది.
ఆహారం మింగటం, నీరు త్రాగటం, గాలి పీల్చడం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురుపోవడం, గొంతు తడారిపోవడం, నోరు దుర్వాసన వస్తుంది. గొంతునొప్పి, చెవినొప్పి జలుబుతో జ్వరం రావడం నీరసం, చికాకు వంటి లక్షణాలుంటాయ.
ఎకోనైట్: చల్లగాలిలో తిరగడంవలన గొంతునొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. ఇలాంటి కారణంచే గొంతునొప్పి ప్రారంభమై, మింగడం కష్టంగా మారి గొంతు మంటమండుతుంది. దాహం విపరీతంగా ఉండి జ్వరంతో బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు వున్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
జెల్సిమియం: వైరల్ ఇన్‌ఫెక్షన్ మూలంగా వచ్చే గొంతునొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది. గొంతునొప్పి మూలంగా ద్రవ పదార్థాలు సైతం మింగడం కష్టంగా మారుతుంది. జ్వరంతో నీరసంగా, అస్థిమితంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
మెర్కుసాల్: గొంతునొప్పి రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. నోరు దుర్వాసన కొడుతుంది. నాలుక పెద్దదై నాలుక చివర పళ్ల అచ్చులు కనబడుట ఈ జబ్బు ప్రత్యేక లక్షణం. వీరికి జలుబు చేసినపుడల్లా గొంతునొప్పితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
ఈ మందులే కాకుండా ఫెర్రంఫాస్, కాలిమోర్, మెగ్‌ఫాస్, లేకసిస్, కాల్కేరియా కార్బ్, సల్ఫర్, ఎపిస్ వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి వాడుకొని గొంతు నొప్పి నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646