సంజీవని

మూత్రంలో మంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: ఆహారంలో పులుపు పదార్థాలు, ఊరగాయలు వగైరా ఆమ్ల గుణాలు కలిగినవి ఎక్కువగా తినేవారికి మూత్రంలో ఆమ్లత్వం పెరిగిపోయి మంట ఏర్పడుతుంది. దీన్ని డిజూరియా అంటారు. మూత్రంలో బ్యాక్టీరియా దోషం వలన, సుఖవ్యాధులవలన కూడా ఈ మంట రావచ్చు. మూత్ర పరీక్ష, రక్తపరీక్షలు చేస్తేగానీ కారణం తెలీదు.
-జె.గురుదత్తు, కిర్లాంపూడి
జ: తరచూ అకారణంగా వచ్చే చలిజ్వరం, వికారం, వాంతి, పొత్తికడుపులో నొప్పి, చిరాకుగా ఉండటం, మూత్రంలో దుర్వాసన, మూత్రానికి పదే పదే వెళ్లాల్సి రావడం, మంట తెలియకుండానే మూత్రం బొట్లు బొట్లుగా లీక్ అవ్వటం, మూత్రం సరిగా అవకపోవడం లాంటి అనుబంధ సమస్యలు కూడా ఉండవచ్చు.
ఆహార పానీయాలు ప్రముఖంగా ఈ మంటకు కారణం అవుతున్నాయి. బాక్టీరియా దోషాలు, ఎండల కారణంగానో శ్రమ కారణంగానో శరీరంలో నీటి ధాతువు తగ్గిపోయి శోష ఏర్పడటం, ప్రోస్టేట్ గ్రంధిలో తేడాలు, షుగరు వ్యాధి, ఇవన్నీ మూత్రంలో మంట కలగటానికి కారణాలే! స్ర్తిలలో జననాంగం దగ్గర ఏర్పడే ఇతర వ్యాధులు మూత్రంలో మంటకు కారణం కావచ్చు. మెనోపాజ్ కూడా ఒక్కోసారి దీనికి కారణం కావచ్చు.
వేడి చేసినందువలన మంటగా మూత్రం అవుతున్నపుడు రెండు మూడు గ్లాసుల నీళ్లుగానీ, బార్లీ జావగానీ, కొబ్బరినీళ్ళుగానీ, పలుచని మజ్జిగ గానీ తాగితే పసుపుదనం, మంట తగ్గి మూత్ర సాఫీగా నడుస్తుంది. ఉసిరికాయ రసం (ఆమలకి) తీసి కలుపుకుని తాగితే త్వరగా మంట తగ్గుతుంది. అలా తగ్గకపోతే అది బాక్టీరియా దోషంవలన వస్తున్నదేమో మూత్ర పరీక్ష చేయించి తెలుసుకోవాలి. బాక్టీరియా దోషాలు తక్కువ స్థాయిలో ఉన్నపుడు మూత్రంలో యాసిడ్ పెరగకుండా అంటే వేడి చేసే పదార్థాలు లేకుండా ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటే మందుల అవసరం పెద్దగా రాకపోవచ్చు.
మూత్ర విసర్జన సమయంలో చిక్కని స్రావం లేదా చీము జననాంగంలోంచి వెలువడుతోందంటే లోపల బ్లాడర్ నుండి జననాంగం లోపలి భాగం వరకూ ఉన్న ప్రాంతంలో ఎక్కడో పుండు లాంటిది ఏర్పడిందని అర్థం. ఇలాంటపుడు సరైన యాంటీ బయాటిక్స్ వాడవలసి రావచ్చు.
ధనియాల పొడిని నీళ్ళలో వేసి బాగా మరిగించి తాగితే మూత్రంలో మంట త్వరగా తగ్గుతుంది. జననాంగాల దగ్గర పరిశుభ్రత కూడా ఈ వ్యాధిలో ముఖ్యమే! తరచూ మూత్రంలో మంట వస్తుంటే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే అవకాశం కూడా ఉంది. గోక్షురాది చూర్ణం, చంద్రప్రభావటి చందనాసవం లాంటి ఆయుర్వేద ఔషధాలు మంచి ఆయుర్వేద వైద్యుని సలహా మీద వాడవచ్చు. మంచి గంధంచెక్కని సానమీద అరగదీసి ఒక చెంచా గంధంలో ఒకటీ లేదా రెండు పలుకులు పచ్చ కర్పూరం కలిపి కొద్దిసేపు ఆరనిస్తే మాత్ర కట్టుకోవటానికి వీలుగా అవుతుంది. బఠాణీ గింజలంత ఉండలు చేసుకుని పూటకు రెండు ఉండలు చొప్పున మూడు పూటలా తీసుకుంటే మూత్రంలో మంట త్వరగా తగ్గుతుంది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,

డా జి.వి.పూర్ణచందు