సంజీవని

‘నిప్పు’లాంటి నిజం?! ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: రొమ్ము కేన్సరు రావటానికి మన ఆహారానికి సంబంధం ఏమైనా ఉన్నదా? ఆహార జాగ్రత్తలు వివరించగలరు?
-జి.్భద్రావతి, సికిందరాబాద్
జ: రొమ్ము కేన్సర్, ఇతర అవయవాలలో వచ్చే కేన్సర్లకు అధిక ఉష్ణోగ్రత దగ్గర వండిన వంటకాలు కారణం అవుతాయని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. నిప్పులమీద మాడ్చిన వంటకాలు, సలసలా కాగే నూనెలో వేగిన కూరలు కేన్సర్ కారకాలని చాలాకాలంగా వైద్యులు చేస్తున్న హెచ్చరికలను తాజా పరిశోధనలు నిర్థారిస్తున్నాయి.
మన ఆహార పదార్థాల్లో వండవలసిన అవసరం లేనివీ, కొద్దిగా వండవలసినవీ, ఎక్కువగా వండవలసినవీ అనేకం ఉన్నాయి. టమోటా, సొర, బూడిద గుమ్మడి, కొత్తిమీర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, ముల్లంగి ఇలాంటి వాటిని పొయ్యిమీద పెట్టి వండకుండానే వివిధ వంటకాలు చేసుకోవచ్చు. లేదా కొద్దిపాటి ఉష్ణోగ్రత దగ్గర ఉమ్మగిల చేసి కావలసిన వంటకం తయారుచేసుకోవచ్చు. ఇలాంటి కోమలమైన కూరగాయల్ని అధిక ఉష్ణోగ్రత దగ్గర వండటంవలన మనకు తెలీకుండానే అనేక అనారోగ్యాలు సంభవిస్తున్నాయి.
పేరిన నేతిని కరిగించటానికి చిన్న కాయితం ఉండని వెలిగించి, ఆ మంటమీద నేతి గినె్నని వేడి చేస్తే చాలు నెయ్యి కరుగుతుంది. ఈ నేతి గినె్నని ‘గాడిపొయ్యి’మీద పెట్టామనుకోండి... నెయ్యి మాడిపోయి తినటానికి వీలు కాకుండాపోతుంది. అలా మాడిన నెయ్యి విషపూరితమైంది. వాంతి, వికారాలతో పాటు కేన్సర్ లాంటి వ్యాధులకు కారణం అవుతుంది. ఒకప్పటికన్నా ఇప్పుడు ఓవెన్ల వాడకం పెరిగింది. గ్రిల్ చేసి బాగా మాడ్చిన తండూరి వంటకాలను ఎక్కువమంది తింటున్నారు. మంటమీద లేదా, గ్రిల్లు మీద కాల్చిన మాంసం రొమ్ము కేన్సరుకు దారితీస్తుందని నార్త్ కరోలినా వైద్యుల బృందం జరిపిన పరిశోధనలను నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌సిఐ) జర్నల్ తాజా సంచిక ప్రచురించింది. ‘కాల్చిన మాంసం - రొమ్ము కేన్సరు’ అనే శీర్షికన ప్రచురితమైన ఈ వ్యాసం అధిక ఉష్ణోగ్రత దగ్గర మాడ్చిన వంటకాల గురించి ప్రముఖంగా చర్చించింది.
కూరగాయలైనా, మాంసం ముక్కలైనా ప్రతీ ద్రవ్యానికి కొంత వేడిని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. అంతకుమించిన వేడి అందిస్తే ఆ ఆహార ద్రవ్యం మాడిన నెయ్యిలాగే విషపూరితవౌతుంది. కోమలమైన కూరగాయలను క్రూరంగా కాల్చి లేదా నరకలోకంలో పాపుల్ని వేయించినట్టు సలసలా కాగిన నూనెలో వేయించి తినటం వలన కేన్సరుకు దగ్గరౌతామని ఈ పరిశోధన సారాంశం. మాడిన నెయ్యి, మాడిన అన్నం, మాడిన కూరలు, మాడిన మాంసం వీటన్నింటిలోనూ మాడటం కారణంగా రసాయన చర్యలు జరిగి విష లక్షణాలు ఏర్పడతాయని, అవి కేన్సర్ వచ్చేందుకు దారులు వేస్తాయని ఈ వైద్య బృందం హెచ్చరిస్తున్నారు.
కేన్సరు వ్యాధితో బాధడుతున్న స్ర్తిలలో రొమ్ము కేన్సరు బాధితుల సంఖ్యే ఎక్కువ. ఒకప్పటికన్నా ఇప్పుడు రొమ్ము కేన్సరును తొలిదశలోనే గుర్తించే పరిజ్ఞానం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చినప్పటికీ, అశాస్ర్తియమైన వంటకాలవలన ఈ రోగుల సంఖ్య ఇపుడు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కొత్త మిలీనియంలో ఈ 17 సంవత్సరాల్లో మన ఆలోచనా విధానంలోగానీ, జీవన విధానంలోగానీ విశేషమైన మార్పులు చోటుచేసుకున్నాయి. హానికారక ఆహారాలపట్ల వ్యామోహం పెరిగింది. ఆరోగ్య స్పృహ తగ్గిపోతోంది. ఇది ఒక్క రొమ్ము కేన్సరుకు మాత్రమే పరిమితం కాదు. ఈ అవయవంలో కేన్సరుకు కారణం అయ్యేది ఇతర అవయవాలలో కేన్సరుకు దారితీయదనే హామీ ఏమీ ఉండదు కదా!
ఈ రకమైన మాడిన వంటకాలలో మాడిన కొద్దీ ‘ఔ్యకషకషజష ఘూ్య్ఘౄఆజష దకజ్యూష్ఘూఇ్యశఒ(-్హ)’, ‘్దళఆళ్యూ షకషజష ఘౄజశళఒ (్హ్ళ)’ అనే రసాయనాలు పుడతాయి. ఇవి జీవకణాలలోని డిఎన్‌ఏలో మార్పులకు కారణం అవుతాయి. ఈ మార్పులు కేన్సరు కణాల పుట్టుకు దారితీస్తాయి. రొమ్ము కేన్సరు వచ్చి చికిత్స తీసుకుని బయటపడిన వారు కేన్సరు కారకమైన ఈ ‘మాడ్చిన వంటకాలు’ తినటం కొనసాగించినట్లయితే అది మరణానికి దారితీస్తుందని కూడా ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.
అవసరమైన దానికన్నా అధిక ఉష్ణోగ్రత దగ్గర నూనెలో వేగుతున్న వడియాలు, అప్పడాలు, ఆలు చిప్స్, ఇతర వేపుళ్ళు పాంక్రియాజ్ కేన్సరుకు కూడా కారణం అవుతాయంటున్నారు శాస్తవ్రేత్తలు. ఇవి కమ్మని విషాలు. విషకన్యల వంటివి. వాటి ఆకర్షణలో మనం చిక్కుకుపోకూడదు. మాంసానిక్కూడా అధిక ఉష్ణోగ్రత విషతుల్యమే అవుతుంది. ఎక్కువ వేడిమీద ఎక్కువ సేపు వండితే అమృతం కూడా విషంగా మారిపోతుంది. కంద, చేమదుంపల్లాంటివి వాటిని ముందు చాలా సేపు ఉడికించి, ఆ తరువాత వాటిని నూనెలో వేసి వేయిస్తారు. తినేటప్పుడు చల్లారి గట్టిగా ఉంటాయని మరొకసారి వేయిస్తుంటారు. ఇలా ఎక్కువ వేడిమీద ఎక్కువసేపు వండటమే విషాల పుట్టుకకు కారణం అవుతుంది. ఒకసారి వండిన దాన్ని మళ్లీ వండకూడదనే నియమం పెట్టుకోవాలి.
వేడి ఎక్కువగా తగిలినప్పుడు ఆహార ద్రవ్యంలోని పిండి పదార్థాల్లో అమైనో యాసిడ్లు, కొవ్వు పదార్థాలతో కార్బన్ పరమాణువులు సంఘర్షణ పొందుతాయి. దానివలన ఎక్రిలమైడ్ అనే విష రసాయనం ఏర్పడుతుంది. కొవ్వు ఎక్కువగా కలిసిన మాంసంగానీ, నూనెలో బాగా వేగిన కూరలు ఇతర చిరుతిళ్ళుగానీ ఈ ఎక్రిలమైడుని ఎక్కువగా కలిగి వుంటాయి. అందుకనే వేపుడు కూరలు, నిప్పులమీద కాల్చిన మాంసం విషదోషాలతో నిండి ఉంటాయి. ఏ సినిమాకో షికారుకో వెళ్లినపుడు సరదాగా కొనుక్కుతినే 100 గ్రా. ఆలూ చిప్సులో మరగకాగిన నూనె ద్వారాను, ఆలూ దుంపల్లోని షుగర్స్ ద్వారానూ ఎక్రిలమైడ్ విషాలు నిండి ఉంటాయి. ఇది నమ్మలేని నిజమే! ఈ 100 గ్రాముల చిప్సు చాలట కేన్సరు రావటానికి!
నూనెలో వేయించిన కేరట్స్ వంటి దుంప కూరలు, ఉల్లిపాయలు, నల్లగా మాడిన కాఫీ గింజల పొడి, ఇన్‌స్టెంట్ కాఫీ పొడి, బ్రెడ్ టోస్టులు, కూకీలు, బిస్కట్టలూ, పూరీలు, చక్కిలాలు, పకోడీలు, నాన్ రోటీలు, టిక్కా వంటకాలు.. ఇవన్నీ ఎక్రిలమైడ్ విషాలతో నిండినవే! వేపుడు కూరలు అతిగా తినే అలవాటు తెలుగు వాళ్ళకి ఫ్రెంచి వాళ్ళ ద్వారా అలవాటైందేమో తెలీదు. సన్నగా పొడవుగా ఆలూ దుంపల్ని తరిగి మరగకాగిన నూనెలో వేయించి ఉప్పు కారం చల్లితే అదే ఫ్రెంచి ఫ్రై. ఫ్రెంచి ఫ్రైలు మన వేపుడు కూరల్లానే ఉంటాయి. వీటిలో అనుమతించిన మోతాదుకన్నా 20 శాతం ఎక్కువగా ఎక్రిలమైడ్ ఉంటుంది. అది ఎప్పుడో ఒక రోజు తింటే అంత ప్రమాదం లేకపోవచ్చు. కానీ రోజూ వేపుడు కూరలు అతిగా తినేవారికి విషదోషాల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
220 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 5 నిమిషాల పాటు వేగిన లేదా వండిన వంటకం ప్రమాదకరమైందని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. థర్మామీటర్లు పెట్టి కొలిచి వంట చేయటం సామాన్య గృహిణికి సాధ్యం అయే పనికాదు. ఎక్రిలమైడ్ లేకుండా ఆహారం తయారీకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటమే ఇందుకు పరిష్కారం.
వండవలసిన అవసరం లేని కూరగాయల్ని సాధ్యమైనంత వరకూ వండకుండానే తినండి. లేదా బాగా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే వండండి. బియ్యంతో పాటు కూరగాయ ముక్కలు కుక్కరులో వుంచి వండకండి. అన్నం ఉడకటానికి సరిపోయే ఉష్ణోగ్రత కూరగాయలకు చాలా ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్రిలమైడ్ పుట్టడానికి కారణం అవుతుంది. డీప్ ఫ్రై, డబుల్ ఫ్రై, డబుల్ రోష్టు ఇలాంటి పదార్థాలు హానికరమైనవైని గుర్తించండి. పూరీలు, బజ్జీలు, పునుగులు, వడలు, గారెలు ఇలాంటివి సరదాగా ఎప్పుడో ఒకసారి తినవలసినవే గానీ రోజూ మఠం వేసుకుని కూర్చుని తినేవి కాదు. వీటిలో ఎక్రిలమైడ్ శాతం ఎక్కువగా ఉంటుంది.
అధికంగా వేయించిన లేదా కాల్చిన వంటకాలనే టీవీలలోనూ, పత్రికల్లోనూ గొప్పగా చిత్రించటం వలన వేపుడు కూరలే నాగరిక ఆహారం అనే అభిప్రాయం బలంగా కలుగుతోంది. పరిమితి దాటి అధిక ఉష్ణోగ్రతమీద వంటకాల తయారీని నిషేధించే చట్టం రావలసిన అవసరం ఎంతైనా ఉంది. హోటళ్లలోనూ, కేటరర్లు వండే విందు భోజనాల్లోనూ అపకారం చేసే వంటకాల మీద ప్రభుత్వానికి అదుపు లేకపోతే ప్రజల్ని కేన్సరు వ్యాధికి బలి చేయడమే అవుతుంది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642,

డా జి.వి.పూర్ణచందు