సంజీవని

మూలవ్యాధికి గృహచికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేయాల్సిన ఆసనాలు- పశ్చిమోత్తాసనం, హలాసనం, గోముఖాసనం, యోగముద్ర, ఉద్యానబంధం.
మూడు కరక్కాయల్ని మెత్తగా పొడి చేసి టీస్పూన్ ఆముదంతో కలిపి పడుకునే ముందు తాగాలి. కర్ర పెండలం కూర తినడం మేలు చేస్తుంది. మర్రి ఆకుల్ని కాల్చి మసిని నూనెలో కలిపి ఆ ప్రదేశంలో లేపనం చేయాలి.
ముదురు నల్లేరు ఎండబెట్టి ఆవు నేతితో వెచ్చచేసి, లోపలికి తీసుకోవాలి. ఎర్ర ఉత్తరేణి ఆకు రసం, ఆవు నెయ్యి కొంచెం కలిపి తాగితే రక్తం పడే మూల వ్యాధి తగ్గుతుంది.
కారట్, తోటకూర, కొత్తిమీర లాంటి వాటిని తీసుకోవాలి. మజ్జిగ బాగా తాగాలి. శరీర వెనుక భాగాన్ని (క్రింద) మర్దన చేయించుకోవాలి. చన్నీటి స్నానం మంచిది. బాగా మగ్గిన అరటిపళ్ళు తినాలి. నీళ్ళలో పటిక కలిపి వాడడం మంచిది.

-డా వేముల రామలింగేశ్వరరావు 9393430473