సంజీవని

వణికిస్తున్న జికా వైరస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జికా వైరస్’ ప్రపంచాన్ని వణికిస్తోంది. అదింకా ఇండియా పొలిమేరలకు రాలేదు. అయినా యంత్రాంగం సన్నద్ధమవుతూంది. డెంగ్యూ వైరస్‌లాగానే ఇది కూడా ‘ఏడిస్’ అనే దోమ ద్వారానే వ్యాప్తి చెందుతుంది. దోమల ద్వారానూ, మనిషి నుంచి మనిషికి, తల్లి ద్వారా పిల్లలకు, సెక్సువల్‌గానే సంక్రమిస్తుంది. దోమ కుట్టిన రెండు నుండి ఏడు రోజుల లోపల వ్యాధి లక్షణాలు బహిర్గతమవుతాయి. జ్వరము, కీళ్లనొప్పులు, చర్మంపై దద్దుర్లు, కళ్లకలక వంటివి డెంగ్యూ వైరస్‌లాగానే వుంటాయి. మే 2015లో ‘పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్’ బ్రెజిల్‌లో మొట్టమొదటిసారి ‘జికా వైరస్’ కనుగొన్నట్లు ప్రకటించింది. బ్రెజిల్‌లో జికా వైరస్ బాగా వ్యాప్తి చెందింది. కాళ్లు చచ్చుబడటం, గర్భిణీలు అవకరమున్న శిశువుకు జన్మనివ్వడం, ప్రసవాలు సరిగా జరగకపోవడం జరిగాయి. జికా వైరస్‌తో చనిపోవడం చాలా అరుదు.
ఈ వ్యాధి రాకుండా దోమలను నివారించడం మేలు. నీళ్లు నిల్వ వున్న ప్రదేశాలు, మురికినీరు వుండకుండా చూడాలి. ఏసిలు, టైర్లు, కొన్ని పాత్రలలో నీళ్లు నిల్వ వుంటాయి. అటువంటి ప్రదేశాల్లో దోమలు ఉత్పత్తి చెందుతూ వుంటాయి. వాటిని నివారించాలి. దోమతెరలు వాడాలి.
డెంగ్యూ వైరస్‌లాగానే ఈ వైరస్ కూడా ‘ప్లేవీ’ వైరస్ గ్రూపునకు చెందినది. ఈ వైరస్‌పైవున్న ప్రొటీన్ ఎన్‌ఎస్4బి. దీని ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ విభజన చెందాలంటే ఏఎమ్404 అనే ప్రొటీన్ అవసరం. ఏ జ్వరమొచ్చినా మనం ‘పారాసిట్‌మాల్’ వాడుతూ వుంటాం. అదే జింకా వైరస్‌ని నిరోధిస్తుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. పారాసిట్‌మాల్ ఏఎమ్404ని నశింపచేస్తుందట. ఈ విషయాన్ని నెదర్లాండ్స్‌లోని రోనాల్డ్ వాన్‌రిజ్ కనిపెట్టారు. వైరస్ ఉత్పరివర్తనాలను, విభజనను పారాసిట్‌మాలే గాకుండా ‘రిబావరిన్’ అనే యాంటీ వైరల్ మందు కూడా వైరస్‌ని నిరోధిస్తుందట.
జికా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్ కేసులలో గుర్తించారట. ఇది దాదాపు సగం ప్రపంచ జనాభాతో సమానం. ఇందులో 2.5 శాతంమంది మృతి చెందారు.

-డా కె.శివ సుబ్బారావు