సంజీవని

ఇన్‌ఫెక్షన్ వల్లే గొంతు నొప్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో చాలామంది గొంతు నొప్పితో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటంవలన గొంతు నొప్పి (త్రోట్‌పెయిన్) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడంవల్ల టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్, లెరింజైటిస్, ఫెరింజైటిస్ వంటి వ్యాధులవలన కూడా గొంతు నొప్పి వస్తుంది.
ఎకోనైట్: చల్లగాలిలో తిరగడంవల్ల గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. ఇలాంటి కారణంచే గొంతు నొప్పి ప్రారంభమై మింగటం కష్టంగా మారి గొంతు మంట మండుతుంది. దాహం విపరీతంగా ఉండి జ్వరంతో బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
జెల్సిమియం: వైరల్ ఇన్‌ఫెక్షన్ మూలంగా వచ్చే గొంతు నొప్పికి ఈ మందు బాగా పని చేస్తుంది. గొంతు నొప్పి మూలంగా ద్రవ పదార్థాలు సైతం మింగడం కష్టంగా మారుతుంది. జ్వరంతో నీరసంగా, అస్థిమితంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
మెర్కుసాల్: గొంతు నొప్పి రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. నోరు దుర్వాసన కొడుతుంది. నాలుక పెద్దదై నాలుక చివర పళ్ల అచ్చులు కనబడుట ఈ ప్రత్యేక లక్షణం. వీరికి జలుబు చేసినపుడల్లా గొంతునొప్పితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
*