సంజీవని

కళ్ల కింధ వలయాలకు కారణాలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యకాలంలో చాలామందికి కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడి అందవిహీనంగా కనపడుతున్నారు. ఇలా తాము అందవిహీనులమవుతున్నామని భావించి మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లను, సబ్బులు వైద్యుల సలహా లేకుండా వాడటం వల్ల సమస్య తగ్గకపోగా ఇంకా ఎక్కువై మానసికంగా వేధించబడుతున్నారు.
కారణాలు :
సరిపడినంత నిద్ర లేకపోవడం, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన మానసిక ఒత్తిడి, స్ర్తిలలో బహిష్టులు సక్రమంగా లేకపోవడం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడుతుంటాయి.
నివారణకు జాగ్రత్తలు :
వేళకు నిద్రపోవాలి
మంచినీరు సుమారుగా 8 గ్లాసులు త్రాగాలి
కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కళ్లను మూసుకుని 2 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల కళ్లకు అలసట తగ్గుతుంది.
డాక్టర్ సలహా లేకుండా రకరకాల క్రీములను, లోషన్‌లను వాడకూడదు.
సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్, నిలువ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు.
ప్రకృతి సిద్ధమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలను, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ప్రతిరోజూ విధిగా కొంత సమయం యోగా, వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రయోజనం పొందవచ్చు.
మందులు :
కళ్ల చుట్టూ నలుపు వలయాలు పోవడానికి హోమియా వైద్యంలో మంచి మందులున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన మందులను ఈ క్రింద పొందుపర్చడం జరిగింది.
ఆర్సినికం ఆల్బం : ఈ మందు కళ్లచుట్టూ నలుపు వలయాలు పోవడానికి తప్పక ఆలోచించదగినది. నలుపు వలయాలు దురదగా ఉంటాయ. వీరికి మధ్యాహ్నం, అర్ధరాత్రి బాధలు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ ప్రత్యేక లక్షణం. కళ్ల చుట్టూ నలుపు వలయాలతో పాటు వీరికి కళ్ల నుంచి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, విపరీతమైన నీరసం, తరుచుగా దాహం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. మానసిక స్థాయిలో ఆందోళన, భయం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
నైట్రోమోర్ : హార్మోన్ల లోపం వల్ల కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడిన వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. వీరు మానసిక
స్థాయిలో కుంగిపోయి ఉంటారు. దుఃఖం పొర్లుకు వస్తుంది. నలుగురిలో కాకుండా వీరు
ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఓదార్పు మాటలు సహించలేకుండుట గమనించదగిన ప్రత్యేక లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఎఖినీషియా : కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడి పోవడానికి ఇన్‌ఫెక్షన్ గురై బాధిస్తున్నపుడు ఈ మందు మాత్రుదావణాన్ని దూదితో తీసుకొని పైపూతగా రాయడం వల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. ఈ మందు ఆంటిసెప్టిక్‌గా పనిచేసి ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా తగ్గిస్తుంది.
సైలీషియా కాల్కేరియా ఫ్లోర్ : కళ్ల చుట్టూ నలుపు వలయాల వల్ల ఏర్పడిన మచ్చలను ఈ మందులు తొలగిస్తాయి. ఇన్‌ఫెక్షన్ కూడా నివారిస్తాయి.
ఈ మందులే కాకుండా రస్‌టాక్స్, తూజా, బెల్లడోనా, లైకోపోడియం తదితర మందుల లక్షణ సముదాయాన్ని అనుసరించి మందులను వాడిన కళ్ల చుట్టూ నలుపు వలయాలు బాధ నుంచి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646