సంజీవని

బొల్లికి చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: శరీరం మీద చాలా చోట్ల బొల్లి మచ్చలు ఉన్నాయి. పిల్లలకు వచ్చే ప్రమాదం ఉన్నదా? నివారణ సూచించండి.
-పి.జె. (సికింద్రాబాద్)
జ: తల్లికో, తండ్రికో బొల్లి ఉన్నంతమాత్రాన పిల్లలూ అలానే పుట్టాలన్న రూలేమీ లేదు. దాని కారణాన్ని ఇంతవరకూ ఇదని నిర్థారించలేదు. కాబట్టి, తల్లిదండ్రులకో చుట్టాలకో బొల్లి ఉంటే వాళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకోవటానికి అభ్యంతరం చెప్పటం అర్ధంలేని నమ్మకమే అవుతుంది. అత్యాధునిక పరిశోధనలు దీన్ని ఎలెర్జీకి సంబంధించిన వ్యాధిగానే భావిస్తున్నాయి. బొల్లి మచ్చలో పెరుగుదలను అరికట్టటం, తెలుపు విరిగి చర్మపు రంగులోకి మారటం అనే రెండు దశల్లో చికిత్స నడుస్తుంది. ఆరోగ్యవంతమైన చర్మపు కణాలతో అంటుకట్టే పద్ధతిలో ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. బొల్లి ఇంకా పెరగకుండా స్థిరపడింది అనే నమ్మకం కుదిరాకే ఈ చికిత్స సాధ్యం అవుతుంది.
ఔషధాలతో చికిత్స తీసుకున్నపుడు కొత్తవి వస్తున్నాయని భయపడి, డాక్టర్లనీ, మందుల్ని మార్చేస్తుంటారు. కొత్త మచ్చలు వచ్చే పరిస్థితి శరీరంలో కొనసాగుతున్నంత కాలం, మందులు వాడుతున్నా మచ్చలు కొత్తగానే వస్తూనే ఉంటాయి. కానీ, జూనియర్ మచ్చలు ముందు తగ్గుతాయి. సీనియర్ మచ్చలు ఆలస్యంగా తగ్గుతాయి. అందువలన కొత్త మచ్చలకు భయపడకుండా చికిత్స కొనసాగించటమే ఉత్తమం. పాతవాటితో పాటు కొత్తవి కూడా నెమ్మదిగా తగ్గుతాయి. ఈ వ్యాధి పెరగటం ఎంత నెమ్మదిగా ఉంటుందో తగ్గటమూ అంతే నెమ్మదిగా ఉంటుంది.
వౌలికంగా ఇది వాత వ్యాధి! శరీరానికి రంగునిచ్చే భ్రాజక పిత్త ధాతువు దోషంగా మారటం వలన చర్మంలోంచి నల్లరంగునిచ్చే పదార్ధం మాయమైపోయి అక్కడ తెల్ల మచ్చ ఏర్పడుతోంది. త్వక్ వైవరణ్యత అంటే చర్మం తన సహజ వర్ణాన్ని కోల్పోయి తెల్లగా మారటం అనేది చర్మం స్థాయిలోనే ఉన్నప్పుడు చికిత్సకు సాధ్యం అవుతుంది. అది ధాతుగతమైనప్పుడు అసాధ్య వ్యాధిగా మారుతుంది.
ఈ వ్యాధి రావటానికి కారణం ఇదని స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ, మన ఆహార విహారాల ప్రభావాన్ని కొట్టేయలేము. రంగులు వేసిన ఆహార ద్రవ్యాలు, కల్తీలు కలిసిన నెయ్యి, నూనె, పాల పదార్థాలు, మళ్లీ మళ్లీ కాచిన నూనెలో వేగినవి, నల్లగా, మాడినవీ కష్టంగా అరిగేవి, రంగులు, రసాయనాలు కలిసిన కూల్‌డ్రింక్‌లు, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు ఇవన్నీ తెలియకుండానే బొల్లికి కారణం అవుతున్నాయి. అవి మానకుండా, మనం మారకుండా వైద్యుణ్ణి మార్చి ప్రయోజనం ఉండదు.
ఎక్కువ మంది రోగులు మేం అట్లాంటివి తినం అంటూ, వైద్యుణ్ణి జాగ్రత్తలు చెప్పనియ్యరు. చాలా మంది విషయంలో ఇది వాస్తవం. కష్టంగా అరిగే ఆహార పదార్ధాలన్నీ బొల్లిని పెంచుతాయని గమనించాలి. కల్తీలు కలిసే అవకాశం ఉన్న ఆహారద్రవ్యాలన్నీ బొల్లిని తెస్తాయి. నెయ్యి, నూనె, తేనె, పాలు, పసుపు, కారం ఒకటేమిటి కల్తీకి కాదేది అనర్హం. బొల్లి రావటానికి కూడా కాదేది అనర్హమే. రంగులు కలిసిన ఆహారద్రవ్యాలు కూడా బొల్లికి కారణమే. ఆయుర్వేద చికిత్సలో సూర్యరశ్మికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మయూరుడు సూర్య నమస్కారాలు చేసి బొల్లి అనే శ్విత్రకుష్ఠు వ్యాధిని పోగొట్టుకొని కృతజ్ఞతగా సూర్యశతకం రాశాడనేది చరిత్ర.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, ఔఖూశ్ఘష్ద్ఘశజూపభఘౄజ.ష్యౄ

డా జి.వి.పూర్ణచందు