సంజీవని

పీచు తగ్గితే ‘ఫిషర్స్’ బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గడంవలన మలబద్ధకం తయారవుతుంది. దీంతో మలవిసర్జన కష్టంగా మారుతుంది. మలవిసర్జన సాఫీగా జరగనపుడు ముక్కడంవలన మలద్వారంలో పగుళ్లు ఏర్పడటాన్ని ఫిషర్ అంటారు. ఫిషర్స్ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితోపాటు రక్తస్రావం జరుగుతుంది.
కారణాలు
మలవిసర్జన సక్రమంగా జరుగక మలబద్ధకం ఏర్పడటంవలన, కొందరిలో వంశపారంపర్యంగా ఎక్కువసేపు కుర్చీలోనే కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తించడంవల్ల, తక్కువగా నీరు త్రాగడంవల్ల, మద్యం అతిగా సేవించుటవల్ల, ఫాస్ట్ఫుడ్స్ వేపుళ్ళు అతిగా తినడంవల్ల మాంసాహారం తరచుగా తినటంవలన ఫిషర్స్ సమస్య వస్తుంది.
లక్షణాలు
మల విసర్జన సాఫీగా జరుగక తీవ్రమైన నొప్పి, మంట వుంటాయి. మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు. సుఖవిరేచనం కాకపోవటం వీరిని బాధిస్తుంది. సుఖవిరేచనం కాకపోవటంతో చిరాకుగా, కోపంగా వుంటారు. అప్పుడపుడు విరేచనంలో రక్తం పడుతుంటుంది. మలవిసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో నొప్పితోపాటు రక్తస్రావం జరుగుతుంది.
జాగ్రత్తలు
సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఘనపదార్థాలకన్నా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నించాలి. కారం, నూనె, మసాలా పదార్థాలు బాగా తగ్గించాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా త్రాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు). ప్రతిరోజు వ్యాయామం చేయాలి. రోజూ మలవిసర్జన సాఫీగా జరిగేట్లుగా చూసుకోవాలి. మద్యం అతిగా సేవించటం, ఫాస్ట్ఫుడ్స్ వేపుళ్లు, మాంసాహారం, చిరుతిండ్లు తినటం మానుకోవాలి.
చికిత్స
వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. వ్యాధి ఆరంభంలోనే హోమియో మందులను వాడుకుని ప్రయోజనం పొందవచ్చు. హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి వుంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగుతుంది కనుక సమూలంగా ఫిషర్స్ వంటి రుగ్మతలనుండి విముక్తి పొందవచ్చు.
మందులు
నైట్రిక్ ఆసిడ్: ఫిషర్స్‌కు అతి ముఖ్యమైన మందు. మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక మంట, మల ద్వారం చీరుకొనిపోయి నొప్పిగా ఉండుట ప్రత్యేక లక్షణం. నొప్పి మలవిసర్జన అనంతరం కూడా ఉండి బాధిస్తుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగింది.
అస్కులస్‌హిప్: మలద్వారం పొడిగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఆసనంలో పుల్లలు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనానికి వెళ్లాలంటే భయపడిపోతారు. విరేచనం తరువాత నొప్పిగా బాధగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక గుర్తుంచుకోదగింది.
నక్స్‌వామికా: శారీరక శ్రమ లేకుండా, మలబద్ధకంతో బాధపడుతూ తరచుగా మలబద్ధకం నివారణ మాత్రలు వాడేవారికి ఈ మందు ఆలోచించదగినది. అలాగే తరచుగా మలవిసర్జన చేయాలనిపించడం, తీరా మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక బాధాకరంగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
సల్ఫర్: ఫిషర్స్ వ్యాధి నయం చేయటంలో ఈ మందు అతి ముఖ్యమైనది. చాలా కేసులలో ఈ మందును వాడి ఫిషర్స్ వ్యాధి నుండి విముక్తి పొందవచ్చు. మలబద్ధకంతో బాధపడుతూ వుంటారు. మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి బాధాకరంగా ఉంటుంది. నొప్పి మలవిసర్జన అనంతరం కూడా ఉండి బాధిస్తుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
రటానియా: వీరికి ఆసనంలో గాజుపెంకులు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనం వెళ్లిన తరువాత కొంతసేపు వరకు నొప్పిగా బాధగా అనిపిస్తుంది. మలవిసర్జన సమయంలో అపుడపుడు రక్తం పడుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
హెమామెలీస్: మలబద్దకంతో బాధపడుతూ ఉంటారు. మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి కూడి రక్తం విస్తారంగా పడుతూ ఉన్నపుడు ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా ఫిషర్స్ బాధ నివారణకు మ్యురాటిక్ ఆసిడ్, గ్రాఫాయిటిస్, మెర్క్యుసాల్, ఫాస్పారస్ వంటి మందులను వ్యాధి లక్షణాల ఆధారంగా వాడుకొని ఫిషర్స్ నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్ 9440229646