సంజీవని

కడుపునొప్పికి ఆయుర్వేద నివారణ (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-కె.వి.పి.లక్ష్మి (తిరువూరు)
కాదేదీ కడుపునొప్పికి అనర్హం! మనం చేసే పనులు, తినే తిండి, తాగే పానీయాలు వీటన్నింటీ అతి సేవన వలన కడుపునొప్పి పిలవకుండానే పలుకుతుంది. పేగు పూత, గాల్ ‘బ్లాడర్’లో రాళ్లు, మూత్రపిండాల్లో రాళ్లు, అజీర్తి, ఎపెండిసైటిస్, నులిపురుగులు, అమీబియాసిస్.. ఇంకా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధులూ కడుపునొప్పికి కారణం కావచ్చు. వీటికి ఆహార విహారాలు ప్రధాన కారణాలు కావచ్చు.
కడుపులో నొప్పి రావటానికి మనం అమాయకంగా చేసే కొన్ని పనులు కూడా కారణమవుతాయి. మల మూత్రాలకు వెళ్లకుండనా, అపాన వాయువు వదలకుండానూ బిగబట్టుకుని వాయిదా వేసే అలవాటు కడుపునొప్పి తెచ్చి పెడ్తుంది. తన జీర్ణశక్తికి మించి కఠినంగా అరిగే ఆహార పదార్థాలు తినటం కూడా కడుపునొప్పికి దారి తీస్తుంది. వేళాపాళా లేని ఆహారపు అలవాట్లు, అతిగా మసాలాలు, అతి పులుపు పదార్థాలు, గొడ్డుకారం వంటకాలు కడుపునొప్పికి కారణమవుతాయి. ఎండు చేపలు, ఎండు మాంసం, శుష్కించిన కూరగాయలు బాగా తినగటం, శనగపిండి, మైదాపిండి, అతిగా తింటే కడుపునొప్పి వచ్చే తీరుతుంది. దాహమైతే అన్నం తినటం, ఆకలైతే నీళ్లు తాగటం కడుపునొప్పికి కారకాలే! అర్ధరాత్రి ఆఖరి సీరియల్ అయ్యేదాకా నిద్ర పోకపోవటం, కాఫీ, టీలు, సిగరెట్లు అదే పనిగా తాగటం, మద్యపానం కడుపునొప్పిని తెచ్చిపెట్టేవే!
జీర్ణశక్తిని దెబ్బకొట్టే ప్రతీ అంశమూ కడుపులో నొప్పిని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. మనం జీవించే పద్ధతి, మన అలవాట్లు, ఆహార విహారాలు పేగుల్ని కాల్చుకు తింటున్నాయని, అది తట్టుకోలేక శరీరం పెట్టే ఘోష కడుపునొప్పి అని అర్థం చేసుకోవాలి. పొట్టలోపల అవయవాలలో వాపు, వాటిలో దేనికైనా రక్త సరఫరా సరిగా జరకపోవటం, పేగు లోపలి పొరల్లో అతి సున్నితత్వం ఏర్పడి పేగు కండరాలు ముడుచుకుపోయి, జీర్ణాశయ వ్యవస్థను దెబ్బతీసే ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా పేగుపూతకు కారణం కావచ్చు.
పొట్ట ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, అర్ధరాత్రి పూట గొంతులోకి ఆమ్లాలు ఎగజిమ్మే ఘఒఆ్య ళఒ్యఔ్ద్ఘ్ళఘ ళఛిఖన జూజఒళ్ఘఒళ అనే వ్యాధి, గుండెల్లో మంట, ఉరోభాగంలో నొప్పి ఇవి కడుపునొప్పికి సహచరులు. శోష, దప్పిక, కడుపులో మంట, మూత్రంలో మంట, మూత్రానికి వెళ్తున్నప్పుడు నొప్పి, మల మూత్రాలు సరిగా అవకపోవటం, పొట్ట బిగదీసినట్టు ఉండటం లాంటి లక్షణాలు కడుపునొప్పి ఒక వ్యాధిగా రూపొందుతోందనటానికి సాక్ష్యా లు కావచ్చు. పొట్ట లోపలి
అవయవాలు భద్రంగా లేవనటా నికి సంకేతా లూ కావచ్చు.
తరచూ కడుపునొప్పి వస్తున్నదంటే జీర్ణశక్తి బలంగా లేదని అర్థం. తేలికగా అరిగే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వాము, ధనియాలు, జీలకర్ర, శొంఠి, మిరియాలను సమానంగా తీసుకుని మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. దీన్ని అన్నంలో కారప్పొడిలాగా తినవచ్చు. గ్లాసు మజ్జిగలో ఒక చెంచా పొడిని కలిపి తాగవచ్చు. జీర్ణశక్తి పెరుగుతుంది. నొప్పిని ప్రేరేపించే కారణాలు ఆగుతాయి. కేరెట్, ముల్లంగి రెండింటి రసం తీసి తాగితే పేగుల్లో ఉద్రేకం తగ్గి నొప్పి నెమ్మదిస్తుంది. చేమంతి పూలను నీళ్లలో వేసి చిక్కగా టీలాగా కాచుకొని తాగితే కడుపునొప్పి నెమ్మదిస్తుంది. పుదీనా ఆకులు, తులసాకులు, మిరియాల పొడి తగుపాళ్లలో చేర్చుకుని టీ లాగా కాచుకుని తాగితే నొప్పి ఉపశమిస్తుంది. వసకొమ్ము అరగదీసిన గంధాన్ని పిల్లలకు తేనెతో తినిపిస్తే నొప్పి, ఉబ్బరం తగ్గుతాయి. సునాముఖి ఆకు చారు కాచుకుని తాగితే విరేచన బద్ధత వదిలి నొప్పి ఉపశమిస్తుంది. పొట్ట బిగదీసుకుపోవటం తగ్గుతుంది. తియ్యని పెరుగులో పంచదార కలుపుకుని గానీ, పెరుగు మీద మీగడలో లేదా వెన్న లేదా పేరునెయ్యిలో పంచదార కలుపుకుని గానీ తింటే నొప్పి ఉపశమిస్తుంది. బిరియానీ ఆకుల పొడిని నీళ్లలో వేసి చిక్కగా కాచిన కషాయం కడుపులో వచ్చే అనేక అనర్థాలను తగ్గిస్తుంది.
ఉదయభాస్కర రసం, గ్రహణీ గజకేసరి, అవిపత్తికర చూర్ణం, స్వాఢిష్ట విరేచన చూర్ణం, తాళీసాది చూర్ణం, జాతీఫలాది చూర్ణం లాంటి అనేక ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ముఖ్యంగా పేగుపూత విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. వైద్యుడి సలహా మీద మందులు వాడటం మంచిది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,

డా జి.వి.పూర్ణచందు