సంజీవని

‘లివర్ ఫెయిల్యూర్’ ప్రాణాంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెపటైటిస్‌లాంటి వ్యాధుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కో ప్రాంతాన్ని బట్టిలివర్ ఫెయిల్యూర్‌కి కారణాలు మారుతుంటాయి. విషపదార్థాలు, కొన్ని రకాల మందులు, ఆల్కహాల్, ఫాటీ లివర్ లాంటి ఎన్నో రకాల కారణాలు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి, దాని పనిని అది పూర్తిగా నిర్వర్తించలేని స్థితికి తీసుకువస్తాయి. 23 నుంచి 56.6 శాతం వరకు హెపటైటిస్-ఇ. హెపటైటిస్ ఎ, బిలు కూడా మనదేశంలో ఎక్కువ. హెచ్.ఐ.వి ముఖ్య కారణం. మందులు వల్ల మన దేశంలో లివర్ దెబ్బతినడం 4.6%.
మూత్రపిండాలు దెబ్బతింటే కొన్నాళ్ళపాటు డయాలసిస్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. ఊపిరితిత్తులు దెబ్బతింటే వెంటిలెటర్స్ మీద ఉంచవచ్చు. కాని లివర్ దెబ్బతింటే అలాంటి ప్రాణాలు కాపాడే పద్ధతులు లేవు. లివర్ పూర్తిగా దెబ్బతిన్నవారికి మార్పిడి ఒక్కటే మార్గం. లివర్ ఫెయిల్యూర్‌తో మరణించేవారు మనదేశంలో చాలా ఎక్కువ. అలాంటివారి సరైన గణాంకాలు మన దేశంలో లేవు. పాశ్చాత్యదేశాలలో ఒక మిలియన్ జనాభాలో సంవత్సరానికి 8 నుంచి 10 మంది వరకు మాత్రమే మరణిస్తున్నారు.
యుకెలో ఏటా 50 నుంచి 60 వరకు లివర్ మార్పిడులు జరుగుతున్నాయి. మన దగ్గర ప్రతి సంవత్సరం దాదాపుగా 7 నుంచి 12 వేలమంది లివర్ జబ్బులతో బాధపడుతున్నారు. వాళ్ళలో 1200 నుంచి 2000 మందికి లివర్ మార్పిడి జరగకపోతే మరణిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా రోజూ నలుగురైదుగురు లివర్ మార్పిడి జరగక మరణిస్తున్నారు.
లివర్ ఫెయిల్యూర్ అయినవాళ్ల సేవ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. లివర్ ఫెయిల్యూర్‌ని దృష్టిలో పెట్టుకుని ఒక గ్రూప్ డాక్టర్స్ ప్రత్యేకంగా అటెండవుతారు. హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్‌లో ఇంతవరకూ 300కి పైగా లివర్ మార్పిడిలను చేసినా ప్రధాన కారణంగా వైరల్ హెపటైటిస్‌ని గుర్తించారు. 8 నుంచి 51 సంవత్సరాల వయసు వరకు ఈ లివర్ ఫెయిల్యూర్ని గుర్తించారు. ఒక రోగికి లివర్ మార్పిడి అవసరమైనప్పుడు ముందుగా లివింగ్ డొనర్ ఎవరైనా ఉన్నారా అని చూస్తారు.
మన శరీరంలో చనిపోయే వరకూ పెరిగే అవయవం లివర్ ఒక్కటే. మూడవ వంతు లివరుంటే చాలు, రెండు నెలల్లో మామూలు పరిమాణానికి పెరిగిపోతుంది. తీసుకున్న వాళ్లకి, ఇచ్చిన వాళ్లకి కూడా. రక్త సంబంధీకులే ఇవ్వాలి. లివర్ మాచ్ కావాలి. అత్యవసర పరిస్థితులలో లివింగ్ డొనర్ డొనేషన్ మేలు! దగ్గరవాళ్ల లివర్ మాచ్ కాకపోతే కెడావరిక్ డొనేషన్ కోసం ఎదురు చూడాలి. బ్రెయిన్‌డెడ్ అయినవాళ్ల నుంచి స్వీకరించే అవయవ దానాన్ని కెడారిక్ డొనేషన్ అంటారు. అవయవదానానికి వాళ్లవాళ్లు ఒప్పుకోవడం ప్రధానం. ఇక్కడ మరో ఇబ్బంది కూడా ఉంది. కెడావరిక్ డొనేషన్ ఎప్పుడొస్తుందో తెలీదు. వచ్చినా మాచ్ అవుతుందో లేదో అనుమానం. శస్తచ్రికిత్స అనంతరం కొన్నాళ్ళు ఐసియులో ఉంచి స్థిమితపడ్డాక డిశ్చార్జ్ చేస్తారు.
ఎక్యూట్‌లివర్ ఫెయిల్యూర్ ఎక్కువగా 20-40 సంవత్సరాల మధ్య వయసువాళ్లలో వస్తోంది. అంతకుముందు రోజువరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో కూడా హఠాత్తుగా ఈ ఎక్యూట్‌లివర్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. వీరికి లివర్ మార్పిడి జరగకపోతే మరణించే అవకాశాలు 80%. సకాలంలో లివర్ మార్పిడి చేయడంతో వీరిని రక్షించవచ్చు.
రోగ నిర్థారణ ఇపుడు ఆలశ్యమవుతోంది. కొంతమందిలో నిర్థారణకాక ముందే మరణం సంభవిస్తోంది. లివర్ దెబ్బతింటోందన్న లక్షణాల్ని గుర్తించలేకపోతున్నారు. కొంతమందిలో మాత్రమే ఎక్యూట్‌లివర్ ఫెయిల్యూర్ వున్నా సకాలంలో గుర్తిస్తే మందులతోనూ నయమవుతుంది. లివర్‌మార్పిడి అనేది రోగిని బ్రతికించడానికి చివరి మార్గముగా ఎంచుకుంటారు.
రోగనిర్థారణలో ఆలశ్యమై, సకాలంలో సరైన వైద్యం అందక తీవ్ర స్థాయిలో బాధపడుతున్నవాళ్లకి మార్పిడికూడా రిస్క్‌తో కూడుకున్నదే అవుతుంది. అందుకని శరీరంలో 500 పనులకు పైగాచేసే లివర్ ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకుంటూ ఉండాలి. రిస్క్ ఫాక్టర్‌లని గమనించి దూరంగా జాగ్రత్తగా ఉంటుండాలి. అనుమానంరాగానే సరైన వైద్యుణ్ణి కలవడం అవసరం. ఈ విషయాలన్నింటి పట్ల ప్రజలలో అవగాహన పెరగాలి. లివర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.