సంజీవని

అండవాహికలు లేక ఫెలోపియన్ ట్యూబ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భాశయం పైభాగంలో రెండు మూలాలనుండి మొదలయ్యే ట్యూబుల్లాంటి అండవాహికలు అండాశయాల మీదకు ఆర్చిలాగా ఒంగి వాటికి దగ్గరగా వెనుక వైపు పొత్తికడుపులోకి తెరుచుకుంటాయి. వీటి పొడవు 4-4.5 అంగుళాలు ఉంటుంది. అండవాహిక చివర వేళ్ల లాంటి ‘్ఫంబ్రియా’ ఉంటాయి. అండవాహికల నిర్మాణ ప్రత్యేకత వలన అండం పొత్తికడుపులో నుండి గర్భాశయం లోనికి నెట్టబడుతుంది. అండం వీర్యకణంతో కలిసి సంయుక్త బీజకణంగా మారాక గర్భాశయంలోకి చేరడానికి కూడా అండవాహికల నిర్మాణ ప్రత్యేకత, వాటి లోపలి తలంలోని శైలికలు లేక సీలియా కదలిక, రసాయనిక వాతావరణం కారణం. లోపలి తలంలోని కణాలలో ఉత్పత్తి అయ్యే స్రావంలో ఎక్కువగా ఉంటే ప్రొటీన్ సంయుక్త బీజకణానికి పోషకం.