సంజీవని

మోముకు వనెన తెచ్చే పలువరుస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కటి చిరునవ్వుని చిందించాలంటే తళుక్కుమనే పళ్ళ వరుస ఉండాలి. చక్కటి పెదాలు ఉండాలి.
ఈ రెండు సరిగ్గా ఉండకపోతే నవ్వు ముఖానికి అందం ఇవ్వదు సరికదా వికారాన్ని ఇస్తుంది. వికారమైన నవ్వుతో ఎదుటి మనుషులు బాధపడతారు. వికారపు నవ్వు నవ్వుతున్న వ్యక్తులు న్యూనతకు గురవుతారు. దాంతో అస్సలు నవ్వడమే మానుకుంటారు కొందరు. మరికొందరు నవ్వేప్పుడు చెయ్యో, కొంగో అడ్డుపెట్టుకుంటారు.
చిరునవ్వు సరిగ్గాలేదని కృంగిపోకండి. చిరునవ్వుని సరిదిద్దుకోవచ్చు. నవ్వుకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. చక్కటి చిరునవ్వుతో ఎదుటి వ్యక్తులు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు.
అప్పట్లో జంతువుల దంతాల్ని తీసి ఊడిపోయిన పళ్ళ స్థానంలో అమర్చేవారు. క్రమంగా విప్లవాత్మకమైన మార్పులతో దంత వైద్యం ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పడింది. పళ్ళు, కణజాలాలు, కండరాలు, ఎముకలు, కీళ్ళు ఒక సమన్వయంతో పనిచేయడంతో నవ్వుతున్నా మాట్లాడుతున్నా అందంగా ఉంటుంది. అందమైన నవ్వుకోసం వీటిమధ్య ఏమాత్రం సమన్వయం లేకపోయినా, సమన్వయంగా ఉండేట్టు తీర్చిదిద్దడమే కాస్మటిక్ సర్జరీలో ఒక భాగం.
నోటికి సంబంధించిన అన్ని ఉండాల్సిన ఎత్తు, లావు, అమరిక ఇతర అవయవాలతో సమన్వయం ఉండని వాటిని ప్లాస్టిక్‌సర్జరీతో సరిచేయవచ్చు. సరిచేసే పద్ధతులు- ఆర్థోడాంటిక్స్, ఆర్థోజ్గ్థాక్ సర్జరీ, పెరియోడాంటల్ థెరపీ, కాస్మటిక్ డెంటీస్ట్రీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు.
ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ముఖంలోని వికారాన్ని పోగొట్టి అందాన్ని ఇవ్వడానికి తోడ్పడేది ప్లాస్టిక్ సర్జరీ. మామూలుగా పళ్ళని సరిచేస్తే వికారంపోతుందని భావిస్తాం. పళ్ళని పద్ధతిగా తీర్చిదిద్దడంతోపాటు పెదాలని అందంగా మలచాలి. పెదాలు ఎందుకు ముఖ్యం అంటే చిరునవ్వుకి అవే సరిహద్దులు. ముక్కుమీద నుంచి పొడవుగా ఒక లైన్‌ని తీసుకోవాలి. మొహం వెడల్పు కళ్ళ పరిమాణంతో సరిపోవాలి. కనుపాపనుంచి గడ్డం దగ్గర వరకు ఉండే దూరం ముఖం వెడల్పుకి సరిపడా ఉండాలి.
తలమీద నిలువునా మూడు భాగాలుగా గుర్తించాలి. తల దగ్గరనుంచి ఐబ్రోవరకు ఒక భాగం, ఐబ్రోలైన్ నుంచి ముక్కు చివరి దాకా, రెండో భాగం, ముక్కుక్రింద నుంచి గడ్డం వరకు మూడో భాగం. ముఖాన్ని రెండు భాగాలుగా విభజిస్తే, కళ్ళు మధ్యగా ఉంటాయి. ముఖం క్రింది భాగంలో ముక్కు దగ్గరనుంచి గడ్డం వరకు ఉండే భాగాన్ని రెండుగా చేయవచ్చు. పై పెదవి ఆ భాగంలో 3వంతుల్లో, ఒక వంతు భాగాన్ని ఆక్రమిస్తుంది.
ముఖాన్ని చూడగానే అది గుండ్రంగానో, కోడిగుడ్డు ఆకారంలోనో, చతురస్రంగానో కనిపిస్తుంది. రూపాన్ని తగ్గట్టుగా... అంటే మనం చెప్పుకున్న లెక్కల ప్రకారం, ముఖం ఏ ఆకారంలో ఉన్నా కళ్ళు, ముక్కు, చెవులు, గడ్డం ఉండాలి. ఈ ఆకారాన్నిబట్టే పళ్ళు ఎలా ఉండాలో, ఏ ఆకారంలో ఉండాలో నిర్ణయించవచ్చు.

డా.సుధీర్
డెంటిస్ట్, సూపర్ స్పెషాలిటీ హస్పిటల్,
అమీర్‌పేట, 9885012444

డా.సుధీర్ 9885012444