సంజీవని

టెండినైటిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భుజాలకి దెబ్బలు, ఆర్థ్రయిటిస్ బుర్సిటైస్ లేక టెండినైటిస్ లాంటి వాటివల్ల భుజాన్ని కదిలించలేని స్థితి వస్తుంది. భుజ కీలు బిగుసుకుపోవడంవల్ల చేతి కదలికలు కష్టమవుతాయి. కదలికలు చాలా నొప్పిని కలిగిస్తాయి.
చికిత్సలో కీలు కదలికలు మామూలుగా అయ్యేట్టు చూడడంతోబాటు నొప్పి లేకుండా చేస్తారు. యాంటి ఇన్‌ఫ్లమేటరి మందులు వాడతారు. కీళ్ళలోకి కార్టిజోన్స్ ఇంజెక్ట్ చేస్తారు.
భుజ కదలికలలో మార్పు రాగానే వైద్యుడికి చూపించి చికిత్స చేయించడం అవసరం. అసలు చికిత్స చేయకుండా అలా వదిలిస్తే శాశ్వత వైకల్యం లభించవచ్చు.
టెన్నిస్ అంటే తెలీని వాళ్ళకి కూడా టెన్నిస్ ఎల్బో అనే వ్యాధి వస్తుంది. అసలు ఈ వ్యాధికి, టెన్నిస్ ఆటకు సంబంధం లేదు. కానీ టెన్నిస్ ఆటలో మోచేయి కదలికలు, మణికట్టు కదలికలు ఎక్కువగా వుంటాయి. మోచేయి ప్రాంతం నుంచి మణికట్టు మధ్య టెండాన్స్ దెబ్బతినడంతో ఈ ఇబ్బంది కలుగుతుంది. కండరాల్ని బిగించినా, చేతి కదలికలతో నొప్పి ఎక్కువవుతుంది. చేతి కదలికలు బాగా ఎక్కువగా వాడడంవల్ల ఈ ఇబ్బంది కలుగుతుంది. విశ్రాంతి అవసరం. కొన్ని చేతిని బలపరచే వ్యాయామాలతోబాటు, నొప్పిని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించే మందులు వాడతారు. ఎలాస్టిక్ బాండేజెస్‌ని అవసరాన్ని బట్టి వాడతారు.