సంజీవని

గుంఢెకు గండం డయాబెటిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డయాబెటిస్ ఎక్కువగా ఉండడంవల్ల వచ్చే గుండె జబ్బుల్ని ‘డయాబెటిక్ హార్ట్ డిసీజెస్’ అంటారు. వీటిలో కరొనరి హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిక్ కార్డియోమయోపతి ముఖ్యమైనవి. డయాబెటిస్ టైప్ 1, టైప్ 2 రెండు విధాలుగా బాధపడుతున్నవాళ్ళకీ డయాబెటిస్ హార్ట్ డిసీజెస్ రావచ్చు. బ్లడ్ సుగర్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం అంత ఎక్కువ.
ధూమపానం, అధిక రక్తపోటు, అధిక బ్లడ్ కొలెస్ట్రాల్ లాగానే డయాబెటిస్ కూడా గుండెకి ప్రమాదం. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవాళ్ళలో గుండెకి రక్తం సరఫరా చేసే కరొనరి ఆర్టెరిస్ గోడల లోపలి భాగంలో కొవ్వు పేరుకుపోయి, గుండెకి రక్తసరఫరా తగ్గుతుంది. క్రమంగా రక్తనాళాలు పూడుకుపోవచ్చు కూడా. అడ్డంకులవల్ల గుండెకి రక్తప్రసరణ సరిగ్గా లేక హార్ట్‌ఎటాక్ రావచ్చు.
రక్తనాళాలలో పేరుకుపోయే అడ్డంకులలో కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియంతోబాటు రక్తంలోని మరికొన్ని పదార్థాలు ఉంటాయి. ఇలా అడ్డంకులేర్పడడాన్ని ఎథిరోస్ల్కీరోసిస్ అంటారు.
కరొనరి, హార్ట్ డిసీజ్‌వల్ల ఛాతిలో నొప్పి లేక అసౌకర్యం కలుగుతుంది. దీనిని ఎంజైనా అంటారు. గుండె పద్ధతి ప్రకారం కాక ఇష్టం వచ్చినట్లు కొట్టుకోవడం, హార్ట్ ఎటాక్ లాంటివి వచ్చి మరణం సంభవించవచ్చు.
అడ్డంకులవల్ల గుండెకి రక్తసరఫరా తగ్గి ఆక్సిజన్, ఆహారం సరిగా అందక ముందు గుండె కండరాలు దెబ్బతింటాయి. దాంతో గుండె ముడుచుకుని కావలసినంత రక్తాన్ని శరీరావయవాలలోకి నెట్టలేకపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్ కలగవచ్చు.
హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె ఆగిపోవడం కాదు. గుండె నీరసించి కావలసినంత రక్తాన్ని శరీర భాగాలలోకి నెట్టలేకపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్‌లో త్వరగా అలసిపోతారు. అప్పుడు చేసే పనుల్ని తగ్గించుకోవలసి వస్తుంది. ఇదీ ప్రాణాంతక పరిస్థితి. దీనికి ఎథిరోస్క్లీరోసిస్ కారణం.
గుండె నిర్మాణం, పని తీరు కూడా దెబ్బతింటుంది ‘డయాబెటిక్ కార్డియో మయోపతి’తో. దీనితో హార్ట్ ఫెయిల్యూర్ ఎరిథ్మియా.. గుండె క్రమ పద్ధతిని వీడి కొట్టుకోవడం డయాబెటిస్‌వల్ల జరుగుతుంటాయి.
డయాబెటిస్ అధిక బరువు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్‌లాంటి రిస్క్ ఫాక్టర్‌లతో కలిస్తే గుండెకి మరింత చేటు.
కాబట్టి డయాబెటిస్ ఉంటే డయాబెటిక్ హార్ట్ డిసీజెస్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. జీవన విధానాన్ని మార్చుకుని రిస్క్ ఫాక్టర్స్ తగ్గేలా చూసుకోవాలి. వ్యాయామం చేసి అధిక రక్తపోటుని తగ్గించుకోవాలి. బరువుని, ఒత్తిడిని తగ్గించుకుంటూ డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిక్ హార్ట్ డిసీజెస్ రాకుండా జాగ్రత్తపడుతుండాలి. ఒకవేళ డయాబెటిక్ హార్ట్ డిసీజెస్ ఇప్పటికే ఉంటే సకాలంలో సరైన వైద్యాన్ని తీసుకుంటూ హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి.
*