సంజీవని

చిట్కా వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైడ్రోసిల్- బోదకాళ్ళకు- బొప్పాయి ఆకులు నూరి కట్టాలి. లేకపోతే తెల్ల జిల్లేడు వేళ్ళని గంజితో గాని, మేక పంచితముతోగాని నూరి లేపనం చేయాలి.
వీళ్ళు శీర్షాసనం, త్రికోణాసనం, వాలాసనం, విపరీతకరణి ముద్ర రెండు నిముషాలు వేయాలి.
ఆసనాలను ఎలాబడితే అలా వేయకూడదు. అనుభవజ్ఞుల పర్యవేక్షణలో వేయాలి. అలాగే తమ శారీరక పరిస్థితిని నిష్ణాతులకు చెప్పి, వేయవచ్చన్న ఆసనాలనే వేయాలి. ప్రారంభించడానికి ముందు నిపుణుల సలహా చాలా అవసరం.
జీడిమామిడి పండు, పొగాకు, బొప్పాయి కాయ, మేక సంచితము, ఆముదము, గచ్చకాయ కలిపి కట్టాలి. వావిలాకును వెచ్చజేసిగాని, గచ్చ చిగుళ్లను ఆముదంతో ఉడికించి గాని వృషణాలకు కట్టాలి. నాగదంతిలో బెల్లం వేసి మెత్తగా నూరి కడితే చంకలలోని గడ్డలు, వరిబీజము తగ్గుతాయి.
ప్రకృతి చికిత్సలో అయితే పుదీనా, తేనె, నీరు కలిపి త్రాగాలి. చింతచిగురు పచ్చడి అన్నంతో తినాలి. టీ స్పూన్ తేనె నిమ్మరసంతో కాచి, చల్లార్చి ఒక గ్లాసుడు నీటిలో కలిపి త్రాగాలి.
కారెట్, తోటకూర, పొన్నగంటికూర, చుక్కకూర, దోస, దొండ, పొట్ల, బీర, బటానీ, టమోటాలు మంచిది. ద్రాక్షపండు, రేగు, నారింజ, అరటి, తియ్యటి దోసకాయ, అత్తిపళ్ళు, జల్దారుపళ్ళు ఈ ఇబ్బందులు పడుతున్నవాళ్ళు తినడం చాలా మంచిది.
మలబద్ధకముంటే హలాసనము, ధనురాసనము, అర్థ మత్స్యేంద్రాసనము, వజ్రాసహలని రెండున్నర నిముషాలపాటు వేయాలి.