సంజీవని

కౌమారంలో గర్భం.. సమస్యలకు మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో నిమిషానికొక స్ర్తి గర్భం, ప్రసవ సంబంధ కారణాలతో మరణిస్తూంది. 10మంది స్ర్తిలు మరణపు అంచుదాకా వెళ్తున్నారు. 30 మంది స్ర్తిలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎక్కువ మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతున్నాయి. అందులో అత్యధికులు కౌమార బాలికలు, 15-25 సంవత్సరాల వయసు యువతులలో కంటే 15 సంవత్సరాల లోపు బాలికలలో మాతృమరణాల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువ. శిశుమరణాల సంఖ్య 2-3 రెట్లు ఎక్కువ.
తల్లుల ఆరోగ్యం సమాజ ఆరోగ్యానికి పునాది
18 సంవత్సరాలలోపు వయసులో వివాహం చేసుకోవడం, 20 సంవత్సరాలలోపు మొదటి బిడ్డను కనడం తల్లి ఆరోగ్యానికి నష్టదాయకం.
ప్రతి గర్భం కోరుకున్నది, ప్లాన్ చేసుకున్నపుడు వచ్చినది అయి ఉండాలి. కుటుంబానికి ఆధారం తల్లి. కుటుంబ సంరక్షణకురాలు తల్లి. తల్లి ఆరోగ్యంతోనే కుటుంబం, సమాజం, దేశం ఆరోగ్యం ముడిపడి వుంటుంది. అందుచేత తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కేవలం ఆమె వ్యక్తిగత బాధ్యత కాదు. కుటుంబం, సమాజం, దేశం యొక్క బాధ్యత.
కనీస ఆర్థిక వనరులు, కుటుంబ సభ్యుల ప్రేమాదరణలు, సంఘర్షణలు, హింస లేని సమాజం తల్లి ఆరోగ్యానికి పునాది.
కౌమార బాలికలకు గర్భంవలన రాగల సమస్యలు
ఆరోగ్యపరమైనవి
- రక్తహీనత రావడం, అప్పటికే ఉన్న రక్తహీనత ఎక్కువవడం
- గర్భస్రావమవడం, నెలలు నిండక మునుపే ప్రసవం, బిడ్డ తల్లి కడుపులోనే చనిపోయి పుట్టడం
- రక్తపోటు ఎక్కువవడం, గుర్రపువాతం రావడం
- ప్రసవానికి ముందు, తరువాత రక్తస్రావం ఎక్కువగా అవడం
- సులభంగా జననాంగ ఇన్‌ఫెక్షన్లు, లైంగిక ఇన్‌ఫెక్షన్లు సోకడంవలన గర్భస్థ శిశువుకు ఇన్‌క్షన్ సోకి వైకల్యాలు రావడం, గర్భస్రావాలవడం.
-ప్రసవం కష్టమైనపుడు, నెలలు నిండకమునుపే పురుడు వస్తున్నపుడు బిడ్డకు ఆపద కలగకుండా ఉండడానికి ఆపరేషన్ ద్వారా బిడ్డను ప్రసవం చెయ్యాల్సి వచ్చే పరిస్థితి కౌమార గర్భిణీలకు ఎక్కువ ఉంటుంది.
-రక్తహీనత కారణంగానూ, జననాంగాలు పూర్తి స్థాయికి ఎదగడపోవడంవల్లనూ ప్రసవం తరువాత జనననాంగాలకు ఇన్‌ఫెక్షన్ సోకి, అది రక్తంలోకి వ్యాప్తి చెంది మరణించే ప్రమాదం కూడా కౌమార గర్భిణులకు ఎక్కువే.
- కౌమార గర్భిణులకు పీలగా ఉండే శిశువులు పుట్టడం (2.5 కేజీల లోపు) వారికి సులభంగా ఇన్‌ఫెక్షన్లు సోకడం, ఇన్‌ఫెక్షన్ల కారణంగా బలహీనపడడం, బలహీనత కారణంగా మళ్లీ ఇన్‌ఫెక్షన్ ప్రమాదం ఎక్కువవడం, ఈ అనారోగ్య వలయం శిశువులు మొదటి జన్మదినం చూడకుండానే మరణించే విషాదానికి దారితీస్తుంది.
అరక్షిత గర్భవిచ్ఛిత్తి
-గర్భ విచ్ఛిత్తికారణంగా ఏటా అనేకవేలమంది కౌమార బాలికలు చనిపోతున్నారు లేక దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతున్నారు.
-వైద్యపరమైన, సంస్కృతీపరమైన, చట్టపరమైన అడ్డంకులవలన సురక్షితంగా గర్భవిచ్ఛిత్తిని చేయించుకోవడం అదంత సులభం కాదు.
- రక్షణ లేని, ప్రమాదకర పద్ధతుల ద్వారా గర్భవిచ్ఛిత్తి చేయించుకోవడంవలన జరిగే మరణాలు, అనారోగ్యాల ప్రమాదం అన్ని వయసుల స్ర్తిలకూ ఉన్నప్పటికీ కౌమార బాలికలకు మరింత ఎక్కువ. కౌమార బాలికలకు వివాహం కాక ముందు గర్భం వస్తే మరింత ప్రమాదకరం.
-కౌమార బాలికలకు వివాహం కాకుండా గర్భం వస్తే దానిని దాచి, కొన్ని నెలలు గడిచాక, ప్రమాదకర సమయంలో గర్భవిచ్ఛిత్తి చేయించుకుంటానికి ప్రయత్నిస్తారు. గర్భం తొలి నెలల్లో చేయించుకుంటే ప్రమాదం కానిది నెలలు గడిచాక చేయించుకోవడం వలన ప్రమాద భరితమవుతుంది. ఆర్థిక కారణాలవలన, దాపరికంకోసం, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బందితో, భద్రమైన పద్ధతుల్తో, భద్రమైన చోట కాకుండా శిక్షణ లేని వారితో ప్రమాదకర పద్ధతుల్లో, భద్రత లేని చోట చేయించుకోవడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి.
-అవివాహిత తప్పనిసరి పరిస్థితుల్లో గర్భాన్ని మోసినప్పటికీ ఆ విషయాన్ని సాధ్యమైనంతవరకూ ఎవరికీ తెలియకుండా దాచడానికి ప్రయత్నించడంవలన ఆమె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. సరైన పోషకాహారం తినదు, వైద్యసేవల్ని పొందదు, లేక ఆలస్యంగా పొందుతుంది.
ప్రసవం తరువాత అవివాహిత కౌమార తల్లి, ఆమె బిడ్డకు వివాహిత కౌమార తల్లి, ఆమె బిడ్డకంటే ఎక్కువ ప్రమాదాలు కలుగుతాయి. అవివాహిక కౌమార తల్లికి పుట్టిన బిడ్డకు తక్కువ సంరక్షణ లభించే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో బిడ్డను పుట్టగానే చంపేయడానికి, ఎక్కడో ఒకచోట అనాధగా వదిలేయడానికి, బిడ్డను హింసించడానికి దారితీస్తున్నాయి.
కుటుంబంలో కల్లోలం, తల్లి తీవ్రమైన మానసిక సంక్షోభం, ఆందోళన, డిప్రెషన్, నిరాశకు లోనయే అవకాశం ఉంది.
సామాజిక, ఆర్థిక అభివృద్ధి
కుటుంబం నుండి, సమాజం నుండి నిరసనను, అవహేళనను ఎదుర్కోవలసి వస్తుంది. నిరాదరణకు, వెలికి గురవడంవలన, బిడ్డను సక్రమంగా పెంచడానికి శక్తి, సామర్థ్యం లేకపోవడంవలన ఆత్మన్యూనత, ఒత్తిడి, ఆందోళనకు గురవడం, ఆత్మహత్యకు పాల్పడడం జరగొచ్చు.
అవివాహిత తల్లికి పుట్టిన బిడ్డలు అనేక మానసిక, సామాజిక, ఆర్థిక అడ్డంకుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇవన్నీ వారు సక్రమంగా, గౌరవప్రదంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి అవరోధంగా నిలుస్తాయి.

వ్యక్తిగత అభివృద్ధి
కౌమార వయసులో గర్భం కారణంగా చదువు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. పరిమిత విద్య వలన తక్కువ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాహం కాని కౌమార గర్భవతి తప్పుచేసిన వ్యక్తిగా సంఘంలో ముద్ర పడి ఆత్మన్యూనతతో జీవించడం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడం జరుగుతుంది. ఈ ముద్రనుండి తప్పించుకోవడానికి ఒకోసారి ఆ గర్భానికి కారకుడైన వ్యక్తితో బలవంతాన పెళ్లి చెయ్యడం, ఆ వ్యక్తి జీవితాంతం ఆమెను శీలంలేని వ్యక్తి అంటూ కించపరచడం జరగొచ్చు. పేదరికంవలన, తగినంత ఆసరా లేకపోవడం వలన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

వివాహ పూర్వ
కౌమార గర్భం
కౌమార బాలికలకు వివాహం కాకముందు గర్భం వస్తే అదనపు నష్టాలు కలుగుతాయి. వివాహ పూర్వ గర్భాన్ని కుటుంబం, సమాజం ఆమోదించదు కనుక భయపడి ఆలస్యంగా ఆరోగ్య సేవల్ని పొందుతుంది లేదా అసలు ఆరోగ్య సేవల్ని పొందదు. గర్భం సమయంలోనూ, ప్రసవం సమయంలోనూ, ప్రసవం తరువాత వివాహం అయిన కౌమార గర్భిణీ కంటే ఎక్కువ ప్రమాదాలకు గురవుతుంది.

సమాజం
చిన్నవయసులో గర్భాలవలన కలిగే ప్రతికూల పరిణామాలు తల్లీ బిడ్డలకే కాక సమాజానికి కూడా నష్టాన్ని కలగజేస్తాయి. తక్కువ విద్యావంతురాలైన తల్లి సమాజాభివృద్ధికి పూర్తి స్థాయిలో తన శక్తి, సామర్థ్యాల్ని వినియోగించలేదు. ఇంక అవివాహిత కౌమార తల్లి, ఆమె బిడ్డ ఒకోసారి సమాజానికి భారంగా జీవిస్తారు.

డా.ఆలూరి విజయలక్ష్మి
గైనకాలజిస్ట్.. 9849022441

డా.ఆలూరి విజయలక్ష్మి