సంజీవని

తల తిరగడం.. వ్యాధి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరాల సమస్యలు మనిషిని తీవ్రంగా బాధపెడుతుంటాయి. మెదడు నుంచి శరీర భాగాలకి, శరీర భాగాలనుంచి మెదడుకి సమాచారాన్ని అందించే ప్రత్యేక వ్యవస్థ ఇది. నరాల సమస్యలవల్ల స్పందన లేకపోవడం, అధిక స్పందన, తక్కువ స్పందన లాంటివి కలుగవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలు తల తిరగడం, కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించడం, వాంతులు వస్తున్నట్టు ఇబ్బంది పెట్టడం జరుగుతుంటాయి. నరాల సమస్యల్లో మనకి ప్రధానంగా కనిపించేవి ‘వెర్టిగో’. తల తిరగడం ఒక వ్యాధి కాదు. కానీ లోపాలకు, వ్యాధులకి ఇది లక్షణం. వెర్టిగో నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వరకు ఏ అనారోగ్యంలోనైనా తల తిరగవచ్చు. దానికి ఆడ, మగ భేదం లేదు. చిన్న పెద్ద వయసు భేదం లేదు. ఎవరికైనా రావచ్చు.
తల తిరగడానికి కారణాలు ఏమిటి?
చెవిలో వెస్టిబ్యూలార్ సిస్టమ్ దెబ్బ తినడంతో వెర్టిగో రావచ్చు. హఠాత్తుగా రోగికి ప్రారంభమై కూర్చున్నా, లేదా పడుకున్నా, భంగిమల్ని మార్చినా, ఒక పక్క నుంచి మరో పక్కకి ఒత్తిగిల్లుతున్నా నొప్పి ఎక్కువ అవుతుంది. ఇది 5-10 సెకండ్ల వరకు ఉండవచ్చు. బాగా ఎక్కువగా వచ్చినపుడు వాంతులు, కళ్ళు తిరగడంతోపాటు చెమట అధికంగా పట్టవచ్చు. చెవి లోపలి ద్రావకంలో చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఏర్పడటంవల్ల బినాయిస్ వెర్టిగో రావచ్చు. దాంతోపాటు చెవికి ఇన్‌ఫెక్షన్, జలుబు లాంటివి కలుగవచ్చు. మందులతో తగ్గిపోతుంది.
ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?
వెర్టిగో రోగికి ఈ కింది లక్షణాలు ఉన్నపుడు వెంటనే వైద్యుడ్ని కలవలడం అవసరం.
స్పృహ తప్పడం
తీవ్రమైన తలనొప్పి
శ్వాసించలేకపోవడం
ఎక్కువ లేక తక్కువ లేక ఒక పద్ధతి లేకుండా గుండె కొట్టుకోవడం
తీవ్రంగా వాంతులు అవుతున్నపుడు
ఫిట్స్
నడవడం కష్టమైనపుడు / దృష్టి దెబ్బతిన్నపుడు
ఈ మధ్యే బి.పి. మందుల్ని ప్రారంభిస్తుంటే, సైడ్ ఎపెక్ట్ కావచ్చు.
ఈ మధ్య తలకు గాయమైనా...
ప్రథమ చికిత్స
గిడ్డినెస్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని హెచ్చుతగ్గులు లేని ప్రదేశం మీద పడుకోబెట్టాలి. వాళ్ళని వెల్లకిలా లేక పక్క రోగి వీలుని బట్టి పడుకోబెట్టాలి. హఠాత్తుగా లేవకూడదు. కదలికలు చేయకూడదు. పెద్దవాళ్ళ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. హఠాత్తుగా పడిపోయి ఫ్రాక్చర్‌లు అయ్యే ప్రమాదం వుంది. వాంతులు వస్తే తగ్గడానికి మందులు ఇవ్వాలి. పల్స్, రక్తపోటు లాంటివి గమనిస్తుండాలి. ద్రావకాలు ఇస్తుంటే వాంతులవల్ల కలిగే డీహైడ్రేషన్ నుంచి కాపాడవచ్చు.
ఆహారం - మందులు.. ఎక్కువగా టీ, కాఫీ, ఆల్కహాల్ లాంటివి తీసుకోవడంవల్ల తల తిరగవచ్చు. నిద్రకి మందులు వాడే వాళ్ళకి వెర్టిగో వచ్చినపుడు సమస్యలు కలుగవచ్చు. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉన్నపుడు ఆహార నియమాలు పెద్దగా వుండవు. కొన్ని కొన్ని వ్యాయామాలు ఉపశమనాన్ని కలిగించవచ్చు.