సంజీవని

మెదడుకూ కీహోల్ సర్జరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదడు లేక సెంట్రల్ స్పైయిన్ కణాలలో క్రమం లేని పెరుగుదల వస్తే, ఆ ఎదుగుదలను ‘బ్రెయిన్ ట్యూమర్స్’ అంటారు. ఇవి మెదడు పని తీరును దెబ్బతీస్తుంటాయి. మెదడు, కేంద్ర నాడీ మండలానికి సంబంధించిన ట్యూమర్లు దాదాపు 120 రకాలు దాకా ఉన్నాయి. ఎక్కడ ఈ కంతులున్నాయి? అవి మ్యాలిగ్‌నెంటా? బినైనా? అన్న విషయాన్ని బట్టి ఈ వర్గీకరణ జరిగింది.
తక్కువ అపాయకరమైన బ్రెయిన్ ట్యూమర్లలో (బినైన్ బ్రెయిన్ ట్యూమర్లు) కాన్సర్ కణాలు ఉండవు. వీటి పరిమిమితి కొంతవరకే ఉంటుంది. మెదడంతా వ్యాపించదు. మెదడు కణాలలో వచ్చే కాన్సర్ కంతులు మెదడులోని ఇతర ప్రాంతాలకి, వెన్నుకి కూడా విస్తరిస్తాయి. వీటినే ‘సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ లేక మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్’ అంటారు. ఇవి మెదడులో ఒక ప్రాంతంనుంచి ఇంకో ప్రాంతానికి వ్యాపిస్తుంటాయి. ఈ ట్యూమర్స్ ఎక్కడ ప్రారంభమయినాయి అన్నదానిని బట్టి వర్గీకరణ ఉంటుంది.
ప్రైమరీ, మాలిగ్‌నెంట్ ట్యూమర్స్, నాన్ మ్యాలిగ్‌నెంట్ ట్యూమర్స్ 100,000 మందిలో 20.6 కేసులుంటున్నాయి. మాలిగ్‌నెంట్ ట్యూమర్స్ 7.3 కేసులుంటే, నాన్ మాలిగ్‌నెంట్ ట్యూమర్స్ 13.3 ఆడవాళ్ళల్లో ఈ ట్యూమర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. పిల్లల్లో 100,000 మందిలో 5.1 కేసులు కనిపిస్తున్నాయి. పిల్లల్లో తీసుకుంటే మగ పిల్లల్లోనే అధికం అని తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో కనీసం 25,000 కొత్త ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ కేసులు ఏటా కనుక్కుంటున్నారు. మొత్తం మెదడు కంతుల్ని తీసుకుంటే వాటిలో 63 శాతం బినైన్ ట్యూమర్స్, మిగిలిన 37 శాతమే మ్యాలిగ్‌నెంట్ ట్యూమర్స్.
ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్‌లో 16 శాతం గ్లియోబ్లాస్టోమా, 7 శాతం యాస్ట్రోసైటోమా, 35 శాతం మెనింజియామా, 14 శాతం పిట్యూటరీ, 9 శాతం నెర్వ్‌షీత్, 2 శాతం లింఫోమ ఐతే ఎపండినోమ, ఆగ్లియోడెండ్రోగ్లిమోవ, ఎంబ్రియోనల్ లాంటివి 33 శాతం అని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
అయోనైజింగ్ రేడియేషన్ మెదడు కంతులకి ప్రధాన కారణం. వాతావరణ కాలుష్యంవల్ల కలిగే అయోనైజింగ్ రేడియేషన్‌వల్ల మెదడు కంతులు కలగవచ్చు. మొబైల్ ఫోన్ల వాడకంవల్ల కూడా ఇబ్బందులున్నాయని తెలుస్తోంది. క్రోమోజోములో మార్పులవల్ల మెదడు కంతలు రావచ్చు. క్రోమోజోమ్స్ 13, 17, 18, 22లో మార్పులు కారణం కావచ్చు. మెదడు కంతులు కనుక్కోవడానికి సరైన స్క్రీనింగ్ పద్ధతులు లేవు. కంతి టైప్‌ని బట్టి అది ఉన్న ప్రాంతాన్ని బట్టి లక్షణాలుంటాయి. కొంతమందిలో మెదడు కంతులు ఉన్నాయని తెలిసేవరకు లక్షణాలు కనబడకపోవచ్చు. మొదట తలనొప్పి పారంభమై ఎంత తరచుగా, ఎంత తీవ్రంగా తలనొప్పులు వస్తున్నాయి అన్నదాన్ని బట్టి, కారణం లేకుండా వాంతులు రావడం, మొదటిసారి ఫిట్స్ వస్తున్న, కాళ్ళు చేతుల స్పర్శ తగ్గినా, చూపు అలికేసినట్టు అనిపించినా, వినికిడి జ్ఞానం తగ్గినా, మాట్లాడే అర్థం చేసుకొనే శక్తి లోపించినా, హార్మోన్లు తేడాలు వస్తున్నా, డిప్రెషన్‌తో బాధపడుతున్న అనుమానం రావాలి.
అల్ట్రాసౌండ్ ఇమేజింగ్, సి.టి., ఎంఆర్‌ఐలు, పెట్‌స్కాన్‌లు రోగ నిర్థారణకు తోడ్పడుతున్నాయి.
మైక్రోస్కోప్ సహకారంతో శస్తచ్రికిత్సలు చేస్తున్నారు. ఇపుడు మెదడు కంతుల్ని సురక్షితంగా తీస్తున్నారు. ఇతర అవయవాలకి కీహోల్ శస్తచ్రికిత్సని చేసినట్టే మెదడుకి కీహోల్ సర్జరీ చేస్తున్నారు. ఎండోస్కోప్ ద్వారాను శస్తచ్రికిత్సలను నిర్వహిస్తున్నారు. మెదడులో లోతుగా ఉన్న కంతుల్నించి బయాప్సీ తీయడానికి స్టీరియోటాక్టిక్ సర్జరీలను నిర్వహిస్తున్నారు.
న్యూరో నావిగేషన్‌తో మెదడు శస్త్ర చికిత్సతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
రేడియో సర్జరీల ద్వారా మెనింజియోమాను, ఎకౌస్టిక్ న్యూరోమా, మెటాస్టాసిస్, పిట్యూటరీ, ఎడినోమ, గ్లోమస్ ట్యూమస్, కాండ్రోసార్కోమ, హిమాంజియో బ్లాస్టోమ, గ్లియోమాస్‌లను నయం చేయవచ్చు. జీనో థెరపి, ఇమ్యూనోథెరపీ, యాంజియో జెనిక్ థెరపీ లాంటి కొత్త చికిత్సా విధానాల్లో కూడా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి.
వయస్సు, ఆరోగ్య పరిస్థితి, టైప్‌ని బట్టి అది ఉన్న స్థానాన్ని పరిమాణాన్ని బట్టి అది బినైనా, మ్యాలిగ్‌నెంటా? అన్న తేడాని బట్టి, రోగి తట్టుకునే శక్తిని బట్టి మెదడు కంతులకి చికిత్స ఉంటుంది. కంతి చుట్టూ ఉన్న వాపుని తగ్గించటానికి స్టెరాయిడ్స్ ఇస్తారు. దాంతో వాపుతోపాటు, తలనొప్పులూ తగ్గుతాయి. ఫిట్స్ తగ్గడానికి మందులున్నాయి. అది ఏ రకమైన కంతో తెలుసుకోవడానికి, కంతిలో కొంత భాగాన్ని తీసి బయాప్సి చేస్తారు. సాధ్యమైనంత వరకూ శస్తచ్రికిత్స ద్వారా మెదడు కంతుల్ని తొలగిస్తారు. ఇలా తొలగించకపోతే, మెదడులో కంతుల ఒత్తిడి ఎక్కువవుతుంది. పుర్రెలో మెదడు ఉంటుంది కాబట్టి అపాయం కాని కంతులైనా, అవి పెరుగుతుంటే మెదడు పదార్థాన్ని పక్కకు నెట్టేసే ప్రమాదం ఉంది. కీమోథెరపి, రేడియేషన్ లాంటివి సరాసరి మెదడు కంతికి ఇవ్వలేము. గత కొన్ని దశాబ్దాలనుంచి మైక్రోస్కోప్, మ్యాపింగ్ అండ్ ప్లానింగ్ విధానాలు, న్యావిగేషనల్ టూల్స్, ఇమేజింగ్ డివైసెస్‌ల సహకారాన్ని శస్తచ్రికిత్సలో తీసుకుంటున్నారు.

-డా.వేముల శ్రీకాంత్
సీనియర్ న్యూరాలజిస్ట్.. 98481 70120..
మాగ్నక్లినిక్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్.

-డా.వేముల శ్రీకాంత్