సంజీవని

ప్రత్యుత్పత్తి... శరీర నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిల ప్రత్యుత్పత్తి అవయవాలు శరీరం బయట కొన్ని, లోపల కొన్ని ఉంటాయి. బయటి ప్రత్యుత్పత్తి అవయవాలు- బయటి పెదవులు లేక బాహ్యాధరాలు, లోపలి పెదవులు లేక అంతరాధరాలు, యోని ముఖద్వారం, కనె్నపొర, మానం లేక మాన్స్, యోని శీర్షం లేక క్లిటోరిస్, లోపలి ప్రత్యుత్పత్తి అవయవాలు- యోని లేక వెజైనా, గర్భాశయం లేక యుటిరస్, అండవాహికలు లేక ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాలు లేక ఓవరీస్ యోని.
సాగే గుణం గల ట్యూబ్ లాంటి యోని గర్భాశయం నుండి శరీరం వెలుపల యోని ముఖద్వారం వరకు ఎముకలతో నిర్మితమైన మలుగుల మార్గానికి సమాంతరంగా వుంటుంది. బిడ్డ జన్మించేటపుడు ఈ మార్గం ద్వారానే బయటకు వస్తుంది కనుక దీనిని జనన మార్గం అని కూడా అంటారు. దీని నిర్మాణ ప్రత్యేకతవలన అవసరమైనప్పుడు సాగడం కారణంగా విశాలమై ప్రసవ సమయంలో బిడ్డ క్రిందకు దిగడం సులువవుతుంది. యోని ముఖద్వారం బయటి పెదవులతోనూ, లైంగిక సంపర్కం ప్రారంభం కాని స్ర్తిలలో కనె్నపొరతోనూ కప్పబడి వుంటుంది. రుతుచక్రంలోని వివిధ దశల కనుగుణంగా యోని లోపలి పొర కణాలు మార్పులకు లోనవుతాయి. యోనిలో వుండే ఆమ్ల వాతావరణం లోపలి ప్రత్యుత్పత్తి అవయవాలకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా నిరోధిస్తుంది. రుతుస్రావ సమయంలో రక్తంలో వుండే క్షారగుణం కారణంగా యోనిలోని ఆమ్ల వాతావరణం తగ్గి ఇన్‌ఫెక్షన్‌ని నిరోధించే శక్తి కూడా తగ్గుతుంది. అందుచేత రుతుస్రావ పరిశుభ్రతను ప్రత్యేక శ్రద్ధతో పాటించడం అవసరం.
యవ్వనదశలో యోని నుండి నీరు లాంటి స్రావం బయటకు వస్తుంది. యోని ముందు భాగంలో మూత్రవాహిక, మూత్రాశయం, వెనుక వైపున మలాశయం లేక రెక్టమ్ ఉంయి. లైంగిక సంపర్కంలో పురుషాంగం నుండి వీర్యం యోనిలో పడి, వీర్య కణాలు యోని నుండి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి చేరతాయి.
గర్భాశయం.. కండరాలతో నిర్మితమైన గర్భాశయం పొడవు 3.5 అంగుళాలు, వెడల్పు 2.5 అంగుళాలు, మందం 1.5 అంగుళాలు వుంటుంది. పొత్తి కడుపులో ముందువైపు మూత్రాశయానికి, వెనుక వైపు మలాశయానికి మధ్య లిగమెంట్స్ లేక బంధకాలతో వేలాడుతుంది. గర్భాశయం సాధారణంగా ముందుకు, ఒకోసారి వెనుకకు వంగి వుంటుంది. గర్భాశయం క్రింది భాగం సర్విక్స్. దీనిలో కొంతభాగం యోనిలోకి చొచ్చుకుని వుంటుంది. సర్విక్స్ మార్గం మామూలుగా బిగుతుగా మూసుకుని వుండి ప్రసవ సమయంలో విచ్చుకుని విశాలమవుతుంది. సర్విక్స్ మొత్తం పొడవు గర్భాశయం పొడవులో సుమారు మూడవ వంతు వుంటుంది.
గర్భాశయానికి మూడు ద్వారాలు ఉంటాయి. పైభాగంలో రెండువైపులా రెండు అండ వాహికలు తెరుచుకుంటాయి. మూడో ద్వారం సర్విక్స్ మార్గంలోకి తెరుచుకుంటుంది. సర్విక్స్‌లో ఉత్పత్తి అయే శే్లష్మం వీర్యకణాలు యోని నుండి గర్భాశయంలోకి సులభంగా చేరడానికి ఉపయోగపడుతుంది, రోగ క్రిములు గర్భాశయంలోకి చేరకుండా నిరోధిస్తుంది. దానిలో వుండే ప్రొటీన్, ఫ్రక్టోజ్ వీర్యకణాలకు పోషకాలుగా ఉపయోగపడతాయి. గర్భాశయం గోడలో బయటినుండి లోపలకు సీరస్ పొర, కండరాల పొర, ఎండోమెట్రియమ్ అనబడే ప్రత్యేకమైన లోపలి పొర ఉంటాయి. ఎండోమెట్రియమ్ రుతుచక్రంలోని వివిధ దశలకు అనుగుణంగా 1.5 మి.మీ. మందంగా ఉంటుంది. రుతుస్రావం ప్రారంభానికి కొద్దిరోజులకు ముందు అతి ఎక్కువ మందంగానూ, రుతుస్రావం ఆగేసరికి అతి తక్కువ మందంగానూ వుంటుంది. ఈ పోరలోనే గ్రంథులు, సూక్ష్మ రక్తకేశ నాళికలు ఉంటాయి. గర్భాశయం గోడలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించే కండరాల పొరలో గోడకు సాగే గుణాన్నిచ్చే ‘ఇలాస్టిక్ టిష్యూ’ అనే ప్రత్యేక కణజాలం కూడా వుంటుంది. ఎండోమెట్రియమ్, కొంత తక్కువ స్థాయిలో కండరాల పొర కూడా రుతుచక్రం దశల కనుగుణంగా మార్పులకు లోనవుతాయి. యవ్వన దశ నుండి బహిష్టులు ఆగిపోయే ముందువరకూ గర్భాశయం ప్రతినెలా గర్భధారణకు అనువుగా సన్నద్ధమవుతుంది. ప్రతినెలా గర్భాశయంలో కొత్త కణజాలం, కొత్త రక్తనాళాలు, క్రొత్త గ్రంథలు నిర్మితమవుతాయి. శిశువు తొమ్మిది నెలలు గర్భాశయంలో పెరిగి ప్రసవంలో బయటికి వస్తుంది.

డా.ఆలూరి విజయలక్ష్మి గైనకాలజిస్ట్.. 9849022441