సంజీవని

దీర్ఘ ఉచ్ఛ్వాసంతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీర్ఘ నిశ్వాసలో 1500 ఘనపు సెంటీమీటర్ల గాలి మాత్రమే ఊపిరి తిత్తులలో ఉండిపోతుంది. వెంటనే దీర్ఘ ఉచ్ఛ్వాసము తీసుకుంటే 3500 ఘనపు సెంటీమీటర్ల గాలి ఊపిరి తిత్తులలోకి చేరుతుంది. ఇలా దీర్ఘంగా ఊపిరి పీల్చి విడవడంవల్ల వాయువ్యాపనను 8నుంచి 10 రెట్లు అధికం చేయవచ్చు. ఆరోగ్య రీత్యా అందరూ దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిత్యం అభ్యసించడం మంచిది.
స్టెతస్టోప్‌ని డాక్టర్ గుండె మీద పెట్టి చూస్తుంటారు. దీని ద్వారా శ్వాస శబ్దాల్ని వినవచ్చు. ఊపిరి తిత్తులలో, శ్వాస నాళాలలో ఏమి జరుగుతోందో ఈ శబ్దాలతో తెలుసుకోవచ్చు. మామూలుగా ఉండాల్సిన శబ్దాలకన్నా భిన్నమైన శబ్దాల్నిబట్టి న్యుమోనియా ఉంటే కీచుశబ్దం, ఆస్తమా లాంటి జబ్బు ఉంటే ఈలల్లాంటి శబ్దం వినిపిస్తుంది.
దగ్గు- క్రిమి దోషంవల్ల, యాంత్రికమైన ఇరిటేషన్‌వల్ల వచ్చే రిఫ్లైక్ట్స్. ఇది తీవ్రంగాను, దీర్ఘంగాను కూడా రావచ్చు. వెరింజైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా, బ్రాంకో న్యుమోనియా మొదలైన వ్యాధులు వచ్చినప్పుడు దగ్గు తీవ్రంగా వస్తుంది. దగ్గు- పొడి దగ్గుగాను, కళ్లెతో కూడిన తడి దగ్గుగాను వస్తుంది. కళ్లె తెల్లగా, పచ్చగా, చీముతో కూడినదిగానో ఉంటుంది. క్షయవ్యాధి వస్తే కళ్లెలో ఎర్రటి రక్తపు జీరలు కనిపిస్తాయి.
రక్తం దగ్గులో పడితే - అది శ్వాస అంగాలనుంచి వస్తోందో, కడుపులో నుంచి వాంతిగా వస్తోందో గమనించాలి. శ్వాస కోశం నుంచి వచ్చే రక్తం ఎర్రగా ఉంటుంది. అందులో నురుగు కూడా ఉండవచ్చు. రక్తవాంతి ఎక్కువగా ఉండవచ్చు. క్షయ, బ్రాంకైటిస్, శ్వాసాంగాల క్యాన్సర్‌ల్లో కూడా రక్తవాంతి ఎక్కువగా ఉంటుంది. మైట్రల్ స్టినోసిస్ అనే గుండె జబ్బు వచ్చినా రక్తవాంతి అవుతుంది. వక్షం ప్రాంతంలో ఏ మాత్రం వత్తిడి తగిలినా ఒక్కోసారి బాధ ఎక్కువగా ఉంటుంది. ఫ్లూరసి వచ్చినప్పుడు ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి పీల్చినప్పుడల్లా కూడా ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. కరోనరీ ఆర్టరీ ఇబ్బందివల్ల కూడా వక్షంలో బాధ రావచ్చు. ఇది హార్ట్ ఎటాక్‌కు దారితీస్తుంది. ఊపిరి పీల్చినప్పుడు కష్టమవుతుంటే దాన్ని ఆయాసం అంటారు. పరాయి వస్తువులు శ్వాసనాళంలో అడ్డం పడినప్పుడు, డిఫ్తీరియాలో మెంబ్రేన్ ఏర్పడడంవల్ల, గొంతు పిసికినప్పుడు, శ్వాస నాళంలో నంజు ఏర్పడినప్పుడు ఊపిరి పీల్చడం ఇబ్బందై ఆయాసం వస్తుంది. న్యుమోనియా, బ్రాంక్ న్యుమోనియా లాంటి అనారోగ్యాల్లోనూ ఆయాసం వస్తుంది. శ్వాసకోస అనారోగ్యాలుంటే హృద్రోగాలలోనూ మూత్రాంగ రోగాలలోనూ కూడా ఆయాసం రావచ్చు. అందుకని వక్ష ఎక్సరేతోపాటు కళ్లె పరీక్షతోనూ, శరీర పరీక్షతోనూ ఏ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నదీ తెలుసుకోవచ్చు.

-డా.బి.శ్యామసుందర్‌రాజు.. శ్వాసకోశ వైద్య నిపుణులు

-డా.బి.శ్యామసుందర్‌రాజు