సంజీవని

రేనాఢ్స్ సిండ్రోమ్ అంటే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె ముడుచుకోగానే బయటకు వచ్చే రక్తం ‘అయోర్టా’ అనే పెద్ద రక్తనాళం ద్వారా శరీరం క్రిందకి ప్రవహిస్తుంది. ఈ అయోర్టా వ్యాసం 25మి.మీ. ఉంటుంది.
ఈ రక్తనాళం శాఖోపశాఖలుగా చీలి, కొన్ని శాఖలు తలకి, చేతులకి గుండెకి విడిపోయి అలా పాదం వరకూ వెళ్తాయి. కొన్ని శాఖలు ఆహార నాళం వైపు వెళ్తాయి. ఇలా శరీరంలోని అన్ని కణాలకు రక్తం వెళ్లి ఆక్సిజన్, ఆహార పదార్థాల్ని సరఫరా చేస్తుంటుంది. ఏ భాగంలోకి రక్తం వెళ్ళేదో ఆ భాగానికి ఆక్సిజన్, ఆహారం అందక దెబ్బతింటుంది. దానినే ‘గాంగ్రీన్’ అంటారు. ఇది సాధారణంగా శరీరం చివరి భాగాల్లో ప్రారంభమవుతుంది ఏ వేళ్ళ దగ్గర. దానికి సకాలంలో సరైన చికిత్స అందకపోతే క్రమంగా గాంగ్రీన్ కణాలు పైకి పాకి పై భాగాల్ని తీసివేయాల్సి వస్తుంది. ఈ స్థితి సాధారణంగా మనకి మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ‘వాస్క్యులోపతి’ అంటారు.
ఈ పెద్ద రక్తనాళాలు మిల్లీ మీటర్ కన్నా తక్కువ వ్యాసముండే ఆర్టెరీస్‌లోకి అక్కడనుంచి కేఫలరీస్ అనే అతి సన్నని రక్తనాళాల ద్వారా కణాలలోకి రక్తం వెళ్తుంది. ఈ రక్తహారంలో ఎక్కడ దెబ్బతిన్నా, అడ్డంకులేర్పడినా ఇబ్బందులు మొదలవుతాయి. అందుకే గుండెతో బాటు రక్తనాళాలూ ఆరోగ్యంగా వుండాలి.
శరీరంలోని కణాలనుంచి కార్బన్ డయాక్సైడ్, వ్యర్థాల్ని వెనక్కితెచ్చే రక్తనాళాల్ని ‘వీన్స్’ అంటారు. వీటి ద్వారా పైకి పోయే రక్తం, తిరిగి వెనక్కి రాకుండా ఉండడానికి కవాటాలు ఉంటాయి. ఇవి రక్తం వెనక్కి రాకుండా కాపాడుతుంటాయి.
రేనాడ్స్ సిండ్రోమ్‌ని కొందరు అనుభవించే ఎమోషనల్ స్టిముల్ ఎక్కువై వేళ్ళు, వేళ్ళ చివరకు విస్తరించిన సన్నటి రక్తనాళాలు ముడుచుకొని రక్తంతో ఆక్సిజన్, ఆహారం ఆ ప్రాంతాలకు చేరదు. దాంతో ఆ ప్రాంతాలు నీలంగా మారి మొద్దుబారిపోవచ్చు. ఎటాక్ తగ్గిపోగానే రక్తం మళ్లీ మామూలుగా ప్రవహిస్తూ వేళ్ళు, చివరలు మళ్లీ ఎర్రగా మారి మామూలవుతాయి.
రేనాడ్స్ సిండ్రోమ్ ఆర్టెరీలలో జబ్బువల్లగాని, ఆర్థరైటిస్ స్ల్కీరోడెర్మాలాంటి వ్యాధులవల్లగాని, రక్తసంబంధ సమస్యలవల్లగాని, కొన్ని మందులు రసాయనాలవల్లగాని, ఎక్కువగా వేళ్ళతో పనిచేసే వాళ్ళకి రేనాడ్స్ సిండ్రోమ్ రావచ్చు.
చేతులు, వేళ్ళకి చలి ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి. రకరకాల వాసోడైలేటర్ మందులతో పరిస్థితిని మామూలు స్థితికి తీసుకువస్తారు. అందుకే చలి ఎక్కువగా వున్న ప్రాంతాల్లో సంచరించేవాళ్ళు పాదాలకు సాక్స్, చేతులకు గ్లౌజెస్ వేసుకోవడం అవసరం.
రేయేస్ సిండ్రోమ్
రేయేస్ సిండ్రోమ్ పిల్లల్లో వస్తుంటుంది. దీంట్లో మొదడు కణాలు, లివర్ కణాలు కూడా ఇన్‌ఫ్లేమ్ అవుతాయి. మెదడు కణాలకు ఇన్‌ఫ్లమేషన్ వస్తే ఎన్‌సెఫలైటిస్ అంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు.
రేయేస్ సిండ్రోమ్ రావడానికి కారణం తెలీదు కాని, వైరస్‌వల్ల ఈ ఇబ్బంది వస్తుందని గ్రహించారు. ఫ్లూలాంటి వ్యాధులు వచ్చిన తర్వాత ఇది రావచ్చు. జ్వరం, తలనొప్పి, వాంతులు, ఫిట్స్ వస్తాయి ముందు. వీటి ప్రభావం కేంద్ర నాడీ మండలం మీద పడుతుంది. ఫ్లూ వచ్చినపుడు యాస్పిరిన్ లాంటివి వాడి తగ్గించుకోవడానికి ప్రయత్నించడంవల్ల ఆ వైరల్ ఇన్‌ఫెక్షన్ కాస్తా ‘రేయేస్ సిండ్రోమ్’గా మారుతుంది. ఏది ఏమైనా రేయేస్ సిండ్రోమ్ ప్రభావం మెదడు కణాల మీద బాగా పడుతుంది. అందుకని ఈ వ్యాధి వచ్చినవాళ్ళలో పది శాతం చనిపోతున్నారు.

డా.రవికుమార్ ఆలూరి
చీఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్, (కిమ్స్)
98480 24638

డా.రవికుమార్ ఆలూరి