సంజీవని

వేవిళ్లు ఎక్కువైతే అవస్థలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భం వచ్చాక శరీరంలో జరిగే సహజమైన మార్పులవలన జీర్ణ వ్యవస్థ ప్రభావితమై 50-90 శాతం మంది గర్భిణీలకు వికారం, వాంతులు లేక వేవిళ్లు ఉంటాయి. ఇవి గర్భం సమయంలో ఎంత సాధారణమంటే వేవిళ్ళు గర్భం చిహ్నంగా భావించబడుతున్నాయి.
తల్లికి రాగల సమస్యలు
డీహైడ్రేషన్ వస్తుంది.
కళ్ళు లోతుకుపోతాయి.
ఎలక్ట్రొలైట్ సంతులనం దెబ్బతింటుంది. సోడియం తగ్గటంవలన బద్దకం, తలనొప్పి, గందరగోళం, తల తిరగడం ఉంటాయి. ఫిట్స్ రావచ్చు. పొటాషియం తగ్గటంవలన కండరాల బలహీనత, గుండె క్రమం తప్పి కొట్టుకోవడం వుంటాయి.
పోషకాల లోపం వస్తుంది. విటమిన్ల (బి1, బి6, బి12) లోపంవలన నరాల సమస్యలు, రక్తహీనత రావచ్చు.
బరువు తగ్గుతారు.
మూత్రం తక్కువ అవుతుంది.
స్థిమితం లేకుండా ఉంటుంది.
స్పృహ తప్పుతున్నట్లు అనిపిస్తుంది.
విపరీతమైన నీరసం ఉంటుంది.
శ్వాసలో ఘాటువాసన వుంటుంది.
బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది.
పల్స్ వేగం పెరుగుతుంది.
చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది.
అన్నవాహికలో చిన్న చిన్న చీలికలు రావచ్చు.
సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చకామెర్లు వస్తాయి.
బిడ్డకు
తక్కువ బరువుతో పుడుతుంది. దీర్ఘకాలిక సమస్యలేమైనా ఉండేదీ, లేనిదీ కచ్చితంగా తెలియదు.
పరీక్షలు
క్లినికల్ పరీక్ష: బ్లడ్‌ప్రెషర్, పల్స్ రేట్, కళ్ళు, నాలుక, చర్మం పరీక్ష
రక్తపరీక్ష: లివర్, కిడ్నీ, ఫంక్షన్, ఎలక్ట్రోలైట్ పరీక్షలు, మూత్రం పరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష.
ఈ లక్షణాలు ఉండే అవకాశం ఉన్న లివర్, జీర్ణవ్యవస్థ, నరాల సమస్యలు, మూత్ర వ్యవస్థ ఇన్‌ఫెక్షన్స్, కొన్ని మందుల వాడకం, మూత్ర పిండాలు, థైరాయిడ్ సమస్యలు, మధుమేహవ్యాధి, మానసిక సమస్యలు, తిన్న ఆహారాన్ని బలవంతంగా వాంతి చేసుకోవటం (బులీమియా), గర్భం సమయంలో వచ్చే ఫ్రీఎక్లాంప్సియా, ముత్యాల గర్భం, ఫాటీలివర్, ఒవేరియన్ సిస్ట్ మొదలవడం మొదలైనవేవీ లేవని నిర్థారించుకోవాలి.
చికిత్స
వాంతులు తక్కువగా అవుతున్నపుడు అనుసరించే చికిత్సా విధానంతోపాటు అదనంగా ఈ క్రింది చర్యల్ని తీసుకోవాలి.
హాస్పిటల్లో ఉంచి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ద్వారా వాంతుల్లో కోల్పోయిన నీరు, ఎలక్ట్రొలైట్స్, విటమిన్ల లోటును సరిదిద్దాలి.
వాంతుల్ని తగ్గించే మందుల్ని వాడాలి.
ట్యూబ్ ద్వారా ఆహారాన్ని ఇవ్వాలి.
వాంతుల కారణంగా తల్లికి ప్రాణాపాయ స్థితి వస్తే గర్భవిచ్ఛిత్తి చెయ్యవలసి రావచ్చు.
-డా ఆలూరి విజయలక్ష్మి

-డా ఆలూరి విజయలక్ష్మి