సంజీవని

యుక్తవయస్కుల్లోనూ ‘డిస్క్’ సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెనె్నముక. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో వుండే డిస్కులే తోడ్పడుతాయి. నడుము, మెడ ప్రాంతంలో ఉండే డిస్కులు అరిగిపోవటం వలన లేదా డిస్కులు ప్రక్కకు తొలగటం వలన నడుము, మెడ నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి, నడుము నొప్పి. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కన్పించే నడుము నొప్పి (లంబార్ స్పాండైలోసిస్), మెడనొప్పి (సర్వికల్ స్పాండిలోసిస్) ఇపుడు వయసుతో నిమిత్తం లేకుండా ఇటీవల యుక్తవయసులో వున్నవారు సైతం ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవన శైలి విధానమే. మెడనొప్పి, నడుము నొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా సమస్య తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి ఆస్టియోఫైట్స్ ఏర్పడుతాయి. ఇలా కార్టిలేజ్‌తో వచ్చే మార్పులవలన తీవ్రమైన నడుము, మెడ నొప్పితో వేధించబడుతారు. ఇలాంటి సమస్యలనే ‘లంబార్ స్పాండైలోసిస్’ మరియు ‘సర్వికల్ స్పాండిలోసిస్’ అంటారు.
డిస్క్ సమస్యలకు కారణాలు.. -ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటంవలన వస్తుంది.
-స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం
-ప్రమాదాలలో వెన్నుపూసలు దెబ్బతినడం లేదా ప్రక్కకు తొలగటం.
-కంప్యూటర్స్ ముందు ఎక్కుసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం.
-ఈ సమస్యకు మరో ప్రధాన కారణం స్థూలకాయం.
-ఒకే చోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం.
-శక్తికి మించిన బరువులెత్తడం, హఠాత్తుగా నడుము, మెడ వంచడం వంటి పనులవల్ల వస్తుంది.
- ప్రయాణాలు చేస్తున్నపుడు లేదా ఏమైనా దెబ్బలు తాకినపుడు, శరీరం కుదుపునకు లోనైనప్పుడు
-శరీరానికి తగినంత కాల్షియం అందనపుడు నొప్పి వస్తుంది.
- నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్ లోపించడం వంటివి డిస్క్ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పుకొనవచ్చు.
లక్షణాలు.. డిస్క్ పక్కకు జారినపుడు అది వెన్నుపామును నొక్కుతుంది. దీనివల్ల నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పి కాళ్లు చేతులకు కూడా పాకుతుంది.
నడుము నొప్పి లక్షణాలు
-నడుము నొప్పి తీవ్రంగా ఉండి నడుము ఎటువైపు కదల్చినా వంగినా, కూర్చున్నా నడిచినా నొప్పి తీవ్రత పెరుగుతుంది.
-నాడులు ఒత్తిడికి గురికావడంవల్ల నొప్పి ఎడమ కాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధిస్తుంది.
-నడుము కింది భాగం మరియు ఎడమ కాలు లేదా కుడి కాలుకు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటుంది.
-హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, నడుము వంచినా తీవ్రమైన నడుమునొప్పితో బాధపడతారు.
మెడనొప్పి లక్షణాలు.. -మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదల్చినా నొప్పి తీవ్రత పెరుగుతుంది.
-నాడులు ఒత్తిడికి గురికావడంవల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు వ్యాపిస్తుంది.
-తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, తల తిప్పినట్లుగా అన్పించుట, చెయ్యి పైకి ఎత్తడం కష్టంగా మారుతుంది.
-నడుస్తున్నపుడు, నిలబడినపుడు తూలుతున్నట్లుగా అనిపించడం జరుగుతుంది.
జాగ్రత్తలు.. డిస్క్ సమస్యలతో వేధించబడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాహనం నడిపేటపుడు, కుర్చీలో కూర్చున్నపుడు నడుము, మెడ నిటారుగా వుండే విధంగా సరియైన స్థితిలో కూర్చోవాలి. బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం తప్పనిసరి. బల్లమీదగాని, నేలమీదగాని పడుకోవాలి. నిత్యం వ్యాయామం, ప్రాణాయామం, యోగా చేయాలి. తల క్రింద ఎతె్తైన దిండ్లు వాడకూడదు. మెడ, నడుము ఒకేసారి అకస్మాత్తుగా తిప్పకూడదు. నొప్పి ఉన్నపుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి. నొప్పి రాకుండా ఉండటానికి సమతులాహారం తీసుకుంటూ స్థూలకాయం రాకుండా జాగ్రత్తపడటం ఈ సమస్యకు మేలైన నివారణామార్గం.
మందులు- బ్రయోనియా: మెడ, నడుము కదిలించటంవలన నొప్పి అధికమవుతుంది. విశ్రాంతి వలన నొప్పి తగ్గుతుంది. వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా త్రాగుతారు. మానసికంగా వీరికి కోపం ఎక్కువ. వీరిని కదిలించకూడదు. కదలికల వలన వీరికి బాధలు ఎక్కువగుట గమనించదగిన లక్షణం. ఈ మందులే కాకుండా కాక్యులస్, రస్‌టాక్స్, ఆర్నికా, కాల్కేరియా కార్బ్, సల్ఫర్, రూటా, కాలికార్బ్, కోలోసింత్, మాగ్‌ఫాస్, కాల్కేరియా ఫాస్, కాల్కేరియా ఫ్లోర్, కాల్మియా, సింఫైటినం వంటి మందులను లక్షణ సముదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల డిస్క్ సమస్యల (స్పాండిలోసిస్) నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్ 9440229646