సంజీవని

ఛాతినొప్పి.. గుండెపోటుకు సంకేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండెకు రక్తసరఫరా అయ్యేటప్పుడు ఏ కారణం వల్లనైనా ఇబ్బంది ఏర్పడి రక్తప్రసరణ కష్టమవుతుంది. రక్తం పూర్తిగా ప్రవహించకపోవడంతో భరించలేని విధంగా ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి శరీరంలోని మిగిలిన భాగాలకు కూడా వ్యాపిస్తుంది. ఇలాంటి పరిస్థితిని గుండెపోటు లేదా హార్ట్‌ఎటాక్ అని అంటారు. నొప్పి లక్షణాలను బట్టి దీనిని మూడు రకాలుగా విభజించడం జరిగింది.
స్టేబుల్ యాంజైనా
చాలామందిలో ఎక్కువగా వచ్చే సాధారణమైన గుండె నొప్పి ఇది. ఈ నొప్పిని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయించుకుంటే గుండెపోటుకు గురి కాకుండా జాగ్రత్తపడవచ్చు.
దీనికి సంబంధించిన గుండెనొప్పి కేవలం కొద్ది నిముషాలు మాత్రమే ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే ఒకసారి ఈ నొప్పి వచ్చిన వాళ్ళు భవిష్యత్తులో గుండెపోటు వస్తుందని గుర్తించాలి. మెట్లెక్కడం, పరుగెత్తడం, కష్టమైన పనులు చేయడం వంటి వాటికి దూరంగా వుండడం చాలా అవసరం.
అన్‌స్టేబుల్ యాంజైనా
ఎలాంటి కారణాలు తెలియకుండా హఠాత్తుగా వచ్చే గుండెనొప్పిని అన్‌స్టేబుల్ యాంజైనా అని అంటారు. పదిహేను నిమిషాలకు మించి గుండె నొప్పి ఉంటే అది చాలా ప్రమాదకరమైన గుండెపోటుగా భావించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎన్ని మందులు వాడినా, విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గదు. దీని లక్షణాలు స్పష్టంగా కనిపించవు. కనుక దీన్ని గుర్తించడం చాలా కష్టం. వెంటనే కార్డియాలజిస్ట్‌ను కలిసి చూపించుకోవాలి.
వేరియంట్ యాంజైనా
సాధారణంగా విశ్రాంతి తీసుకునే సమయంలో ముఖ్యంగా రాత్రి సమయాల్లో హఠాత్తుగా వచ్చే గుండె నొప్పిని వేరియంట్ యాంజైనా అని అంటారు. ప్రశాంతంగా నిద్రపోతున్న వ్యక్తి ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చి మెలికలు తిరిగిపోతాడు. మందు వేసుకోగానే నొప్పి తగ్గుతుంది. నొప్పి అదుపులోకి రాకపోతే.. వెంటనే వైద్య సహాయం పొందాల్సి వుంటుంది.
కారణాలు
గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలుంటాయి. వాటిలో ముఖ్యంగా కనిపించేవి కొన్ని. వీటిపట్ల తగిన అవగాహనతో వుండాలి. శారీరక శ్రమ అసలు లేకపోవడం వలన, ఆహారపు అలవాట్లవలన 80 శాతం మందిలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వస్తుంది. మానసిక ఆందోళన కారణంగా గుండెమీద ఒత్తిడి పెరిగి గుండెపోటు వస్తుంది. వంశపారంపర్యంగా కూడా 40 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. మద్యపానం, ధూమపానం వంటివి గుండెపోటు రావడానికి కారణాలు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే అవకాశం వుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంవల్ల హార్ట్ ఎటాక్ రావచ్చు. మధుమేహం, హైబీపీ నియంత్రణలో లేని వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కూడా గుండెపోటు రావడానికి దోహదం చేస్తాయి.
లక్షణాలు
రక్తప్రసరణలో అడ్డు ఏర్పడినపుడు గుండె కండరానికి కావాల్సిన రక్తం అందకపోతే, ఛాతీ మధ్యభాగంలో భరించలేని నొప్పి వస్తుంది. దీనినే గుండెనొప్పి లేదా గుండెపోటు అంటారు.
ఈ నొప్పి శరీరంలోని మిగతా భాగాలకు కూడా వ్యాపించడం జరుగుతుంది. మెడ నరాలకు, రెండు భుజాలకు, దవడకు, గడ్డానికి కూడా నొప్పి వస్తుంది. వెన్నుపూసకు కూడా ఈ నొప్పి వ్యాపించవచ్చు. అజీర్తిలాగా కడుపు పైభాగంలో కూడా నొప్పి వస్తుంది. ఈ నొప్పితో పాటు శరీరం చల్లబడిపోవడం, చల్లని చెమటలు పోయడం, బట్టల్లో మూత్రం పడిపోవడం, వాంతి కావడం, తెలియకుండానే విరేచనం కావడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ ఎడమ భాగంలో వచ్చే నొప్పి ఎడమ భుజానికి, చేతి వేళ్ళ వరకూ పాకుతుంది. ఛాతీ అంతా బిగించినట్టుగా గుండె భారంగా ఉంటుంది. గొంతు దగ్గర పట్టేసినట్లుగా ఉండి, తడి ఆరిపోయి మాట్లాడలేకపోతారు. కళ్ళు తిరగడం, స్పృహ తప్పడం జరగవచ్చు. గుండె జబ్బులను, హార్ట్ ఎటాక్‌ను నిర్థారించడానికి చాలా రకాలైన పరీక్షలున్నాయి. అవి- ఇసిజి, టిఎంటి, ఎకోకార్డియోగ్రామ్, కరొనరీ యాంజియోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్ మొదలైనవి వ్యాధి నిర్థారణను బట్టి చికిత్స ఉంటుంది.

డా.రవికుమార్ ఆలూరి
చీఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్, (కిమ్స్)
98480 24638

డా.రవికుమార్ ఆలూరి