సంజీవని

అండాశయాలు లేక ఓవరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవి గర్భాశయానికి ఇరువైపులా, అండవాహికల క్రింద, వెనుకవైపు ఉంటాయి. అండాశయం సుమారుగా 1.5 అంగుళాల పొడవు, 0.75 అంగుళాల వెడల్పు, 0.5 అంగుళాల మందం వుంటుంది. యుక్తవయస్సుకు ముందు, బహిష్టులు ఆగిపోయాక చిన్నవిగా వుంటాయి. అండాలు పెరిగే గ్రాఫియన్ ఫాలికిల్స్ రెండు అండాశయాల్లోనూ కలిపి వేలాది ఉన్నప్పటికి స్ర్తి జీవిత కాలంలో 450 నుండి 500 మాత్రమే పరిణతి చెంది బయటికి విడుదల అవుతాయి. సామాన్యంగా ఒక నెల కుడి ఓవరీ నుండి అండం లేక ఎగ్ విడుదల ఐతే తరువాత నెలలో ఎడమ ఓవరీ నుండి అండం విడుదల అవుతుంది. కాని ఈ క్రమం తప్పనిసరి కాదు. అండం విడుదల అవడాన్ని ఓవ్యులేషన్ అని అంటారు. అండం పెరగడాన్ని, విడుదల అవడాన్ని హైపోథాలమస్, పిట్యూటరీ, అండాశయంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు నియంత్రిస్తాయి. అండం విడుదలయ్యే సమయానికి అండవాహిక చివరి భాగం అండాన్ని పట్టుకుని లోపలికి తీసుకునేందుకు అనువుగా అండాశయానికి దగ్గరగా వేళ్ళ లాంటి ఫింబ్రియాను కదుపుతుంది, పొత్తి కడుపులోని రసాయన వాతావరణం కూడా అండం ఫెలోపియన్ ట్యూబులోకి చేరేందుకు దోహదపడుతుంది. అండం 12-24 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది. ఫలదీకరణ చెందకపోతే విచ్ఛిన్నమయి రుతుస్రావం ద్వారా బయటకు పోతుంది. అండాశయాలలో అండం విడుదలకు ముందు ఈస్ట్రోజన్ హార్మోన్, అండం విడుదల తరువాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే రెండు హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.